S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/21/2018 - 01:26

ముంబయి, మే 20: ఎస్‌బీఐ, సిప్లా వంటి బ్లూచిప్ కంపెనీలు నాలుగో త్రైమాసికం (క్యూ4)లో ఆర్జించిన లాభాలతో పాటు ముడి చమురు ధరల కదలిక, ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటుపై దాని ప్రభావం సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారం దేశీయ స్టాక్ మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనున్నాయనేది నిపుణుల అంచనా.

05/21/2018 - 01:25

న్యూఢిల్లీ, మే 20: బ్యాంకులకు మంచి రోజులు రాబోతున్నాయి. బ్యాంకులకు చెందిన 12 నిరర్ధక ఆస్తుల విలువకు సంబంధించిన కేసులను దివాళా ప్రక్రియ సంస్థకు ఆర్‌బిఐ అప్పగించడంతో, ఒక లక్ష కోట్ల నిధులు వెనక్కు వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. గత వారం టాటా గ్రూప్ సంస్థ భూషణ్ స్టీల్ లిమిటెడ్ సంస్థలో 72.65 శాతం వాటాలను టేకోవర్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంస్థ మొత్తం రూ.

05/21/2018 - 01:23

న్యూఢిల్లీ, మే 20: ఇటీవల బయటపడిన భారీ కుంభకోణం నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు, గీతాంజలీ జెప్స్ సంస్థలపై పెద్ద ఎత్తున జరిమానా విధించాలని సెబీ యోచిస్తోంది. అనుమానాస్పద లావాదేవీలు ఇతర అంశాలపై విచారణ జరిపిన తర్వాత రూ. 14వేల కోట్ల విలువైన ఈ బ్యాంకింగ్ కుంభకోణంపై విచారణ తర్వాత పై చర్య తీసుకోవాలన్నది సెబీ ఆలోచన.

05/21/2018 - 01:21

న్యూఢిల్లీ, మే 20: రూ. 13 వేల కోట్ల కుంభకోణం సంగతి బయటపడటానికి కారణమైన ఆడిట్ లేదా విచారణ వివరాలను వెల్లడించడానికి పంజాబ్ నేషనల్ బ్యాంకు తిరస్కరించింది. ఆవిధంగా వెల్లడించడం వల్ల విచారణ పురోగతిని లేదా నేరస్థులను పట్టుకోవడానికి అవరోధం ఏర్పడుతుందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన నిబంధనలోని క్లాజ్ ను వివరించింది.

05/20/2018 - 04:31

న్యూఢిల్లీ: అమెరికా ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై దిగుమతి సుంకాలను విధించడాన్ని భారత్ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)కు చెందిన వివాదాల పరిష్కార యంత్రాంగం వద్ద సవాలు చేసింది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాకు ఉక్కు, అల్యూమినియం ఎగుమతులపై ప్రభావం చూపుతుందని, పైగా ఈ నిర్ణయం ప్రపంచ వాణిజ్య సూత్రాలకు అనుగుణంగా లేదని భారత్ పేర్కొంది.

05/20/2018 - 01:36

ముంబయి, మే 19: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బాగా నష్టపోయాయి. మార్కెట్ కీలక సూచీలు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 687.49 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 210.10 పాయింట్ల చొప్పున పడిపోయాయి.

05/20/2018 - 01:34

న్యూఢిల్లీ, మే 19: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజల పథకం కింద ఇప్పటివరకు దేశంలో 30 కోట్ల ఎల్‌ఇడి బల్బులను పంపిణీ చేసినట్టు ఎనర్జీ ఎఫీషియంట్ సర్వీసెస్ లిమిటెట్ (ఇఇఎస్‌ఎల్) వెల్లడించింది. జనవరి 2015లో ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన దీని ద్వారా ఇన్ని కోట్ల బల్బులను పంపిణీ చేయడం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద పథకంగా నిలుస్తుందని అన్నారు.

05/20/2018 - 01:32

న్యూఢిల్లీ, మే 19: ఎన్టీపీసీ ఆధ్వర్యంలో జరగనున్న సోలార్ ప్రాజెక్టుల వేలం మరింత ఆలస్యం కానుంది. 2000 ఎండబ్ల్యు సోలార్ ప్రాజెక్టుల వేలంలో అంతర్ రాష్ట్రాల అనుసంధానం విషయంలో తీర్మానం కావాలని బిడ్‌లో పాల్గొంటున్న కంపెనీలు కోరుతున్నాయి. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో సోలార్ ప్రాజెక్టు వేలంకు సంబంధించి బిడ్ ఈనెల 21న జరగాల్సి ఉంది.

05/20/2018 - 01:31

రాజమహేంద్రవరం, మే 19: తూర్పుగోదావరి జిల్లా ఓఎన్జీసీ తాటిపాక రిఫైనరీలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి శనివారం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-అసెట్ మేనేజర్ డిఎంఆర్ శేఖర్ ఆధ్వర్యంలో ఓఎన్జీసీ డైరెక్టర్ ( ఆన్‌షోర్) సంజయ్‌కుమార్ మెయిత్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈడీ అసెట్ మేనేజర్ శేఖర్ మాట్లాడుతూ పర్యావరణహితమైన కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి సంస్థ కృషి చేస్తుందన్నారు.

05/20/2018 - 01:29

న్యూఢిల్లీ, మే 19: ప్రభుత్వ పథకాలు, ఇతర సేవల నిమిత్తం ఆధార్‌కార్డును తప్పనిసరిగా అనుసంధానం చేయడానికి 87 శాతం గ్రామీణ ప్రజలు అంగీకరించారని ఒక సర్వే తెలియజేసింది. ఇనె్వస్ట్‌మెంట్ సంస్థ ఒమిడియార్ నెట్‌వర్కు ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంతాల్లో జరిపిన సర్వేలో పలు విషయా లు వెల్లడయ్యాయి.

Pages