S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/03/2018 - 00:05

న్యూఢిల్లీ, నవంబర్ 2: గురుగ్రామ్‌లో నిర్మించబోయే భారీ వాణిజ్య సముదాయ ప్రాజెక్టులో 49 శాతం వాటాలను అమెరికాకు చెందిన హైనెస్ కంపెనీకి అమ్మాలని ప్రముఖ రియాలిటీ సంస్థ డీఎల్‌ఎఫ్ నిర్ణయించింది. 900 కోట్ల రూపాయల విలువైన ఈ వాటాల అమ్మక ప్రక్రియ ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

11/02/2018 - 23:46

ముంబయిలో:
==========
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,110.00
8 గ్రాములు: రూ.24,880.00
10 గ్రాములు: రూ. 31,100.00
100 గ్రాములు: రూ.3,11,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,115.00
8 గ్రాములు: రూ. 24,920.00
10 గ్రాములు: రూ. 31,150.00
100 గ్రాములు: రూ. 3,11,500.00
వెండి
8 గ్రాములు: రూ. 330.00

11/02/2018 - 23:44

న్యూఢిల్లీ, నవంబర్ 2: జాతీయ మార్కెట్‌లో బంగారం ధర శుక్రవారం స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల బంగారం 150 రూపాయలు తగ్గడంతో, 32,630 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ ట్రేడింగ్ మండకొడిగా సాగడంతోపాటు దేశీయ వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతో బంగారం ధర తిగి వచ్చింది. గత నెల చివరి వారంలో 32,590 రూపాయలు పలికిన పది గ్రాముల బంగారం ఆతర్వాత 32,550 రూపాయలకు పడిపోయింది. అనంతరం కోలుకొని, 32,620 రూపాయలకు చేరింది.

11/02/2018 - 23:43

న్యూఢిల్లీ, నవంబర్ 2: చాలాకాలంగా ట్రేడింగ్ జరగకుండా, స్తబ్దంగా ఉన్న కంపెనీలను డీలిస్ట్ చేస్తున్న బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) తాజాగా మరో తొమ్మిది కంపెనీలను ఈ జాబితాలో చేర్చింది. సోమవారం నుంచి వీటి షేర్లను ఆరు నెలల పాటు డీలిస్ట్ చేస్తున్నట్టు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

11/02/2018 - 12:42

ముంబయి:దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెనె్సక్స్ 427 పాయింట్లతో 34,859 వద్ద ముగిసింది. నిఫ్టీ 133 పాయింట్లతో 10,500 వద్ద అధిగమించింది. రూపాయి మారకం విలువ రూ.73.10గా కొనసాగుతోంది.

11/02/2018 - 02:38

న్యూఢిల్లీ: పండుగల సీజన్ కొనసాగుతుండడంతో దేశంలో పసిడి ధర కూడా పెరుగుతోంది. బులియన్ మార్కెట్‌లో గురువారం పది గ్రాముల బంగారం ధర రూ. 130 పెరిగి, రూ. 32,780కి చేరుకున్నది. పండుగల సీజన్ డిమాండ్‌ను తట్టుకునేందుకు స్థానిక నగల వ్యాపారులు నిరాటంకంగా కొనుగోళ్లు జరపడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు పటిష్ట స్థాయిలో ఉండటం వల్ల గురువారం దేశీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది.

11/01/2018 - 23:46

ముంబయి, నవంబర్ 1: తీవ్రమయిన ఊగిసలాట మధ్య సాగిన లావాదేవీలలో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్పంగా నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ ఇంట్రా-డేలో ఆరంభంలో ఆర్జించిన లాభాలన్నింటినీ తరువాత కోల్పోయింది. చివరకు పది పాయింట్ల దిగువన ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా స్వల్పంగా ఆరు పాయింట్లు కోల్పోయింది. కీలక సూచీలు లాభాలు, నష్టాల మధ్య ఊగిసలాడాయి.

11/01/2018 - 23:34

న్యూఢిల్లీ, నవంబర్ 1: రూపాయి మారకపు విలువ క్రమంగా పుంజుకుంటున్నది. డాలర్‌తో మారకపు విలువ గురువారం 50 పైసలు పెరిగి, 73.45 రూపాయలకు చేరింది. గత నెల 25న 73.27గా ఉన్న రూపాయి మారకపు విలువ నెల చివరి రోజు, బుధవారం అత్యల్పంగా 73.95 రూపాయలకు పడిపోయింది. అయితే, గురువారం కొంత వరకూ తేరుకుంది. ఫోరెక్స్ ట్రేడింగ్ రూపాయికి అనుకూలంగా మారడం దేశీయ మదుపరులకు ఊతమిస్తున్నది.

11/01/2018 - 23:33

న్యూఢిల్లీ, నవంబర్ 1: ప్రపంచంలోనే మొదటి 50 అత్యంత ముఖ్యమైన పెట్టుబడులు పెట్టేందుకు అనువైన దేశాల జాబితాలో త్వరలోనే భారత్ చేరుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ 23 స్థానాలు దాటి 77వ స్థానంలో నిలిచినట్లు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది.

11/01/2018 - 23:32

ముంబయిలో:
===============
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,120.00
8 గ్రాములు: రూ.24,960.00
10 గ్రాములు: రూ. 31,200.00
100 గ్రాములు: రూ.3,12,000.0
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,336.898
8 గ్రాములు: రూ. 26,695.184
10 గ్రాములు: రూ. 33,368.98
100 గ్రాములు: రూ. 3,33,689.08
వెండి

Pages