S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/14/2018 - 05:31

ముంబయి: ఇంధన, ఇన్‌ఫ్రా, బ్యాంకింగ్ రంగాల షేర్లకు గట్టి కొనుగోళ్ల మద్దతు లభించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీగా బలపడ్డాయి. ముడి చమురు ధరలు తగ్గడం, రూపాయి బాగా పుంజుకోవడం మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది.

11/14/2018 - 00:12

న్యూఢిల్లీ, నవంబర్ 13: ప్రభుత్వ రంగ బ్యాంకు అలహాబాద్ బ్యాంక్ 2018-19 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 1,822.71 కోట్ల నికర నష్టాలను చవిచూసింది. ఈ బ్యాంకు ఇంతగా నష్టపోవడానికి నిరర్థక ఆస్తులే ప్రధాన కారణం. 2017-18 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ త్రైమాసికంలో అలహాబాద్ బ్యాంక్ రూ. 70.20 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

11/13/2018 - 23:47

ముంబయి, నవంబర్ 13: రూపాయి మంగళవారం బలపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 22 పైసలు పుంజుకొని, 72.67 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం, స్థూలార్థిక గణాంకాలు ఆశించిన దానికన్నా మెరుగ్గా ఉండటం వంటి అంశాలు రూపాయి పుంజుకోవడానికి దోహదపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ ముడి చమురు ధర ఒక పీపాకు 70 డాలర్ల కన్నా దిగువకు పడిపోయింది.

11/13/2018 - 23:46

ముంబయిలో:
==========
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,066.00
8 గ్రాములు: రూ.24,528.00
10 గ్రాములు: రూ. 30,600.00
100 గ్రాములు: రూ. 3,06,600.0
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,251.00
8 గ్రాములు: రూ. 26,008.00
10 గ్రాములు: రూ. 32,510.00
100 గ్రాములు: రూ. 3,25,100.00
వెండి
8 గ్రాములు: రూ. 330.40

11/14/2018 - 02:38

ముంబయి: దేశంలో ద్రవ్యోల్బణం ఈ ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల కాలంలో సానుకూలంగా ఉంటుందనే అంచనాలు ఉండటం వల్ల రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) 2018-19 ఆర్థిక సంవత్సరం మిగిలిన చివరి ఆరు నెలల కాలంలో కీలక వడ్డీ రేట్లను పెంచకపోవచ్చని కోటక్ ఎకనమిక్ రీసెర్చ్ (కేఈఆర్) తన నివేదికలో పేర్కొంది. వినియోగ వస్తువుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2018 అక్టోబర్‌లో 12 నెలల కనిష్ట స్థాయి 3.31 శాతానికి తగ్గింది.

11/13/2018 - 17:55

ముంబయి:దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. చివరకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 331.5 పాయింట్లు లాభపడి 35144.49 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 100.3 పాయింట్లు లాభపడి 10582.50 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.62 వద్ద ట్రేడవుతోంది.

11/13/2018 - 03:44

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి పని చేసేందుకు యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్స్ హైలెవెల్ ప్యానెల్ ఆన్ డిజిటల్ కో-ఆపరేషన్ ముందుకు వచ్చింది. దుబాయ్ పర్యటనలో భాగంగా హైలెవెల్ ప్యానెల్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ అమన్దీప్ ఎస్ గిల్‌తో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి లోకేష్ సోమవారం భేటీ అయ్యారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, టెక్నాలజీ సహకారంతో పాలనలో తీసుకువస్తున్న మార్పుల గురించి వివరించారు.

11/13/2018 - 02:15

న్యూఢిల్లీ, నవంబర్ 12: ద్రవ్య లభ్యతతో కూడిన లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ విషయంలో కఠినతర నిబంధనలు అమలు చేయాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ భావిస్తోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్) డీఫాల్ట్ అయిన క్రమంలో సెబీ ప్రత్యేకంగా ఈ నిబంధనలు వర్తింపచేసేందుకు నడుంబిగించింది.

11/12/2018 - 23:41

చైనాలో ఆన్‌లైన్ షాపర్లు సరికొత్త రికార్డు నెలకొల్పారు. గత ఏడాది 24 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరగ్గా
ఈ ఏడాది ఇప్పటివరకూ 30 బిలియన్ డాలర్ల మేర అమ్మకాలు పూర్తి చేసి పాత రికార్డును బద్దలు చేశారు.
సోమవారం షాంఘైలో జరిగిన ‘సింగిల్స్ డే’గా పేర్కొనే ఆలీబాబా 11.11 గ్లోబల్ షాపింగ్ ఫెస్టివల్‌లో పాల్గొని,

11/12/2018 - 23:39

ముంబయి, నవంబర్ 12: ఈవారం మొదటి రోజునే స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూసింది. సుమారు 346 పాయింట్లు కోల్పోయింది. రూపాయి మారకపు విలువ మరింత పతనం కావడం, ముడి చమురు ధర పెరుగుదలతోపాటు భవిష్యత్తులో లభ్యతపై నెలకొన్న అనుమానాలు మార్కెట్‌ను కమ్మేశాయి. విదేశీ మదుపరులు ఆసక్తిని ప్రదర్శించకపోవడం కొనసాగుతునే ఉంటే, దేశీయ పెట్టుబడిదారులు సైతం వెనుకంజ వేయడం స్టాక్ మార్కెట్‌ను దెబ్బతీసింది.

Pages