S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/09/2018 - 00:51

మణుగూరు, మే 8: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) నిర్మాణపనులు అనుకున్న సమయానికి పూర్తి చేయాలని తెలంగాణ జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రా వు ఆదేశించారు. మందకొడిగా సాగుతున్న పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది చివరికల్లా సబ్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్‌కు సింక్రనైజేషన్ చేయాలని అధికారులను ఆదేశించా రు.

05/09/2018 - 00:52

న్యూఢిల్లీ, మే 8: గత ఏప్రిల్ నెలలోఆన్‌లైన్ నియామకాల ప్రక్రియ, 11శాతం వృద్ధి నమోదు చేయగా, ఉత్పత్తి, తయారీ రంగాలు దీర్ఘకాల అత్యధిక వృద్ధిని నమోదు చేశాయని ఒక నివేదిక వెల్లడించింది. మోన్‌స్టర్ ఎంప్లాయ్‌మెంట్ ఇండెక్స్ ఏప్రిల్ నెలలో 298ని సూచించగా, గత ఏడాదితో పోలిస్తే 11 శాతం వృద్ధి నమోదు చేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో ఈ సూచిక 268గా నమోదైంది.

05/08/2018 - 00:28

విజయవాడ, మే 7: వివిధ పన్నుల్లో వాటాలు, గ్రాంట్ల మంజూరుకు 1971 జనాభా లెక్కలనే ప్రాతిపాదికగా తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు తీర్మానం చేశారు. ఈమేరకు రాష్టప్రతిని కలిసి త్వరలో వినతిపత్రం అందించాలని నిర్ణయించారు.

05/08/2018 - 00:47

ముంబయి, మే 7: ఇటు దేశీయ మార్కెట్లు, అటు అంతర్జాతీయ అందిన సానుకూల సంకేతాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా పుంజుకున్నాయి. గత మూడు నెలల్లో ఎన్నడూ లేని విధంగా సెనె్సక్స్ 292.76 పాయింట్లు పెరిగి 35,208.14 పాయింట్లకు చేరుకుంది. అంటే ముంబయి స్టాక్‌మార్కెట్ నేటి లావాదేవీల్లో 0.84 శాతం మేర పుంజుకుంది. అలాగే నిఫ్టీ కూడా 97.25 పాయింట్లు పెరిగి 10,715.50 పాయింట్ల వద్ద ముగిసింది.

05/08/2018 - 00:24

న్యూఢిల్లీ, మే 7: ఆఫ్రికాతో భారత్ వర్తకాన్ని మరింత పెంచేందుకు వీలుగా సమగ్ర విధానాన్ని రూపొందిస్తున్నట్టు, కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య వర్తకం ‘సాపేక్షంగా’ చాలా తక్కువ స్థాయిలో కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత వృద్ధి చేసేందుకు వీలుగా ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిం చి అందుకు అవకాశాలను పరిశీలించామన్నారు.

05/08/2018 - 00:21

విజయవాడ, మే 7: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ స్ఫూర్తిదాయకంగా ఉందని వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు ప్రశంసించారు. 15వ ఆర్థిక సంఘం టెర్మ్ ఆఫ్ రెఫరెన్స్‌ను వ్యతిరేకిస్తూ 11 రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రుల సదస్సులో పాల్గొనడానికి వచ్చిన వారు వెలగపూడి సచివాలయంలోని ఆర్టీజీ స్టేట్ సెంటర్‌ను సందర్శించారు.

05/08/2018 - 00:48

న్యూఢిల్లీ, మే 7: ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్‌జీసీ సహజ వాయు ఉత్పత్తులు 2017-18 సంవత్సరంలో 6.3 శాతం మేర పెరిగాయి. ఈ సానుకూల పరిస్థితుల ఊతంతో 2022 నాటికి సహజవాయు ఉత్పత్తిని రెండింతలు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆ కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

05/08/2018 - 00:51

న్యూఢిల్లీ, మే 7: నైపుణ్య భారతం బలంగా పుంజుకుంటోంది. వివిధ అంశాల్లో నిరుపమాన ప్రతిభ కలిగిన వారి సంఖ్య భారత్‌లో ఇబ్బడిముబ్బడిగా ఇనుమడిస్తోంది. తాజా సర్వేను బట్టి మరో 12 ఏళ్ల కాలంలో భారతదేశంలో నిపుణులైన మిగులు కార్మికుల సంఖ్య 245 మిలియన్లను దాటే అవకాశం ఉంటుందని స్పష్టమవుతోంది.

05/07/2018 - 17:06

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్ల దూకుడుతో భారత్ స్టాక్ మార్కెట్లు లాభల బాటలో పయనించాయి. సోమవారంనాడు 300 పాయింట్ల లాభంతో దూసుకువెళ్లింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 292.76 పాయింట్ల మేర ఎగిసి 35,208.14 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 10,715.50 వద్ద నిలిచింది.

05/07/2018 - 00:54

మనీలా, మే 6: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక ప్రగతి రేటును 7 శాతంగా అంచనా వేస్తున్నారంటే, నిజంగా దేశ ఆర్థిక వృద్ధిరేటు చాలా వేగంగా ఉన్నట్టే. ఇదే పోకడ కొనసాగితే వచ్చే దశాబ్దకాలంలో దేశ ఆర్థికవ్యవస్థ పరిమాణం రెట్టింపుకావడం ఖాయమని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ముఖ్య ఆర్థికవేత్త యసుయుకి సవడ అన్నారు. 8 శాతం ఆర్థిక ప్రగతి సాధించలేదని బాధపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు.

Pages