S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/18/2018 - 01:19

ముంబయి, జనవరి 17: స్టాకెద్దు పరుగుతీసింది. దేశ ద్రవ్య లోటు పెరుగుతోందనే మదుపరుల భయాలను పోగొట్టే రీతిలో ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం చేయాల్సిన అవసరం ఉన్న అదనపు అప్పుల పరిమాణాన్ని తగ్గించడంతో దేశీయ స్టాక్ మార్కెట్ కీలక సూచీలు బుధవారం ఉవ్వెత్తున ఎగిశాయి. బుల్ రన్‌తోబొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 310 పాయింట్లు పెరిగి, మొట్టమొదటిసారి 35,000 పాయింట్ల స్థాయిపైన ముగిసింది.

01/18/2018 - 01:17

హైదరాబాద్, జనవరి 17: జీవిత బీమా ఉత్పాదనల పంపిణీకి సంబంధించి అవివా బీమా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) పేర్కొంది. దేశంలోని 1863 బ్యాంకు బ్రాంచీల ద్వారా అవివా జీవితబీమా ఉత్పాదనలను పంపిణీ చేస్తామని ఆ బ్యాంకు ఎండి ఆర్‌పి మరాఠే తెలిపారు. ఓపెన్ ఆర్కిటెక్చర్ సిస్టమ్ కింద ఒకే విభాగంలో పలు బీమా సంస్థల బీమా ఉత్పాదనలను ఒక బ్యాంకు విక్రయిస్తుందన్నారు.

01/18/2018 - 01:17

విశాఖపట్నం, జనవరి 17: మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళల్లో అవగాహన పెరిగిందని మాల్దీవ్స్ ఉమెన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షురాలు షీజా అభిప్రాయపడ్డారు. విశాఖలో బుధవారం ప్రారంభమైన మూడు రోజుల అంతర్జాతీయ మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సులో భాగంగా ఆమె మాట్లాడుతూ ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం మహిళలకు విద్య పట్ల అవగాహన పెరిగిందని, చదువు వల్ల ప్రయోజనాలు తెలుసుకుని ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.

01/18/2018 - 01:16

తిరుపతి, జనవరి 17: భారతదేశపు మొట్టమొదటి అడ్వెంచర్ యుటిలిటీ వాహ నం ఇసుజు డీ మ్యాక్స్ వీ-క్రాస్ వాహనాలు తిరుపతిలోని తమ ఎక్స్‌షోరూమ్‌లో లభిస్తున్నాయని ఎండి బాలా జీ చౌదరి బుధవారం తెలిపారు. వీక్రాస్‌ను మే, 2016లో తొలిసారిగా భారతదేశపు తొలి అడ్వెంచర్ యుటిలిటీ వాహనంగా ఆవిష్కరించారని తెలిపారు.

01/18/2018 - 01:14

న్యూఢిల్లీ, జనవరి 17: ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటోంది, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా ఒక కొలిక్కి వస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. చంద్రబాబు బుధవారం ఢిల్లీలో సీఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుకు హాజరైన అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిసి విభజన సమస్యలు, ఆర్థికాంశాల గురించి చర్చించారు.

01/18/2018 - 01:10

విజయవాడ, జనవరి 17: రాష్ట్రంలో గ్రామాల్లో నీటి సమస్యకు తెరదించేందుకు ఉద్దేశించిన వాటర్ గ్రిడ్ పథకం తొలిదశ పనులను 6300 కోట్ల రూపాయలతో చేపట్టనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో వెలగపూడి సచివాలయంలో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు.

01/17/2018 - 00:42

న్యూఢిల్లీ, జనవరి 16: భారత ప్రభుత్వం దేశ మేథోసంపత్తి సామర్థ్యాన్ని పెంచడానికి జాతీయ ఐపీఆర్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో అంతర్జాతీయ మేధాసంపత్తి (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ- ఐపీ) సూచీలో భారత్ ర్యాంక్ మెరుగుపడొచ్చని గ్లోబల్ ఇన్నొవేషన్ పాలసీ సెంటర్ (జీఐపీసీ)లోని ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు. మేథోసంపత్తి సూచీలో నిరుడు భారత్ చివరి స్థానానికి సమీపంలో నిలిచింది.

01/17/2018 - 00:41

ముంబయి, జనవరి 16: వరుసగా మూడు సెషన్లు గరిష్ఠ స్థాయి రికార్డులు సృష్టించిన దేశీయ స్టాక్ మార్కెట్ కీలక సూచీలు మంగళవారం మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో పాటు స్థూలార్థిక గణాంకాలు బలహీనంగా ఉండటంతో పడిపోయాయి. సోమవారం మార్కెట్ పనివేళలు ముగిసిన తరువాత విడుదలయిన స్థూలార్థిక గణాంకాలు భారీగా పెరిగిన దేశ వాణిజ్య లోటును వెల్లడించాయి.

01/17/2018 - 00:39

హైదరాబాద్, జనవరి 16: దక్షిణ మధ్య రైల్వేస్టేషన్లు, ప్లాట్‌ఫారాలు, రైళ్లలో ఆహార నాణ్యత విషయంలో రాజీలేదని, ఈ విషయంలో అశ్రద్ధ, నిర్లక్ష్యం చేస్తే సంబంధిత ఏజన్సీలపై చర్యలు తీసుకుంటామని, అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి పర్యవేక్షించాలని జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ అన్నారు. మంగళవారం ఇక్కడ ఆయన కేటరింగ్ ఏజన్సీలు, స్టాల్స్, రైళ్లలో సరఫరా చేసే ఆహార విధానాలను సమీక్షించారు.

01/17/2018 - 00:39

హైదరాబాద్, జనవరి 16: వ్యవసాయ పట్టభద్రులు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటులో ఆకస్తి కలిగించేందుకు వీలుగా అగ్రి ఇంకుబేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం కసరత్తు చేస్తోంది. విద్యార్థుల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై ఆసక్తి కలిగించేందుకు హైదరాబాద్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

Pages