S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/17/2018 - 02:14

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: భారత దేశంలోని వంట నూనె మార్కెట్‌లో కనీసం పది శాతాన్ని హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా ఎంచుకున్నామని కార్గల్ ఇండియా కంపెనీ ప్రకటించింది. ఇందు కోసం భారీ పెట్టుబడులను సిద్ధం చేసుకున్నట్టు తెలిపింది.

10/17/2018 - 02:06

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: బంగారం ధరలు మంగళవారం నాడు పది గ్రాములపై 70 రూపాయలు తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో తులం బంగారం 32,180 రూపాయల ధర పలికింది. గడచిన వారం రోజులుగా ప్రపంచ మార్కెట్ తీరుతో నెలకొన్న ఈ పరిస్థితులు వ్యాపారులను కొంత ఆందోళనకు గురిచేశాయి. అలాగే వెండి సైతం కిలోకు యాభై రూపాయలు తగ్గి 39,700 రూపాయలుగా అమ్మకాలు జరిగాయి.

10/17/2018 - 02:06

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,130.00
8 గ్రాములు: రూ.25,040.00
10 గ్రాములు: రూ. 31,300.00
100 గ్రాములు: రూ.3,03,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,347.596
8 గ్రాములు: రూ. 26,780.752
10 గ్రాములు: రూ. 33,475.94
100 గ్రాములు: రూ. 3,34,759.40
వెండి
8 గ్రాములు: రూ. 332.00

10/16/2018 - 03:46

ముంబయి: గత వారం ఆరంభంలో వరుస నష్టాలతో అల్లాడినప్పటికీ, చివరిలో కోలుకున్న స్టాక్ మార్కెట్లు ఈవారం ఆరంభంలో పుంజుకున్నాయి. సెనె్సక్స్ సుమారు 132 పాయింట్లు పెరిగి, 34,865.10 పాయింట్ల వద్ద ముగిసింది. గత వారం మొదట్లో జరిగిన లావాదేవీలతో పోలిస్తే, సోమవారం పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకుల ప్రభావం కారణంగా ఆశించిన స్థాయిలో పెరగలేదు.

10/15/2018 - 23:19

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: ద్రవ్యోల్బణం 5.13 శాతం పెరగడం అటు ఉత్పత్తిదారులను, ఇటు స్టాక్ మార్కెట్ మదుపరులను ఆందోళనకు గురి చేస్తున్నది. తాజాగా విడుదలైన ప్రభుత్వ గణాంకాలను అనుసరించి, సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం 5.13 శాతంగా నమోదైంది. హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) గత ఏడాది ఆగస్టులో 4.53, సెప్టెంబర్‌లో 3.14 శాతంగా ఉంది. అప్పటితో పోలిస్తే ద్రవ్యోల్బణం ఈ ఏడాది పెరిగింది.

10/15/2018 - 23:18

న్యూఢిల్లీ, ఆగస్టు 15: ప్రభుత్వ చర్యలు, ఆర్‌బీఐ సూచనలు పెట్రో ధరల పెరుగుదలపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. ఇటీవల కాలంలో పెరుగుతూ వస్తున్న డీజిల్ ధర సోమవారం మరో 2.50 రూపాయలు పెరిగింది. కేంద్ర ఎక్సైజ్ డ్యూటీని తగ్గించగా, కొన్ని ఆయిల్ కంపెనీలు సబ్సిడీలను ప్రకటించాయి. పన్నును 2.50 రూపాయల మేరకు తగ్గించాల్సిందిగా రాష్ట్రాలను కేంద్రం కోరింది.

10/15/2018 - 23:17

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: గత వారం చివరిలో పతనమైన బంగారం ధర సోమవారం మళ్లీ పుంజుకుంది. ఆభరణాల తయారీదారులు, సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి ఏర్పడిన డిమాండ్ కారణంగా 10 గ్రాముల బంగారం 200 రూపాయల మేర పెరిగి, 32,250 రూపాయలుగా స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు కూడా పుత్తడి ధర పెరగడానికి సహకరించాయి.

10/15/2018 - 23:17

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,100.00
8 గ్రాములు: రూ.24,800.00
10 గ్రాములు: రూ. 31,000.00
100 గ్రాములు: రూ.3,10,000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,315.508
8 గ్రాములు: రూ. 26,524.064
10 గ్రాములు: రూ. 33,155.08
100 గ్రాములు: రూ. 3,31,550.80
వెండి
8 గ్రాములు: రూ. 330.40

10/15/2018 - 05:47

న్యూఢిల్లీ: దేశంలో డీజిల్ వినియోగం తగ్గింది. ఆశ్చర్యంగా అనిపించినా ఇది అక్షర సత్యం. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయానికి స్వల్పంగా పెరిగినప్పటికీ, మొత్తం మీద తగ్గుదల నమోదు కావడం విశేషం. గత ఏడాది ఆగస్టలో 5,921 మెట్రిక్ టన్నుల మేర డీజిల్ వినియోగం జరిగింది. ఆతర్వాత క్రమంగా పెరుగుతూ, నవంబర్ నాటికి రికార్డు స్థాయిలో 7,225 మెట్రిక్ టన్నులకు చేరింది.

10/15/2018 - 01:26

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ఈవారం మార్కెట్ ఆశాజనకంగానే ఉంటుందని నిపుణులు జోస్యం చెప్తున్నారు. మార్కెట్ పరిస్థితులను ముడి చమురు ధరలు, రూపాయి మారకపు విలువ వంటి అంశా లు ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తున్నది.

Pages