S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/24/2018 - 03:15

ముంబయి, అక్టోబర్ 23: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్ మంగళవారం కూడా బలహీనపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ రెండూ కూడా ఆరు నెలల కనిష్ట స్థాయికి పతనమయ్యాయి.

10/24/2018 - 03:13

ముంబయి, అక్టోబర్ 23: రూపాయి విలువ మంగళవారం తొలుత పతనమయినప్పటికీ చివరకు తిరిగి పుంజుకొని దాదాపు ఫ్లాట్‌గా ముగిసింది. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.57 వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కొంత వరకు తగ్గడం, బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్ల విక్రయానికి పూనుకోవడం వల్ల రూపాయి పుంజుకుంది. మంగళవారం ఉదయం డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.74 వద్ద ప్రారంభమయింది.

10/24/2018 - 03:12

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: భారత్‌లో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు ఈ సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో అయిదు శాతం పెరిగి, సరికొత్త గరిష్ఠ స్థాయి 44 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. పండుగల సీజన్ ముందున్న తరుణంలో హ్యాండ్‌సెట్ల విక్రేతలు భారీగా స్మార్ట్ఫోన్లను అమ్మడం వల్ల సెప్టెంబర్ త్రైమాసికంలో వీటి అమ్మకాలు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయని ‘కౌంటర్‌పాయింట్ రీసెర్చ్’ తన నివేదికలో వెల్లడించింది.

10/24/2018 - 03:10

భువనేశ్వర్, అక్టోబర్ 23: భారత్‌లో మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు పెట్టాలని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేందర్ సింగ్ మంగళవారం విదేశీ కంపెనీలకు పిలుపునిచ్చారు. దేశంలో 2030-31 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని, అందువల్ల ఇక్కడ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు నెలకొల్పడం ద్వారా విదేశీ కంపెనీలు అపరిమితమయిన ప్రయోజనాలను పొందవచ్చని ఆయన వివరించారు.

10/24/2018 - 03:09

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ లాభార్జనలో విశే్లషకుల అంచనాలను మించిపోయింది. ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 14.8 శాతం పెరుగుదలతో రూ. 2,534 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ తన సాఫ్ట్‌వేర్ సేవల వ్యాపారం నుంచి అధిక ఆదాయాన్ని ఆర్జించడం వల్ల తన నికర లాభాన్ని బాగా పెంచుకోగలిగింది.

10/24/2018 - 03:08

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,126.00
8 గ్రాములు: రూ.25,008.00
10 గ్రాములు: రూ. 31,260.00
100 గ్రాములు: రూ.3,12,600.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,331.00
8 గ్రాములు: రూ. 26,648.00
10 గ్రాములు: రూ. 33,310.00
100 గ్రాములు: రూ. 3,33,100.00
వెండి
8 గ్రాములు: రూ. 330.40

10/23/2018 - 03:37

విజయవాడ: నౌకా నిర్మాణ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియా సంస్థలు ఆసక్తి కనబరిచాయి. నీటిని శుద్ధి చేసే ప్రక్రియలో సాంకేతికతను అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఉండవల్లిలోని గ్రీవెన్సు హాల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని దక్షిణ కొరియాలో భారత కాన్సులేట్ జనరల్ నేతృత్వంలో ఆ దేశ పారిశ్రామికవేత్తల బృందం సోమవారం కలిసింది. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించింది.

10/23/2018 - 02:02

న్యూఢిల్లీ: దేశంలో కోటీశ్వరుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సంవత్సరానికి కోటి రూపాయలకు పైగా సంపాదిస్తూ పన్ను కట్టే సంస్థలు, వ్యక్తుల సంఖ్య గత నాలుగేళ్లలో 1.4 లక్షల మంది పెరిగారని, ఈ పెరుగుదల 60 శాతమని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్టు టాక్సెస్ (సీబీడీటీ) సోమవారం ప్రకటించింది.

10/23/2018 - 01:30

న్యూఢిల్లీ: జాతీయ మార్కెట్‌లో బంగారం ధర సోమవారం స్వల్పంగా తగ్గింది. గత నాలుగు వారాల్లో ఒకటిరెండు సందర్భాలను మినహాయిస్తే, మిగతా అన్ని రోజులూ పెరుగుతునే వచ్చిన పది గ్రాముల బంగారం ధర ఈవారం మొదటి రోజు 50 రూపాయలు తగ్గి రూ.32,220 చేరంది. దసరాకు ముందు, రూ. 32,030 పడిపోయిన బంగారం ధర తర్వాత పుంజుకుంది. కానీ, ఈవారం మొదటి రోజునే యాభై రూపాయలు తగ్గడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

10/22/2018 - 23:27

ముంబయి, అక్టోబర్ 22: గత వారం క్రమంగా పతనమవుతూ, వారాంతంలో నీసరించిన బుల్ రన్‌కు కొత్త వారం మొదట్లో అద్భుతమైన ఊపు లభిస్తుందని అంతా అనుకున్నారు. నష్టాలను అధిగమించి, లాభాల బాటలో పయనిస్తుందని ఊహించారు. అందుకు తగ్గట్టుగానే సోమవారం ఉదయం సెనెక్స్ సూచీలు వేగంగా పైపైకి దూసుకెళ్లాయి. ఒకానొక దశలో 435 పాయింట్లు లాభపడింది. కానీ, మధ్యాహ్నం తర్వాత అనూహ్యంగా పతనం మొదలైంది.

Pages