S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/25/2018 - 01:24

ముంబయి, నవంబర్ 24: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లో ఈ వారం నాలుగు రోజుల లావాదేవీలు మాత్రమే సాధ్యంకాగా, సెనె్సక్స్ దాదాపుగా స్థిరంగా కొనసాగింది. దేశ, విదేశీ వాణిజ్య రంగాల్లో పెద్దగా మార్పులు లేకపోవడంతో, స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ఆశనిరాశల మధ్య జరిగింది. అయితే, చెప్పుకోదగ్గ నష్టాలుగానీ, భారీ లాభాలుగానీ నమోదు కాలేదు.

11/25/2018 - 01:44

రాజస్థాన్‌కు చెందిన ఒక డీలర్ రెస్టారెంట్ వ్యాపారానికి కొత్త మార్గాన్ని అనే్వషించాడు. వినియోగం లేని విమానాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి, వాటిని రెస్టారెంట్స్‌గా మార్చేస్తున్నాడు. బెరర్‌లో ఈ విధంగా కొన్న విమానాలను ఒక మైదానంలో నిలిపి, వాటిని రెస్టారెంట్స్‌గా మార్చే పనిలో పడ్డాడు.

11/25/2018 - 01:20

బ్రసెల్స్, నవంబర్ 24: యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడానికి సంబంధించిన ఒప్పందాన్ని ఈయూ ఆమోదించడానికి రంగం సిద్ధమయింది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని ఆ దేశ ప్రధానమంత్రి థెరిసా మే మరోసారి గట్టిగా సమర్థించుకోనున్నారు. ఆదివారం బ్రసెల్స్‌లో జరిగే ఈయూ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు థెరిసా మే శనివారం బయల్దేరారు.

11/25/2018 - 01:19

ముంబయి, నవంబర్ 24: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి అల్లాడుతున్న జెట్ ఎయిర్‌వేస్ ఖర్చును తగ్గించుకునే పనిలో పడింది. అందులో భాగంగానే ప్లాటినం, గోల్డ్ కార్డు సభ్యులకు ఇంత వరకూ అందిస్తున్న కాంప్లిమెంటరీ లాంజ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించే ఈ కార్డు కలిగిన వారికి ప్రత్యేక సేవలు జెట్ ఎయిర్‌వేస్ అందిస్తున్నది.

11/25/2018 - 01:17

లండన్, నవంబర్ 24: ముడి చమురు ధర పతనం అంతర్జాతీయ మార్కెట్‌ను భయాందోళనకు గురి చేస్తున్నది. నిన్న మొన్నటి వరకూ అదుపులోకి రాకుండా ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేసిన క్రూడ్ ఆయిల్ ధర పతనం ప్రారంభమైంది. డిమాండ్‌ను మించిన సప్లయి పెరుగుదల ఈ పతనానికి కారణం. ఇరాన్ నుంచి పెట్రో ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా విధించిన ఆంక్షల కారణంగా డిమాండ్ పతనమవుతున్న విషయం తెలిసిందే.

11/25/2018 - 01:15

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము : రూ. 3,020.00
8 గ్రాములు : రూ.24,160.00
10 గ్రాములు : రూ. 30,200.00
100 గ్రాములు : రూ.3,02,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము : రూ. 3,229.947
8 గ్రాములు : రూ. 25,839.576
10 గ్రాములు : రూ. 32,299.47
100 గ్రాములు : రూ. 3,22,994.07
వెండి
8 గ్రాములు : రూ. 329.60

11/24/2018 - 02:47

ముంబయి: బులియన్ మార్కెట్‌లో శుక్రవారం ట్రేడింగ్ నిలకడలేకుండా సాగింది. దేశీయ నగల తయారీదారుల నుంచిగానీ, విదేశీ మదుపరుల నుంచిగానీ ఆశించిన స్థాయిలో డిమాండ్ లేకపోవడంతో, 10 గ్రాముల పసిడి ధర స్వల్పంగా, 90 రూపాయలు తగ్గి, 31,950 రూపాయలకు చేరింది. వాస్తవానికి కార్తీక మాసంలో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంటుందని గత మార్కెట్ గణాంకాలను పరిశీలిస్తే స్పష్టమవుతుంది.

11/24/2018 - 00:00

న్యూఢిల్లీ, నవంబర్ 23: పబ్లిక్ ఇష్యూలో అమ్మిన షేర్లలో 4.45 శాతం వాటాలను తిరిగి కొనేందుకు ఆయిల్ ఇండియా సిద్ధమైంది. 1,085 కోట్ల రూపాయలను చెల్లించి తిరిగి కొననుంది. పబ్లిక్ రంగ సంస్థలతోపాటు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు కూడా ద్రవ్య లబ్ధత తగినంత లేకపోవడంతో దారుణంగా నష్టపోతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన కేంద్రం మార్కెట్‌లో ద్రవ్యాన్ని అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.

11/23/2018 - 23:59

ముంబయిలో:
==========
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,020.00
8 గ్రాములు: రూ.24,160.00
10 గ్రాములు: రూ. 30,200.00
100 గ్రాములు: రూ.3,02,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,205.00
8 గ్రాములు: రూ. 25,640.00
10 గ్రాములు: రూ. 32,050.00
100 గ్రాములు: రూ. 3,20,500.00
వెండి

11/23/2018 - 23:58

హాంకాంగ్, నవంబర్ 23: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఎదురవుతున్న సవాళ్లపై నెలకొన్న తాజా ఆందోళనల కారణంగా శుక్రవారం ఆసియా స్టాక్ మార్కెట్లు యూరప్ మార్కెట్లను అనుసరిస్తూ నష్టాలతో ముగిశాయి. అమెరికా-చైనా మధ్య సాగుతున్న వాణిజ్య వివాదాలు పరిష్కారం అవుతాయనే విశ్వాసాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తం చేసినప్పటికీ, ఆ వ్యాఖ్యలను మదుపరులు పెద్దగా పట్టించుకోలేదు.

Pages