S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/15/2018 - 01:25

ముంబయి, అక్టోబర్ 14: ‘ఉడే డెస్క్ కా ఆమ్ నగరిక్’ (ఉడాన్) పథకం కింద అంతర్జాతీయ విమానాల నిర్వహణకు భారత్ టెండర్లు ఆహ్వానించింది. ఈ పథకం ద్వారా విదేశాలకు సైతం విమానాలను నడపడం ద్వారా పరిథిని విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద దేశీయంగా విమాన సర్వీసులు నిర్వహించాలన్న ప్రక్రియ సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో పరిధిని విస్తరించడం ద్వారానైనా సత్వర స్పందన వస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

10/15/2018 - 01:23

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోవడంతో పాటు క్రూడాయిల్ రేట్లు మరింత పెరిగిన నేపథ్యంలో మన దేశంలో షేర్ మార్కెట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన విదేశీ మదుపరులు ఆయా షేర్లను పెద్దఎత్తున విక్రయించుకున్నారు.

10/15/2018 - 01:21

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: రూపాయి విలువ మరింత పతనం కాకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా దిగుమతులపై ముఖ్యంగా అత్యవసరం కాని వస్తువులపై సుంకాన్ని కేంద్రం పెంచకపోవచ్చునని సంబంధిత అధికార వర్గాలు పేర్కొన్నాయి. కేంద్రం గడిచిన రెండు వారాల్లో గృహావసరాల వస్తువులైన రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, టెలికాం-కమ్యూనికేషన్ సిస్టమ్‌కు సంబంధించిన వాటిపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ వచ్చిం ది.

10/15/2018 - 01:20

ముంబయి, అక్టోబర్ 14: జర్మనీలో భారతీయ కంపెనీలు విజయపథంలో దూసుకెళుతున్నాయి. అక్కడ సుమారు డెబ్బై నాలుగుకుపైగా భారతీయ కంపెనీలు 11బిలియన్ యూరోల వార్షికాదాయాన్ని ఆర్జించాయి. అంతేకాకుండా ఆదేశంలోని 23,300 మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. ఇటీవల ‘జర్మనీలో భారత పెట్టుబడులు’ అనే అంశంపై జరిగిన సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. ఇండోజర్మన్ చాంబర్ ఆఫ్ కామర్స్, సీఎల్‌ఎల్ సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి.

10/14/2018 - 02:22

న్యూఢిల్లీ: ఫిన్లాండ్‌కు చెందిన ఫ్లూయిడో అనే కంపెనీ విలీనం చేసుకునే ప్రక్రియ పూర్తయిందని దేశంలో రెండవ అతి పెద్ద ఐటీ సం స్థ ఇన్ఫోసిస్ తెలిపింది. 65 మిలియన్ల యూరోలు అంటే భారత కరెన్సీలో రూ.545 కోట్ల పెట్టుబడితో ఫ్లూయిడో కంపెనీని విలీనం చేసుకున్నట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. దీని ద్వారా వినియోగదారులకు నాణ్యమైన క్లౌడ్ సాంకేతికసేవలు అందిస్తామన్నారు.

10/14/2018 - 01:08

ముంబయి, అక్టోబర్ 13: ఈవారం మొత్తం స్టాక్ మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగితే, బులియన్ మాత్రం జోరుగా పరుగులు తీసింది. మొదటి వారం 34,376.99 పాయింట్ల వద్ద మొదలైన సెనె్సక్స్ 34,474.38 పాయింట్ల వద్ద ముగిసింది. ఆతర్వాత వరుసగా 34,299.47 పాయింట్లు, 34,760.89 పాయింట్లు, 32,370.04 పాయింట్లు నమోదయ్యాయి. చివరిలో ఇది 34,733.58 పాయింట్లకు చేరుకోవడం మదుపరుల్లో వచ్చే వారం ట్రేడింగ్‌పై ఆశలు పెంచింది.

10/14/2018 - 01:09

ముంబయి, అక్టోబర్ 12: ఒడిదుడుకుల మధ్య నడుస్తూ, వరుసగా రెండు సీజన్లు నష్టాలను చవిచూసిన సెనె్సక్స్ చివరిలో కొంత వరకు మెరుగుపడింది. గత 19 నెలల్లో ఎన్నడూ లేని రీతిలో, ఒక రోజులో ఏడు వందలకుపైగా పాయింట్లు లాభపడిన సంఘటన మార్కెట్‌కు ఊతమిచ్చింది. డాలర్‌కు రూపాయి మారకపు విలువ పెరగడం, అంతర్జాతీయ వ్యాపారం తిరిగి పుంజుకోవడం వంటి అంశాలు ఈవారం చివరిలో భారత స్టాక్ మార్కెట్‌పై సానుకూల ప్రభావాన్ని చూపాయి.

10/14/2018 - 01:17

న్యూఢిల్లీ: ఫిన్లాండ్‌కు చెందిన ఫ్లూయిడో అనే కంపెనీ విలీనం చేసుకునే ప్రక్రియ పూర్తయిందని దేశంలో రెండవ అతి పెద్ద ఐటీ సం స్థ ఇన్ఫోసిస్ తెలిపింది. 65 మిలియన్ల యూరోలు అంటే భారత కరెన్సీలో రూ.545 కోట్ల పెట్టుబడితో ఫ్లూయిడో కంపెనీని విలీనం చేసుకున్నట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. దీని ద్వారా వినియోగదారులకు నాణ్యమైన క్లౌడ్ సాంకేతికసేవలు అందిస్తామన్నారు.

10/14/2018 - 00:48

కోల్‌కొతా, అక్టోబర్ 13: ఈ నెల 12వ తేదీ వరకు థర్మల్ విద్యుత్ రంగానికి తన ఉత్పత్తిలో 84 శాతం బొగ్గును సరఫరా చేసినట్లు కోల్ ఇండియా లిమిటెడ్ ప్రకటనలో తెలిపింది. రోజుకు 1.34 మిలియన్ టన్నుల బొగ్గును థర్మల్ ప్లాంట్లకు సరఫరా చేశారు. రోజుకు 14 నుంచి 15 ర్యాక్స్ బొగ్గును పశ్చిమబెంగాల్ విద్యుత్ అభివృద్ధి సంస్థ పరిధిలోని విద్యుత్ ప్లాంట్లకు సరఫరా చేశారు.

10/13/2018 - 06:36

ముంబయి: ముడి చమురు ధరలు తగ్గడం, రూపాయి కోలుకోవడం దేశీయ స్టాక్ మార్కెట్లకు శుక్రవారం దన్నుగా నిలిచింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ భారీగా 700 పాయింట్లకు పైగా పుంజుకుంది. గత 19 నెలల్లో సెనె్సక్స్ ఒక్క సెషన్‌లో ఇంత భారీగా పుంజుకోవడం ఇదే మొదటిసారి.

Pages