S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/24/2018 - 23:46

విశాఖపట్నం, అక్టోబర్ 24: విశాఖను ఫిన్‌టెక్ వ్యాలీగా, ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం చెపుతోంది. ఇందుకోసం విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో అన్ని హంగులు ఉన్న విశాఖ నగరాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి తపన పడుతున్నారు. ఇందులో భాగంగా కొద్ది నెలల కిందట బ్లాక్‌చైన్ టెక్నాలజీని రాష్ట్రానికి పరిచయం చేశారు. గత సంవత్సరం ఫిన్‌టెక్‌ను అందుబాటులోకి తెచ్చారు.

10/24/2018 - 23:30

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: బంగారం ధర బుధవారం ఈ ఏడాదిలోనే అధికంగా నమోదైంది. పది గ్రాముల బంగారం ధర మొదటిసారి 32,500 రూపాయలకు చేరింది. ఏకంగా 150 రూపాయలు పెరగడంతో బంగారం ధరకు రెక్కలొచ్చాయి. దేశీయం ఉండే జ్యుయెలరీ వ్యాపారులతోపాటు ప్రజలు కూడా బంగారం కొనడానికి మొగ్గు చూపించారు. విదేశీ కంపెనీలు కూడా స్వర్ణంపై దృష్టి పెట్టాయి. ఫలితంగా ఈ ఏడాది మొత్తంలోనే అత్యధిక ధర పలికింది.

10/24/2018 - 23:28

ముంబయి, అక్టోబర్ 24: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లో బుధవారం లావాదేవీలు ఊపందుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో తగ్గుదల స్టాక్ మార్కెట్‌పై ప్రభావాన్ని చూపింది. దీనితోపాటు దేశీయ మదుపరులు ఆసక్తిని ప్రదర్శించడం, ఆసియా మార్కెట్ సూచీల్లో సానుకూలత కనిపించడం వంటి అంశాలు కూడా సెనె్సక్స్ పెరగడానికి కారణమయ్యాయి.

10/24/2018 - 23:27

ముంబయి, అక్టోబర్ 24: రూపాయి మారకపు విలువ క్రమంగా బలపడుతున్నది. డాలర్‌కు రూ పాయి మారకం బుధవారం 42 పైసలకు పెరిగింది. దీనితో డాలర్ విలువ 73.18 రూపాయలకు పడిపోయింది. స్టాక్ మార్కెట్ మాదిరిగానే రూపాయి పుంజుకోవడానికి ముడి చమురు ధరల్లో తగ్గుదల, ఆసియా మార్కెట్ తీరుతెన్నులు దోహదపడ్డాయి. విదేశీ మారకం ఇంటర్‌బ్యాంక్ లావాదేవీల్లో 42 పైసలు పెరగడంతో, చివరిలో మారక వేగం పెరిగింది.

10/24/2018 - 23:26

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,120.00
8 గ్రాములు: రూ.24,960.00
10 గ్రాములు: రూ. 31,200.00
100 గ్రాములు: రూ.3,12,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,326.00
8 గ్రాములు: రూ. 26,608.00
10 గ్రాములు: రూ. 33,260.00
100 గ్రాములు: రూ. 3,32,600.00
వెండి
8 గ్రాములు: రూ. 329.60

10/24/2018 - 16:40

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. సెనె్సక్స్ 187 పాయింట్లు లాభపడి 34,034 వద్ద స్థిరపడగా..నిఫ్టీ 78 పాయింట్లతో 10,225 వద్ద నిలిచింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.19 వద్ద ఉంది.

10/24/2018 - 04:22

నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిలో ఈసంవత్సరం టార్గెట్ చేరుకోవడం కష్టమే అని సాగర్ జన్‌కో ఎస్‌ఈ రాజనర్సయ్య తెలిపారు. మంగళవారం సాగర్ జన్‌కో కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ 2018-19 ఆర్థిక సంవత్సరానికి సాగర్‌లోని ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో 1,120 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని టార్గెట్‌గా తీసుకున్నామన్నారు.

10/24/2018 - 04:01

మోర్తాడ్, అక్టోబర్ 23: లారీల కొరత ఏర్పడడంతో కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న రాసులు పేరుకుపోతున్నాయి. కొనుగోలు కేంద్రాలకు వాహనాలు కేటాయించినప్పటికీ, అవి రెండుమూడు రోజుల పాటు రాకపోవడంతో ఎక్కడికక్కడ అటు పంట నిల్వలు, వాటిని నింపిన బస్తాలు పెరిగిపోతున్నాయి.

10/24/2018 - 03:54

విశాఖపట్నం: రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ వ్యాలీగా అభివృద్ధి చేయాలన్న సంకల్పాన్ని సాకారం చేసేందుకు పారిశ్రామిక వేత్తలు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విశాఖలో జరుగుతున్న ఫిన్‌టెక్ ఫెస్టివల్-2018లో భాగంగా పారిశ్రామిక వేత్తలతో జరిగిన ప్రత్యేక భేటీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా పారిశ్రామికాభివృద్ధికి దోహదపడాలన్నారు.

10/24/2018 - 03:46

రాజమహేంద్రవరం, అక్టోబర్ 23: రాష్ట్రంలో వనాల అభివృద్ధిలో భాగంగా ఆదాయ వనరులను సముపార్జించడమే లక్ష్యంగా ఆంధ్రపదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌డీసీ) పనిచేస్తోందని ఆ సంస్థ ఛైర్మన్ డాక్టర్ దివి శివరామ్ చెప్పారు. అడవుల అభివృద్ధితో పాటు ఆదాయాన్ని సముపార్జించుకుంటూ స్వయం సమృద్ధి సాధించడమే ఈ సంస్థ ప్రధాన కార్యకలాపమన్నారు.

Pages