S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/22/2018 - 23:25

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సీఐఎల్) మనదేశంలో విడుదల చేసిన కొత్త ‘కాంపాక్టు సెడాన్ అమేజ్’ కారు గడచిన ఐదు నెలల వ్యవధిలోనే కంపెనీకి రికార్డు స్థాయి అమ్మకాలతో అగ్రభాగాన నిలిచింది.

10/22/2018 - 23:24

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల నిర్వహణలో గత నెల కొద్దిపాటి తగ్గుదల నమోదైంది. ఆగస్టులో 25,20,430 కోట్ల రూపాయలున్న ఈ విలువ సెప్టెంబర్ మాసాంతానికి 22,04,423 రూపాయలుగా రికార్డయింది. అయితే, గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే దీనిని మెరుగైన ఫలితంగానే పేర్కోవాలి. అప్పట్లో 20,40,301 కోట్ల రూపాయలుగా ఉన్న ఆస్తుల నిర్వాహణ ఈ ఏడాది సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు పెరగడం విశేషం.

10/22/2018 - 23:24

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్ కలిగిన హీరోమోటోకార్ప్ సోమవారం సరికొత్త ఆవిష్కరణతో మనసు దోచుకుంది. 125సీసీ స్కూటర్ సెగ్మెంట్‌లో ‘డెస్టినీ 125సీసీ’ పేరిట కొత్త ఉత్పాదనను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ వాహనం రెండు రకాల ధరలతో అందుబాటులో ఉంటుంది.

10/22/2018 - 23:22

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,125.00
8 గ్రాములు: రూ.25,000.00
10 గ్రాములు: రూ. 31,250.00
100 గ్రాములు: రూ.3,12,500.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,342.246
8 గ్రాములు: రూ. 26,737.968
10 గ్రాములు: రూ. 33,422.460
100 గ్రాములు: రూ. 3,34,224.60
వెండి
8 గ్రాములు: రూ. 330.20

10/22/2018 - 14:14

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 148, నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.33గా ఉంది.

10/23/2018 - 00:28

భువనేశ్వర్‌ : ఒడిశాలో మాత్రం లీటర్‌ పెట్రోల్‌ కంటే డీజిల్‌ ధరే అధికంగా ఉందట. భువనేశ్వర్‌లో ఆదివారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 80.57గా ఉండగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ. 80.69 పలికింది. సోమవారం కూడా భువనేశ్వర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 80.27, డీజిల్‌ ధర రూ. 80.40గా ఉంది.

10/23/2018 - 00:27

ముంబయి: దేశంలో ఇంధన ధరలు తగ్గాయి. దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర 30 పైసలు తగ్గి రూ.81.34గా ఉంది. ఇక డీజిల్‌ కూడా 27 పైసలు తగ్గి లీటర్‌ ధర రూ. 74.92గా ఉంది. ధరలు అత్యధికంగా ఉండే ముంబయిలోనూ ఇంధన ధరలు కాస్త తగ్గాయి. ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర 30 పైసలు తగ్గి రూ. 86.91గా ఉంది. లీటర్‌ ధర 28 పైసలు తగ్గి రూ. 78.54గా ఉంది.

10/22/2018 - 06:44

న్యూఢిల్లీ: ప్రస్తుతం కొనసాగుతున్న కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాల వెల్లడి సీజన్ ముఖ్యంగా విప్రో, భారతి ఎయిర్‌టెల్ వంటి బ్లూచిప్ కంపెనీల ఫలితాలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల ధోరణిని నిర్దేశించనున్నాయి. రూపాయి, ముడి చమురు ధరల కదలికలు వంటి కీలక అంశాలు కూడా స్టాక్ మార్కెట్ల ధోరణిని ప్రభావితం చేయనున్నాయి.

10/22/2018 - 05:18

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: విదేశీ మదుపరులు ఈ నెల తొలి మూడు వారాలలో భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి సుమారు రూ. 32వేల కోట్ల నిధులను ఉపసంహరించుకున్నారు. ప్రపంచ వాణిజ్య వివాదాలు తీవ్రం కావడం, ముడి చమురు ధరలు పెరగడం, అమెరికాలో పెట్టుబడులపై ఆదాయాలు పెరగడం వంటి వాటి వల్ల ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి తమ నిధులను ఉపసంహరించుకుంటున్నారు. సెప్టెంబర్ నెలలో రూ.

10/22/2018 - 04:53

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: దేశంలోని పది అత్యంత విలువయిన కంపెనీలలోని అయిదు కంపెనీల మార్కెట్ విలువ ఈ వారంలో రూ. 31,381.39 కోట్లు పెరిగింది. వీటిలో ఐటీసీ అత్యధికంగా లాభపడింది. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో హెచ్‌యూఎల్, ఐటీసీ, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఓఎన్‌జీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) పెరిగింది.

Pages