S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/08/2018 - 23:37

న్యూఢిల్లీ, నవంబర్ 8: రిటైల్ సీఎన్‌జీ, పైపుల ద్వారా సహజవాయువు సరఫరాకు సంబంధించి 50 నగరాల్లో వౌలిక సదుపాయాల ఏర్పాటుపై పెట్రోలియం, నేచురల్‌గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ) బిడ్డింగ్‌లను ఆహ్వానించింది. ఈ నగరాల్లో గ్వాలియార్, మైసూరు, ఆజ్మీర్, హౌరా నగరాలు ఉన్నయి. ఎంపిక చేసిన సంస్థలకు సిటీ గ్యాస్ లైసెన్సులను మంజూరు చేస్తారు.

11/08/2018 - 23:36

న్యూఢిల్లీ, నవంబర్ 8: కేపిటల్ ట్రూ పైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ యజమాని నరేంద్ర సింగ్ తన్వార్‌ను పెట్టుబడుల సలహాదారుడిగా ఉండరాదంటూ మార్కెట్ నియంత్రణ విభాగం సెబీ గురువారం నిషేధం విధించింది. తన్వార్ మదుపర్లను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని సెబీ ఆక్షేపించింది.

11/08/2018 - 23:36

న్యూఢిల్లీ, నవంబర్ 8: ది సాజన్ జిందాల్ నిర్వహణలోని జెఎస్‌డబ్ల్యు ఉక్కు కర్మాగారం ముడి ఉక్కు ఉత్పత్తుల్లో ఈయేడాది అక్టోబర్ నాటికి 7.7 వృద్ధి నమోదుచేసింది. అంటే ఇప్పటి వరకు 14.47 లక్షల టన్నుల ముడి ఉక్కును ఈ కర్మాగారం ఉత్పత్తిచేసింది. ఇదేకాలానికి గత యేడాది ఈ కంపెనీ 13.43 లక్షల టన్నుల ముడి ఉక్కును ఉత్పత్తి చేసిందని కర్మాగార అధికారులు వివరించారు.

11/08/2018 - 23:35

న్యూఢిల్లీ, నవంబర్ 8: ఇంగ్లండ్, జర్మనీ దేశాలతో కలిసి పెట్టుబడులను మరింతగా ఆకట్టుకునేందుకు భారత్ ఏర్పాటు చేసిన ఫాస్ట్‌ట్రాకింగ్ సిస్టం పట్ల ఇతర యూరోపియన్ దేశాలూ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాయి, భారత్ చేపట్టిన ఈ విధానం విజయవంతం కావడంతో న్యూఢిల్లీతో దీనిపై సంప్రదింపులు జరిపేందుకు అనేక దేశాలు ముందుకు వస్తున్నాయని గురువారం నాడిక్కడ అధికారులు తెలిపారు.

11/08/2018 - 23:34

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,121.00
8 గ్రాములు: రూ.24,968.00
10 గ్రాములు: రూ. 31,210.00
100 గ్రాములు: రూ.31,2100.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,337.968
8 గ్రాములు: రూ. 26,703.744
10 గ్రాములు: రూ. 33,379.68
100 గ్రాములు: రూ. 3,33,796.8
వెండి
8 గ్రాములు: రూ. 328.80

11/07/2018 - 03:23

పరవాడ: సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఎన్టీపీసీ)ని బొగ్గు కొరత వేధిస్తుంది. బొగ్గు కొరత కారణంగా ప్రస్తుతం సింహాద్రి మొదటి 500 మెగావాట్ల యూనిట్‌ను అధికారులు మంగళవారం షట్‌డౌన్ చేశారు. సింహాద్రిలోని 2,3,4 యూనిట్లు మాత్రమే ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. మూడు యూనిట్లు కలిసి లక్ష్యం కంటే తక్కువగానే గత మూడు రోజుల నుండి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు కార్మిక వర్గాలు తెలిపాయి.

11/06/2018 - 23:55

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. మార్కెట్ కీలక సూచీలు స్వల్పంగా పుంజుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 41 పాయింట్లు పుంజుకొని 34,991.91 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ ఆరు పాయింట్లు పెరిగి, 10,491.45 పాయింట్ల వద్ద స్థిరపడింది.

11/06/2018 - 23:43

ముంబయి, నవంబర్ 6: రూపాయి మంగళవారం తిరిగి బలపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు పుంజుకొని, 73 వద్ద ముగిసింది. ఎగుమతిదారులు డాలర్ విక్రయాలకు పూనుకోవడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కొంత తగ్గడం వల్ల రూపాయి విలువ పెరిగింది. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగనున్న తరుణంలో మదుపరుల సెంటిమెంట్ అప్రమత్తంగానే ఉన్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా చూస్తే డాలర్ బలంగానే ఉంది.

11/06/2018 - 23:43

న్యూఢిల్లీ, నవంబర్ 6: దేశంలో బంగారం ధర మంగళవారం తగ్గింది. బులియన్ మార్కెట్‌లో పది గ్రాముల పసిడి ధర రూ. 80 తగ్గి, రూ. 32,610కి చేరింది. విదేశీ మార్కెట్లలో బలహీన ధోరణి నెలకొనడంతో పాటు రిటెయిలర్లు, నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతో బంగారం ధర తగ్గింది. బంగారం బాటలోనే వెండి ధర కూడా మంగళవారం తగ్గింది. కిలో వెండి ధర రూ. 240 తగ్గి, రూ. 39,300కు చేరింది.

11/06/2018 - 23:42

న్యూఢిల్లీ, నవంబర్ 6: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను ముంచి విదేశాలకు పరారయిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి దుబాయిలో ఉన్న రూ. 56కోట్లకు పైగా విలువ కలిగిన 11 ఆస్తులను జప్తు చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం తెలిపింది.

Pages