S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/10/2018 - 23:48

దక్షిణ కొరియా ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శనివారం సియోల్‌లో ముఖాలకు మాస్క్‌లు ధరించి ర్యాలీలో పాల్గొన్న కొరియన్ కానె్ఫడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ సభ్యులు. తాత్కాలిక ఉద్యోగులతో పనులు చేయంచుకోవడం మానాలని, జీతభత్యాలు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

11/10/2018 - 23:46

న్యూఢిల్లీ, నవంబర్ 10: పండుగ సీజన్‌కు ముందు దేశీయ నగల వ్యాపారుల నుంచి వెల్లువెత్తిన డిమాండ్ కారణంగా ఒకానొక దశలో ఆరు సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా భారీ ధర పలికిన బంగారం ఆతర్వాత బలహీనపడింది. అంతర్జాతీయ మార్కెట్ సూచీలు కూడా నీసరపడిన నేపథ్యంలో, ఈవారం మొత్తం మీద 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 580 రూపాయలు తగ్గి, 32,070 రూపాయల వద్ద ముగిసింది.

11/10/2018 - 23:45

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,066.00
8 గ్రాములు: రూ.24,528.00
10 గ్రాములు: రూ. 30,660.00
100 గ్రాములు: రూ.3,06,600.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,250.00
8 గ్రాములు: రూ. 26,000.00
10 గ్రాములు: రూ. 32,500.00
100 గ్రాములు: రూ. 3,25,000
వెండి
8 గ్రాములు: రూ. 324.08

11/10/2018 - 00:19

ముంబయి: దేశీయ మదుపరులు అనాసక్తిని ప్రదర్శించడంతో బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో శుక్రవారం నాటి లావాదేవీలు మందకొడిగా సాగాయి. ఆటుపోట్ల మధ్య కొనసాగిన స్టాక్ మార్కెట్ మధ్యలో కోలుకున్నట్టు కనిపించినప్పటికీ, ఆతర్వాత క్రమంగా క్షీణించింది. ఫలితంగా సెనె్సక్స్ 79.13 పాయింట్లు కోల్పోయి 35,158.55 పాయింట్ల వద్ద ముగిసింది.

11/10/2018 - 00:04

ముంబయి, నవంబర్ 9: వైమానిక రంగంలో తక్కువ వ్యయంతో అందుబాటులో ఉన్న జాతీయ ప్రధానాస్రమైన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 2018 సంవత్సరానికి లాభాల్లో 11 శాతం తగ్గుదలను నమోదు చేసింది. ఈ యేడాది 262 కోట్ల రూపాయల లాభాలను గడించినట్లు అధికారులు తెలిపారు.

11/09/2018 - 23:29

ముంబయిలో:
==========
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,110.00
8 గ్రాములు: రూ.24,880.00
10 గ్రాములు: రూ. 31,100.00
100 గ్రాములు: రూ.3,11,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,285.00
8 గ్రాములు: రూ. 26,280.00
10 గ్రాములు: రూ. 32,850.00
100 గ్రాములు: రూ. 3,28,500.00
వెండి
8 గ్రాములు: రూ. 319.20

11/09/2018 - 23:27

న్యూఢిల్లీ, నవంబర్ 9: గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది స్థూల పన్ను అదాయం రూ.21454 కోట్లు పెరిగింది. 2017 సెప్టెంబర్‌లో రూ.2,50,214 కోట్ల అదాయం ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రూ.2,71,668 కోట్లు ఉంది.

11/09/2018 - 23:25

న్యూఢిల్లీ, నవంబర్ 9: టైటాన్ కంపెనీ లిమిటెడ్ శుక్రవారం త్రైమాసిక లాభాలను ప్రకటించింది. సెప్టెంబర్ 30తో ముగిసే మూడు నెలల కాలానికి మొత్తం 301.11 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఈ సంస్ధ గడించింది. అంటే గడచిన యేడాదితో పోలిస్తే ఇది 8.34 శాతం అధికమని సంబంధిత అధికారులు ఇక్కడ వెల్లడించారు. గడచిన యేడాది ఈ కంపెనీ ఇదే కాలానికి 277.93 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది.

11/09/2018 - 02:36

న్యూఢిల్లీ: ప్రముఖ పెయింటర్ అమృత షేర్ గిల్‌కు చెందిన పెయింటింగ్ ది లిటిల్ గర్ల్ ఇన్ బ్లూను ఈ నెల 17వ తేదీన బికనీర్ హౌస్‌లో ఆ తర్వాత ముంబయిలోని తాజ్‌మహల్ ప్యాలెస్‌లో ప్రదర్శనకు ఉంచనున్నారు. ఆ తర్వాత నవంబర్ 29వ తేదీన ఈ పెయింటింగ్‌ను విక్రయించనున్నారు. ఎనిమిది దశాబ్ధాల క్రితం 1934లో అమృత షేర్ గిల్ ఈ కళా ఖండాన్ని రూపొందించారు. ఈ పెయింటింగ్‌ను అవిభక్త భారతదేశంలో లాహోర్‌లో వేశారు.

11/08/2018 - 23:39

ముంబయి, నవంబర్ 8: గత కొంతకాలంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, ఎక్కువ భాగం నష్టాల్లో నడుస్తున్న స్టాక్ మార్కెట్ రెండు రోజుల సెలవుల తర్వాత ఎంత వరకు కోలుకుంటుందనేది ఆసక్తిని రేపుతున్నది.

Pages