S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/19/2018 - 00:27

న్యూఢిల్లీ, నవంబర్ 18: బ్యాంకులకు ఉన్న మొండి బకాయిలు, బకాయిదార్లు, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ మొండి బకాయిలపై రాసిన లేఖ వివరాలను తమకు ఇవ్వాలంటూ సమాచార కమిషన్ కమిషనర్ ఆర్‌బీఐ, ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసింది. తాము అడిగిన వివరాలు సమకూర్చకపోవడం పట్ల సమాచార కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సంస్థ 66 పేజీల లేఖను రాసింది. ఈ లేఖను శ్రీ్ధర్ ఆచార్యులు రాశారు.

11/18/2018 - 02:32

ముంబయి: గత వారం నిలకడ కోల్పోయిన పసిడి ధర ఈ వారం మెరుగైన స్థితికి చేరుకుంది. ఈ వారం చివరి రోజైన శనివారం 135 రూపాయలు పెరిగిన 10 గ్రాముల బంగారం ధర 32,150 రూపాయలకు చేరింది. వారం మొత్తాన్ని స్థూలంగా చూస్తే, ఒకటిరెండు సందర్భాలను మినహాయిస్తే, బంగారం ధర ఆకాశంలో విహరిస్తున్నదనే చెప్పాలి. పదో తేదీన 32,070 రూపాయలుగా ఉన్న 10 గ్రాముల బంగారం 12వ తేదీన 32,050 రూపాయల వద్ద ముగిసింది.

11/17/2018 - 23:33

ముంబయి, అక్టోబర్ 17: గత వారంతో పోలిస్తే, ఈవారం స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. సెనె్సక్స్ స్థిరపడుతున్నది. ఇటీవల కాలంలో బుల్న్ జోరందుకోవడంతో లాభాల బాటలో దూసుకెళ్లిన సెనె్సక్స్ గత వారం మొదటి రోజే నీరసించింది. ఐదు వందలకుపైగా పాయింట్లు పతనమైంది. రూపాయి మారకపు విలువ పడిపోవడం, చైనా-అమెరికా మధ్య మరోసారి వాణిజ్య యుద్ధ వాతావరణం నెలకొనడం సెనె్సక్స్ పతనానికి ప్రధాన కారణాలయ్యాయి.

11/17/2018 - 23:27

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: దేశంలో ఆర్థిక పరిస్థితులకు అద్దం పట్టే స్టాక్ మార్కెట్‌కు ఊతం రావాలన్నా, వృద్ధిరేటు ఫలాలు అందరికీ దక్కాలన్నా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తీసుకోబోయే చర్యలు లేదా నిర్ణయాలే కీలకం.

11/17/2018 - 23:26

ముంబయి, నవంబర్ 17: మూలధన అవసరాలకు అనుగుణంగా వ్వవహరించడంలో నిలకడలేనితనం కారణంగా ఐడీబీఐ బ్యాంకు నష్టాలను చవిచూస్తోందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ పేర్కొంది. గడచిన త్రైమాసికంలో ఈ బ్యాంకు మూలధన అవసరాల నిర్వహణలో విఘాతం ఏర్పడిందని ఈ కారణంగా నష్టాలు వచ్చాయని ఆ ఏజెన్సీ అంచనావేసింది.

11/17/2018 - 23:25

ముంబయిలో:
=========
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,056.00
8 గ్రాములు: రూ.24,448.00
10 గ్రాములు: రూ. 30,560.00
100 గ్రాములు: రూ. 3,05600.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,268.449
8 గ్రాములు: రూ. 26,147.592
10 గ్రాములు: రూ. 32,684.49
100 గ్రాములు: రూ. 3,26844.90
వెండి
8 గ్రాములు: రూ. 330.80

11/17/2018 - 23:24

న్యూఢిల్లీ, నవంబర్ 1: అరవింద్ లిమిటెడ్ సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో 16.38 శాతం వృద్ధి రేటుతో రూ. 75.08 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. వస్త్రాలు తయారు చేసే ఈ కంపెనీ 2017 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 64.51 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అరవింద్ లిమిటెడ్ గురువారం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ)కి సమర్పించిన ఒక పత్రంలో ఈ వివరాలు వెల్లడించింది.

11/17/2018 - 02:26

న్యూఢిల్లీ: ఉష్‌దేవ్ ఇంటర్నేషనల్ షేర్ల అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడిన 19 మందిపై మార్కెట్ నియంత్రణ విభాగం సెబీ కొరడా ఝళిపించింది. వీరికి 2.45 కోట్ల రూపాయల జరిమానాగా చెల్లించాలని సెబీ ఆదేశించింది. నేర తీవ్రతను బట్టి ఒక్కో వ్యక్తికి 5 నుంచి 30 లక్షల రూపాయల మొత్తాన్ని సెబీ జరిమానాగా విధించింది.

11/17/2018 - 00:01

న్యూఢిల్లీ, నవంబర్ 16: జెట్ ఎయిర్‌వేస్ వాటాలకు శుక్రవారం హఠాత్తుగా డిమాండ్ పెరిగింది. 14 శాతం వరకు ముందడుగు వేసిన ఈ సంస్థ షేర్ ధర 356.60 రూపాయలకు చేరింది. 299.75 రూపాయల వద్ద మొదలైన ట్రేడింగ్ ఆతర్వాత పుంజుకుంది. ఆర్థికంగా నష్టాల ఊబిలో అల్లాడుతున్న జెట్ ఎయిర్‌వేస్‌ను కొనుగోలు చేయడానికి టాటా సన్స్ సిద్ధమైంది.

11/16/2018 - 23:59

మెల్‌బోర్న్, నవంబర్ 16: భారత్ చెరకు రైతులకు, చక్కెర ఉత్పత్తిదారులకు ఎడాపెడా సబ్సిడీలను ఇవ్వడం వల్ల చక్కెర ఉత్పత్తి పెరిగిందని, దీని వల్ల తమ దేశానికి నష్టంగా పరిణమించిందని ఆస్ట్రేలియా ఆరోపించింది. భారత్‌లో ఈ ఏడాది చక్కెర 20 మిలియన్ టన్నుల నుంచి 35 మిలియన్ టన్నులకు పెరిగింది. ఈ విషయమై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రపంచ వాణిజ్య సంస్థను ఆశ్రయిస్తామని ఆస్ట్రేలియా హెచ్చరిం చింది.

Pages