S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/21/2018 - 23:42

ముంబయి, నవంబర్ 21: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు బుధవారం కూడా నష్టపోయాయి. ప్రపంచ సంకేతాలు బలహీనంగా ఉన్న తరుణంలో ఐటీ, టెక్నాలజి, లోహ, వాహన రంగాల షేర్లు తీవ్రమయిన అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 250కి పైగా పాయింట్లు పడిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 56 పాయింట్లు దిగజారి, 10,600 పాయింట్ల స్థాయికి చేరుకుంది.

11/21/2018 - 23:40

న్యూఢిల్లీ, నవంబర్ 21: దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా మూడో రోజు బుధవారం కూడా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో పది గ్రాముల పసిడి ధర మరో రూ. 50 తగ్గి, రూ. 31,950కి చేరుకుంది. ప్రపంచ మార్కెట్‌లో నెలకొన్న బలహీన ధోరణితో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ అంతగా లేకపోవడంతో పసిడి ధర తగ్గింది. గత రెండు రోజుల్లో కలిసి పది గ్రాముల బంగారం ధర రూ. 150 తగ్గింది.

11/21/2018 - 23:39

న్యూఢిల్లీలో బుధవారం సరికొత్త ‘ఎర్టిగా’ మోడల్ కారు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మారుతీ సుజికీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కెనిచి అయుకవా (ఎతమ), మార్కెటింగ్-సేల్స్ విభాగం సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్‌ఎస్ కాల్సీ.

11/21/2018 - 23:37

హనాయ్, నవంబర్ 21: పరస్పర రక్షణ సంబంధాలు, చమురు వాణిజ్య బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్-వియత్నాం దేశాలు నిర్ణయించాయి. ప్రత్యేకించి దక్షిణ చైనా సముద్ర మార్గం మీదుగానూ, విమానయాన మార్గం ద్వారాను ఇరు దేశాల వాణిజ్య బంధాలను సరళతరం చేసుకోవడం ద్వారా ద్వైపాక్షిక బంధాలు బలోపేతం చేసుకోవాలని తీర్మానించాయి.

11/21/2018 - 23:36

ముంబయి, నవంబర్ 21: ఉత్పత్తులను పెంచుకోవాలంటే తొలుత ఉద్యోగుల సంక్షేమం ప్రధానమని భారత దేశంలోని కంపెనీల యాజమాన్యాలు భావిస్తున్నాయి. ప్రత్యేకించి ఉద్యోగుల ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధి, సంతృప్తికరమైన సంబంధాల పట్ల సానుకూల వైఖరిని మెజారిటీ శాతం యాజమాన్యాలు ప్రదర్శిస్తున్నాయని ఇటీవల జరిగిన ఓ అధ్యయనం వెల్లడించింది.

11/21/2018 - 23:36

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,035.00
8 గ్రాములు: రూ.24,280.00
10 గ్రాములు: రూ. 30,350.00
100 గ్రాములు: రూ.3,03,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,245.989
8 గ్రాములు: రూ. 25,967.912
10 గ్రాములు: రూ. 32,459.089
100 గ్రాములు: రూ. 3,24,598.09
వెండి
8 గ్రాములు: రూ. 330.80

11/21/2018 - 03:56

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ల మూడు రోజుల ర్యాలీకి తెరపడింది. ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలు హోరెత్తడంతో దాని ప్రతికూల ప్రభావం మంగళవారం దేశీయ మార్కెట్లపై పడింది. దేశీయంగా రూపాయి బలపడటంతో పాటు చమురు ధరలు తగ్గినప్పటికీ, ప్రపంచ మార్కెట్ల ధోరణిని అనుసరిస్తూ మదుపరులు జోరుగా అమ్మకాలకు పూనుకోవడంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 300కు పైగా పాయింట్లు పడిపోయింది.

11/20/2018 - 23:47

ముంబయి, నవంబర్ 20: రూపాయి వరుసగా ఆరో సెషన్‌లోనూ పుంజుకుంది. అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ మంగళవారం 21 పైసలు పెరిగి, 71.46 వద్ద ముగిసింది. ఎగుమతిదారుల నుంచి డాలర్ విక్రయాలు పెరగడంతో పాటు ముడి చమురు ధరలు తగ్గడం, తాజాగా విదేశీ నిధులు నిరాటంకంగా తరలివస్తుండటం వంటి అంశాల కారణంగా రూపాయి విలువ పుంజుకుంది.

11/20/2018 - 23:46

న్యూఢిల్లీ, నవంబర్ 20: దేశంలో బంగారం ధర వరుసగా రెండో రోజు మంగళవారం తగ్గింది. పది గ్రాముల పసిడి ధర రూ. వంద తగ్గి, రూ. 32,000కు చేరింది. ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినప్పటికీ, దేశీయంగా స్థానిక నగల వ్యాపారుల నుంచి పెద్దగా డిమాండ్ లేకపోవడంతో పసిడి ధర తగ్గింది. బంగారం బాటలోనే వెండి ధర కూడా మంగళవారం తగ్గింది. కిలో వెండి ధర రూ. 200 తగ్గి, రూ. 37,900కు చేరుకుంది.

11/20/2018 - 23:44

న్యూఢిల్లీ, నవంబర్ 20: అమెరికాతో ఏర్పడిన వాణిజ్య వివాదం పరిష్కారం దిశగా భారత్ మరో అడుగు ముందుకేసింది. అమెరికా ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తుల దిగుమతులపై అధిక స్థాయిలో దిగుమతి సుంకాలను విధించడాన్ని వ్యతిరేకిస్తున్న భారత్.. ఈ అంశంపై ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేయవలసిందిగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)ను కోరింది. ఒక ఉన్నత స్థాయి అధికారి మంగళవారం ఇక్కడ ఈ విషయం వెల్లడించారు.

Pages