S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/29/2018 - 23:48

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: వివిధ దేశాలకు ఎగుమతైన సానపట్టిన వజ్రాల విలువ ఈ ఏడాది సెప్టెంబర్‌లో 2,365.88 మిలియన్ డాలర్లు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇదే మాసానికి 2,651.73 మిలియన్ డాలర్ల విలువైన కటింగ్, పాలిషింగ్ చేసిన వజ్రాలు మన దేశం నుంచి ఎగుమతయ్యాయి. అయితే, తర్వాతి కాలంగా ఎగుమతుల విలువ గణనీయంగా పడిపోయింది. గత ఏడాది డిసెంబర్‌లో అత్యల్పంగా 1,592.30 మిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు మాత్రమే జరిగాయి.

10/29/2018 - 23:46

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ (టీపీసీఎల్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 393.36 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే సమయానికి నికర లాభయం 212.50 కోట్ల రూపాయలుకాగా, ఈ ఏడాది లాభాలను మరింతగా పెంచుకుంది. తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, టీపీసీఎల్ ఆపరేషనల్ ఆదాయం 7,332.58 కోట్ల రూపాయలు. ఆదాయం 7,437.18 కోట్లుకాగా, ఖర్చులు 7,251.78 కోట్ల రూపాయలు.

10/28/2018 - 22:41

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: విదేశీ ఇనె్వస్టర్లు దాదాపు రూ. 35,600 కోట్ల లాభాలను తన్నుకుని పోయారు. రూపాయి మారకం విలువ తగ్గుతుందని, చమురు ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయని, విశ్వ విపణిలో పెచ్చుమీరుతున్న టారిఫ్ వార్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ కుదేలవుతుందని గ్రహించి ఇంత భారీ ఎత్తున పెట్టుబడులను పెట్టినట్లే పెట్టి లాభాలు వచ్చిన వెంటనే వెనక్కు తీసేసుకున్నారు.

10/28/2018 - 22:39

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: వర్తమాన ఆర్థిక సంవత్సరంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మార్కెట్ ద్వారా రూ.1,281 కోట్ల నిధులను ప్రాథమిక వాటాల విక్రయం ద్వారా సేకరించాయి. గత ఏడాదితో పోల్చితే, ఈ ఏడాది ఏప్రిల్ సెప్టెంబర్ నెలల్లో ఈ కేటగిరీలో వాటాల విక్రయాల వల్ల వచ్చిన నిధులు రెండు రెట్లు పెరిగాయి. ఐపీవోల ద్వారా వచ్చిన నిధుల ద్వారా వాణిజ్య విస్తరణ చేయాలని కంపెనీలు నిర్ణయించాయి.

10/28/2018 - 22:39

ముంబయి, అక్టోబర్ 28: దేశంలోని పది ప్రముఖ కంపెనీ సంస్ధల్లో ఎనిమిది సంస్థలు మార్కెట్ పతనంతో రూ.1,35,162.15 కోట్లను కోల్పోనట్లు స్టాక్ మార్కెట్ అంచనావేసింది. గత వారంలో మార్కెట్ పతనంతో దాదాపు 3 శాతం సంపద ఆవిరైంది. టీసీఎ, ఆర్‌ఐఎల్, ఇన్ఫోసిస్‌లు దెబ్బతిన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ గుడ్డిలోమెల్లిగా కొన్ని లాభాలను దండుకున్నాయి. టాటా కనె్సల్టెన్సీ సంస్థ (టీసీఎస్) ఎం క్యాప్‌లో రూ.

10/28/2018 - 22:37

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: గ్లోబల్ ఎక్ఛ్సేంజ్ ట్రేడ్ ఫండ్ (ఈటీఎఫ్)ను మరింత ఆకర్షణీయంగా తయారు చేసి, అందరి దృష్టినీ ఆకట్టుకోవడం కోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు చేస్తున్నది. విదేశాల్లోని పెన్షన్ హౌస్‌ల నుంచి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నది.

10/28/2018 - 22:49

న్యూఢిల్లీ: దేశం వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఇంధన వినియోగంలో తగ్గుదల నమోదవుతున్నది. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే, కొంత పెరిగినప్పటికీ, ఈ ఏడాది మార్చి తర్వాతి గణాంకాలను గమనిస్తే వినియోగం తగ్గిందని స్పష్టమవుతున్నది. గత ఏడాది ఆగస్టులో 16,478 వేల మెట్రిక్ టన్నుల ఇంధన వినియోగం జరిగింది. ఆతర్వాత క్రమంగా పెరుగుతూ ఈ ఏడాది మార్చిలో 18,617 వేల మెట్రిక్ టన్నులకు చేరింది.

10/28/2018 - 22:35

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: ప్రస్తుతం, వచ్చే త్రైమాసిక ఫలితాలపై స్టాక్ మార్కెట్ పతనం ప్రభావం ఉంటుందిన ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసిక కాలం డిసెంబర్ 31వతేదీతో ముగుస్తుంది. రూపాయి మారకం విలువల్లో హెచ్చుతగ్గుల ప్రభావం ఈ ఫలితాలపై ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య మార్కెట్లు తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. గత రెండు నెలలుగా మార్కెట్ తిరోగమనంలో ఉంది.

10/28/2018 - 03:46

కామారెడ్డి: ‘ప్రెషరైజ్డ్ హేవీ వాటర్ రియాక్టర్’ పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో, నిరంతరంగా 895రోజుల పాటు అణువిద్యుత్‌ను ఉత్పత్తి చేసి, ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది ‘కైగాయూనిట్-1’ అణు విద్యుత్ కేంద్రం.

10/27/2018 - 23:55

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల (కాట్పా) చట్టాన్ని పకడ్బందిగా అమలు చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ అధికారులకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది.

Pages