S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/05/2018 - 00:05

మంబయి, నవంబర్ 4: రూపాయి మారకపు విలువ తగ్గే సూచనలు కనిపించడం లేదు. మధ్యమధ్యలో ఒకటిరెండుసార్లు డాలర్‌కు రూపాయి విలువ పెరిగినట్టు కనిపించినా, స్థూలంగా చూస్తే మాత్రం పతనం కొనసాగుతునే ఉంది. వచ్చే మూడు నెలల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. క్రమంగా పెరుగుతున్న డాలర్ విలువ 76 రూపాయలకు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తున్నదని అంటున్నారు.

11/05/2018 - 00:04

న్యూఢిల్లీ, నవంబర్ 4: టోరెంట్ ఫార్మా ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో 179 కోట్ల రూపాయల నికల లాభాన్ని ఆర్జించింది. అయితే, గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి ఆర్జించిన లాభంతో పోలిస్తే ఇది 12.25 శాతం తక్కువ. రూపాయి మారకపు విలువ తగ్గడం, అమెరికాకు ఎగుమతి చేసిన సరకులో కొంత భాగం వెనక్కు తిరిగి రావడం వంటి అంశాలు టోరెంట్ నికర లాభంలో కోతకు కారణమయ్యాయి.

11/05/2018 - 00:40

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆదాయ పన్ను (ఐటీ) చెల్లింపుదారుల జాబితాలో కొత్తగా 75 లక్షల మంది ఫైళ్లు చేరినట్లు ఆ శాఖ సీనియర్ అధికారులు తెలిపారు. కేంద్ర పన్నుల శాఖ బోర్డు డైరెక్టరేట్ (సీబీడీటీ) ఆదేశానుసారం వచ్చే యేడాది మార్చి నెలతో ముగిసే 2018-19 ఆర్థిక సంవత్సరాంతానికి 1.25 కోట్ల కొత్త పన్ను చెల్లింపుదారులను జాతీయ జాబితాలోకి చేర్చాలన్నది ఆదాయ పన్ను శాఖ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది.

11/04/2018 - 07:26

న్యూఢిల్లీ: ఈవారం బంగారం రికార్డు ధర పలికింది. పండుగల సీజన్ కావడంతో దేశీయ నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు ఒక కారణం. రూపాయి మారకపు విలువ తగ్గడంతో, ఇతరత్రా పెట్టుబడుల కంటే, బంగారం కొనడం మేలన్న ఆలోచన కూడా పది గ్రాముల బంగారం ధర గత ఆరేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా, 32,780 రూపాయలకు చేరింది. దీపావళికి ముందు బంరాన్ని కొనడం హిందూ సంప్రదాయంలో ఒక ఆనవాయితీ.

11/04/2018 - 00:45

విశాఖపట్నం, నవంబర్ 3: రక్షణ రంగ ఉత్పత్తుల్లో దేశం స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) చైర్మన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగం కార్యదర్శి డాక్టర్ జీ సతీష్ రెడ్డి అన్నారు.

11/04/2018 - 00:46

ముంబయి, నవంబర్ 3: గత వారం కుంటుపడిన బుల్ రన్ ఈవారం కోలుకోవడమేగాక, దూకుడును పెంచింది. అన్ని విధాలా మెరుగైన వాతావరణం కొనసాగడంతో బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో లావాదేవీలు దాదాపుగా స్థిర ఫలితాలనిచ్చాయి. మార్కెట్ కుదుటపడంతో, సెనె్సక్స్ చాలాకాలం తర్వాత మళ్లీ 35,000 పాయింట్ల సూచీని అధిగమించింది. గత నెల 26వ తేదీన సెనె్సక్స్ 33,349.31 పాయింట్ల వద్ద ముగిసింది.

11/04/2018 - 00:20

కోల్‌కతా, నవంబర్ 3: ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద సెప్టెంబర్ చివరి నాటికి సుమారు 212 సంస్థలు లిక్విడేషన్‌కు వెళ్లాయని ఓ ఉన్నతాధికారి శనివారం ఇక్కడ తెలిపారు. 1,198 కార్పొరేట్ కంపెనీల రెజల్యూషన్ ప్రక్రియకు అంగీకరించగా, అందులో 52 సంస్థలు విజయవంతంగా పరిష్కారమయ్యాయని ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) హోల్-టైమ్ మెంబర్ సవ్‌రంగ్ సాయిని తెలిపారు.

11/04/2018 - 00:19

న్యూఢిల్లీ, నవంబర్ 3: సరళీకృత వాణి జ్య విధానాలే ఆర్థికాభివృద్ధికి మూలమని, అలాం టప్పుడే వృద్ధిరేటు సాధ్యమవుతుందని ప్రము ఖ ఆర్థికవేత్త అరవింద్ పనగా రియా అన్నారు.

11/03/2018 - 02:28

ముంబయి: ఫైనాన్సియల్, వాహన రంగాల షేర్లు రాణించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం బలపడ్డాయి. ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడంతో పాటు రూపాయి బలపడటం, విదేశీ ఇనె్వస్టర్లు తాజా కొనుగోళ్లకు పూనుకోవడం ఈ రెండు రంగాల షేర్ల ధరలు పుంజుకోవడానికి దోహదపడింది. దీంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 580 పాయింట్లు పుంజుకొని నెల రోజుల గరిష్ఠ స్థాయి 35,011.65 పాయింట్ల వద్ద ముగిసింది.

11/03/2018 - 00:03

ముంబయి, నవంబర్ 2: వచ్చే మూడు సంవత్సరాల కాలంలో, మహారాష్టల్రో సుమారు పదివేల మందికి ఉద్యోవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఎంచుకున్నట్టు స్వీడన్‌కు చెందిన ప్రముఖ ఫర్నీచర్ సంస్థ ఐకియా ప్రకటించింది. దేశంలోనే ఐకియా మొట్టమొదటి షోరూమ్‌ను హైదరాబాద్‌లో, ఆగస్టు మాసంలో ప్రారంభించిన విషయం తెలిసిందే.

Pages