S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/03/2018 - 00:18

న్యూఢిల్లీ, మే 2: దేశంలో విమానయాన రంగానికి మహర్దశ పట్టింది. విమానయాన రంగంలో వౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో రూ.5వేల కోట్లతో చెన్నై, లక్నో, గౌహతిలో మూడు కొత్త విమానాశ్రయ టర్మినల్ భవన సముదాయాల నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. బుధవారం ఇక్కడ జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర లభించింది.

05/03/2018 - 00:22

జొహెన్నస్ బర్గ్, మే 2: నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన తర్వాత భారత్ ప్రపంచానికి తర్వాతి గ్రోత్ ఇంజిన్ కానున్నదని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలను ఆధునికీకరించడం, కొత్త స్టార్ట్-అప్‌లను ప్రారంభించడమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు.

05/03/2018 - 00:23

ముంబయి, మే 2: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం పటిష్ఠమయిన స్థాయి వద్ద ప్రారంభమయినప్పటికీ, అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయం వెలువడనున్న తరుణంలో బలహీనంగా సాగుతున్న ఆసియా మార్కెట్లను అనుసరించి చివరకు ఎదుగూ బొదుగూ లేకుండా ఫ్లాట్‌గా ముగిశాయి.

05/03/2018 - 00:14

న్యూఢిల్లీ, మే 2: గత ఐదేళ్లకాలంలో రూ. లక్షకోట్ల విలువైన అక్రమాలు వివిధ బ్యాంకుల్లో చోటు చేసుకున్నాయి. రిజర్వ్‌బ్యాంకు వెల్లడించిన ప్రకారం వీటికి సంబంధించి 23 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. 2016-17లో మొత్తం ఐదువేల అక్రమ కేసలు నమోదు కాగా, 2017 ఏప్రిల్ నుంచి 2018 మార్చి 1మధ్యకాలంలో వీటి సంఖ్య పెరిగి 5,152 కేసులు నమోదయ్యాయని సమాచార హక్కుపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్‌బీఐ వెల్లడించింది.

05/03/2018 - 00:12

న్యూఢిల్లీ, మే 2: వితంతువులు, ఒంటరి మహిళల సంక్షేమానికి కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాలను అమలు చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శించిన ఎనిమిది రాష్ట్రప్రభుత్వాలకు జరిమానాను విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

05/02/2018 - 00:22

న్యూ ఢిల్లీ, మే 1: త్వరలో విమానాల్లో చరవాణి, అంతర్జాల సేవలను ప్రవేశపెట్టేందుకు కేంద్ర టెలికాం శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే మూడు నుంచి నాలుగు నెలల్లో ఈ సదుపాయాన్ని విమాన ప్రయాణీకులకు కల్పించనున్నారు. ఇప్పటికే టెలికాం మంత్రిత్వ శాఖ నౌకల్లో ఈ సేవలు అందించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ వివరాలను టెలికాం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ మంగళవారం ఇక్కడ విలేఖర్లకు తెలిపారు.

05/02/2018 - 00:28

న్యూ ఢిల్లీ, మే 1: ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తి లేదని, వీటిల్లో విదేశీపెట్టుబడుల పెంపుదల పరిమితి విధించడంపై ఎటువంటి ప్రతిపాదన పరిశీలనలో లేద ని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సు భాష్ చంద్ర గార్గ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్ర భుత్వ రంగ బ్యాంకుల్లో 20 శాతం విదేశీ పెట్టుబడులకు కేంద్రం అనుమతించింది.

05/02/2018 - 00:20

న్యూఢిల్లీ, మే 1: కీలకమైన ఎనిమిది రంగాల పనితీరు మార్చి నెలలో మందగించడంతో, వీటి ప్రగతి మూడు నెలల కనిష్టమైన 4.1 శాతానికి తగ్గిపోయింది. బొగ్గు, ముడి చమురు, సహజవాయు రంగాలతో సహా మొత్తం ఆరు రంగాల పనితీరు తగిన రీతిలో లేకపోవడమే ఈవిధంగా వృద్ధి పడిపోవడానికి ప్రధాన కారణం.

05/02/2018 - 00:29

* ఏప్రిల్‌లో రూ. లక్ష కోట్లకు పైగా వసూలు

05/02/2018 - 00:34

న్యూ ఢిల్లీ, మే 1: మరో రెండు వారాల్లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించే ప్రక్రియకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఫుల్‌స్టాప్ పెట్టాయి. అంతర్జాతీయంగా బారెల్ పెట్రోల్ ధర రెండు డాలర్లు పెరిగినా పెట్రో ధరల పెంపుదల జోలికి చమురు సంస్థలు వెళ్లే సాహసం చేయడం లేదు. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తే సామాన్య ప్రజలపై పెట్రో ధరల భారం పడదు.

Pages