S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/13/2018 - 01:01

ముంబయి, జనవరి 12: దేశీయ స్టాక్ మార్కెట్ల కీలక సూచీ లు వరుసగా రెండో రోజు శుక్రవారం పుంజుకొని, సరికొత్త గరిష్ఠ స్థాయి రికార్డులను నెలకొల్పాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఆదాయ వృద్ధి పడిపోయినప్పటికీ, మదుపరులు కార్పొరేట్ కంపెనీల ఆదాయాలపై ఆశాజనకంగా ఉండటంతో శుక్రవారం కూడా కీలక మార్కెట్ సూచీలు పైకి ఎగబాకాయి.

01/13/2018 - 01:00

విజయవాడ, జనవరి 12: క్లౌడ్ సర్వీసెస్, డేటా అనలిటిక్స్‌లో వివిధ సేవలు అందిస్తున్న యాష్ టెక్నాలజీస్ ప్రతినిధులతో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ హైదరాబాద్‌లో శుక్రవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఐటి రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. డీటీపీ విధానం, ఇతర విధానాలు, రాయితీల గురించి వివరించారు.

01/13/2018 - 00:55

బెంగళూరు, జనవరి 12: ఇన్ఫోసిస్ కంపెనీ వ్యూహాత్మక ప్రాధాన్యతలను తాను ఏప్రిల్ నాటికి రూపొందిస్తానని కంపెనీ కొత్త కార్యనిర్వహణాధికారి (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) సలీల్ పరేఖ్ తెలిపారు. వ్యూహాత్మక ప్రాధాన్యతలను రూపొందించడానికి ప్రస్తుతం సమీక్ష కొనసాగుతోందని ఆయన చెప్పారు. ఈ నెల 2న ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీగా బాధ్యతలు స్వీకరించిన పరేఖ్ తొలిసారి శుక్రవారం మీడియాతో భేటీ అయ్యారు.

01/13/2018 - 00:52

విశాఖపట్నం, జనవరి 12: విశాఖ నగరం మరో ప్రతిష్టాత్మక సదస్సుకు ఆది థ్యం ఇవ్వనుంది. భారత మహిళా పారిశ్రామిక వేత్తల సమాఖ్య (ఆలిప్ ఇండియా), దక్షిణాసియా మహిళాభివృద్ధి సంస్థ (ఎస్‌ఏడబ్ల్యూడీఎఫ్)లతో కలసి ఏపీ ప్రభుత్వం ఈ సదస్సును జనవరి 17 నుంచి 19 వర కూ మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు.

01/13/2018 - 00:48

హైదరాబాద్, జనవరి 12: మేనేజిమెంట్, ఇంజనీరింగ్ కాలేజీల్లో టైర్ ఒన్ సంస్థల్లో ప్లేస్‌మెంట్లకు ఢోకాలేదు. అదే టైర్-2 కాలేజీల్లో మాత్రం ప్లేస్‌మెంట్లు గణనీయంగా పడిపోయినట్లు విజ్‌డమ్‌జాబ్స్.కామ్ అనే సంస్థ ‘క్యాంపస్ హైరింగ్ ఇన్ ఇండియా’ అనే శీర్షికతో రూపొందించిన నివేదికలో పేర్కొంది. హైదరాబాద్, ముంబాయి, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కొత్తా, పూణే నగరాల్లో విద్యా సంస్థల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది.

01/13/2018 - 00:47

హైదరాబాద్, జనవరి 12: భారత దేశ పెయింట్స్ మార్కెట్ పరిమాణం 2019-20 నాటికి రూ.70,875 కోట్లకు చేరుకుంటుంద ని, ఈ డిమాండ్‌ను దృష్టిలోపెట్టుకుని స్పెయిన్‌కు చెందిన గ్రాఫెన్‌స్టోన్‌తో కలిసి వివోసి ఉద్గార రహిత పెయింట్స్‌ను ఆవిష్కరించినట్లు కామధేను సంస్థ పేర్కొంది.

01/12/2018 - 07:38

ఎయర్ ఇండియా

విదేశీ నిధులు

01/12/2018 - 07:19

న్యూఢిల్లీ, జనవరి 11: బినామీ ఆస్తుల నిషేధం చట్టం అమల్లోకి వచ్చిన తరువాత ఇంతవరకు 3,500కోట్ల విలువ చేసే 900 బినామీ ఆస్తులను జప్తు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. బినామీ ఆస్తుల నిషేధ చట్టం 2016 నవంబర్ ఒకటో తేదీనుండి అమల్లోకి రావటం తెలిసిందే.

01/12/2018 - 07:18

ముంబయి, జనవరి 11: కార్పొరేట్ కంపెనీల మూడో త్రైమాసిక ఆదాయాలపై మదుపరులలో ఆశావాద దృక్పథం నెలకొనడంతో గురువారం దేశీయ మార్కెట్లలో జోరుగా కొనుగోళ్లు సాగి కీలక సూచీలు సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిలకు చేరాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజి (ఐటీ), స్థిరాస్తి రంగాల షేర్ల పట్ల మదుపరులు ఆసక్తి కనబరిచారు.

01/12/2018 - 07:16

న్యూఢిల్లీ, జనవరి 11: దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో గల గుర్గావ్‌లో అత్యంత విలాసవంతమైన ఫ్లాట్లతో కూడిన బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నట్టు ప్రకటించిన 3ట్రంప్ టవర్స్2 బుకింగ్‌లను ప్రారంభించినట్టు ప్రకటించిన 24 గంటలలోనే 20 ఫ్లాట్లు రూ. 150 కోట్ల ధరకు అమ్ముడు పోయాయి. మొత్తం 250 అత్యంత విలాసవంతమైన ఫ్లాట్లను ఒక్కో ఫ్లాట్‌కు రూ.

Pages