S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/20/2018 - 01:29

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: స్టీల్ పరిశ్రమలో దేశీయ ఉత్పత్తులకు ఊతమిచ్చే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. అందులో భాగంగానే చైనా నుంచి దిగుమతయ్యే స్టీల్ ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ పన్నులను విధించింది. ఐదేళ్ల కాల పరిమితితో, టన్నుకు 185.51 డాలర్ల పన్నును విధించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ (డీజీటీఆర్) ఇటీవల చేసిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర రెవెన్యూ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

10/18/2018 - 01:36

ముంబయి: గత వారం చివరిలో, ఈవారం ఆరంభంలో రెండు రోజులు లాభాల బాటలో పయనించిన సెనె్సక్స్ పతనం మొదలైనట్టుగా కనిపిస్తోంది. బుధవారం ట్రేడింగ్లో 383 పాయింట్లు కోల్పోయి, 35,000 సూచీ కంటే దిగువకు పడిపోయింది. పెట్టుబడిదారులు ఆసక్తిని ప్రదర్శించకపోగా, షేర్ల అమ్మకానికి డిమాండ్ పెరగడంతో సెనె్సక్స్ నష్టాన్ని చవిచూసింది.

10/18/2018 - 01:14

ముంబయి, అక్టోబర్ 17: దారుణంగా పడిపోతూ, ఒకానొక ధశలో రికార్డు కనిష్టానికి చేరుకున్న రూపాయి మారకపు విలువ క్రమంగా బలపడుతున్నది. డాలర్‌కు రూపాయి విలువ ఆరు పైసలు పెరుగుపడడంతో, 73.42 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకున్న పరిణామాలు, దేశీయ ఈక్విటీ మార్కెట్‌లోని పరిస్థితులు రూపాయి బలపడేందుకు సహకరించాయి.

10/18/2018 - 01:11

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: ఇరాన్‌లో అమెరికా మంజూరులపై ఆంక్షలు ఓవైపు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ముడిచమురు నిల్వలవల్ల ఆలోటును భర్తీచేయడం పెద్ద సమస్య కాబోదని, అయితే ఓ పెద్ద చమురు సరఫరాచేసే కంపెనీని కోల్పోవడం వల్ల మన దేశంలో ధరల పెరుగుదలకు అవకాశం ఏర్పడిందని నిపుణులు అంచనా వేశారు.

10/18/2018 - 01:09

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను మోసగించి సుమారు రూ. 13వేల కోట్ల రుణం తీసుకున్న కేసులో నిందితులకు చెందిన రూ. 218 కోట్లకు పైగా ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం జప్తు చేసింది.

10/18/2018 - 01:08

ముంబయిలో
========
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3130.00
8 గ్రాములు: రూ.25040.00
10 గ్రాములు: రూ. 31,300.00
100 గ్రాములు: రూ.31,3000.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3347.594
8 గ్రాములు: రూ. 26,780.752
10 గ్రాములు: రూ. 33,475.94
100 గ్రాములు: రూ. 33,4759.4
వెండి
8 గ్రాములు: రూ. 329.60

10/18/2018 - 01:06

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణ రేటు యావత్ దేశాన్ని భయపెడుతున్నది. ధాన్యాలు, పప్పులు, బియ్యం, గోధుమలు, కాయకూరలు.. ఇలా ఒకటిరెండు అని చెప్పడానికి వీల్లేకుండా అన్నిటి ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. దసరా పండుగ వచ్చేస్తున్నది. త్వరలోనే దీపావళి రానుంది. ఈ రెండు వరుస పండుగలను ఎంతో గొప్పగా జరుపుకోవడం ఆనవాయితీ. అయితే, ఈసారి పండుగలను పెరుగుతున్న ధరలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

10/17/2018 - 02:33

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీలో పెట్టుబడి పెట్టనున్నట్టు నేషనల్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్‌ఐఐఎఫ్) ప్రకటించింది. మధ్య తరగతి ప్రజల సొంతింటి కలలు నెరవేర్చడానికి హెచ్‌డీఎఫ్‌సీ రియల్ ఎస్టేట్ క్యాపిటల్ విభాగంలో 660 కోట్ల రూపాయలను పెట్టుబడిగా ఉంచుతామని పేర్కొంది.

10/17/2018 - 02:12

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సందీప్ బక్షీ నియామకానికి ఆర్‌బీఐ ఆమోద ముద్ర వేసింది. ఆయన ఈ పదవుల్లో మూ డేళ్లు ఉంటారు. చందన్ కొచ్చర్ రాజీనామా చేయడంతో, ఆ పదవుల్లో కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాల్సి వచ్చింది. అప్పటి వరకూ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా పని చేస్తున్న బక్షీకి అవకాశం ఇవ్వాలని పాలక మండలి తీర్మానించింది.

10/17/2018 - 02:10

ముంబయి, అక్టోబర్ 16: ఈవారం లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్‌లో రెండో రోజున కూడా బుల్ రన్ కొనసాగింది. లాభ నష్టాల మధ్య ఊగిసలాడిన సెనె్సక్స్ చివరికి 297.38 పాయింట్ల పెరుగుదలను నమోదు చేసింది. గత వారం చివరిలో కోలుకున్న స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల బాటలో నడిచిన విషయం తెలిసిందే. మంగళవారం మార్కెట్ మరికొంత పుంజుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకుల ప్రభావం భారత మార్కెట్‌పై అంతగా లేదనే చెప్పాలి.

Pages