S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/16/2019 - 23:49

న్యూఢిల్లీ, నవంబర్ 16: ఆర్థికంగా నష్టపోయి, రుణదాతలకు చెల్లింపులు జరపలేకపోతున్న వివిధ కంపెనీల దివాలా ప్రక్రియపై ఇక స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (్ఫక్కీ) అభిప్రాయపడింది. ఎస్సార్ స్టీల్ కేసుపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఫిక్కీ స్పందిస్తూ, ఇప్పటి వరకూ దివాలా ప్రక్రియలో స్పష్టత ఉండేది కాదని పేర్కొంది.

11/15/2019 - 05:42

న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. జీఎస్టీ ఫైలింగ్ గడువును పెంచుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) గురువారం ప్రకటన విడుదల చేసింది. 2017-18 ఆర్థిఖ సంవత్సరానికి సంబంధించిన ఫైలింగ్‌ను ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకూ దాఖలు చేయవచ్చని అందులో పేర్కొంది.

11/15/2019 - 05:06

న్యూఢిల్లీ, నవంబర్ 14: ఎండు చింతపండుపై గతంలో ఉన్న ఐదు శాతం జీఎస్టీని తొలిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వెల్లడించారు. ఎండు చింతపండుపై జీఎస్టీని మినహాయించాలని కోరుతూ జూలై 24 న కేంద్ర ఆర్థిక శాఖకు వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేఖ రాశారు.

11/15/2019 - 04:32

న్యూఢిల్లీ, నవంబర్ 14: భారత స్టాక్ మార్కెట్ల లావాదేవీల్లో గురువారం భారీగానే నష్టపోయిన వేదాంత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో పెరగడం విశేషం. బీఎస్‌ఈకి సమర్పించిన ఫైలింగ్‌లో నికర లాభం 2,158 కోట్ల రూపాయలు (60.6 శాతం)గా నమోదైనట్టు కంపెనీ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి కంపెనీ నికర లాభం 1,343 కోట్ల రూపాయలు.

11/15/2019 - 04:30

హైదరాబాద్, నవంబర్ 14: తెలంగాణ ఫార్మా ఉత్పత్తుల ఎగుమతి కోసం హైదరాబాద్ నుంచి డల్లాస్‌కు నేరుగా విమాన సర్వీస్ ఏర్పాటుకు కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్‌కు దక్షిణ అమెరికా చాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కోరారు. అమెరికా పర్యటనకు వెళ్లిన వినోద్‌కుమార్ తిరుగు ప్రయాణంలో డల్లాస్‌లో ఆగారు.

11/15/2019 - 04:28

న్యూఢిల్లీ, నవంబర్ 14: భారత స్టాక్ మార్కెట్లలో గురువారం టెలి కం రంగానికి చెందిన కంపెనీల షే ర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. వొడా ఐడియా, భారతి ఎయిర్‌టెల్ కంపెనీ ల షేర్ల ధర 21.6 శాతం పతనమైంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, ఆదాయంలో వాటాను మూడు నెలల్లోగా చెల్లించాలని టెలికం కంపెనీలకు డీఓటీ నోటీసులు జారీ చేయడమే ఈ నష్టానికి కారణని అంటున్నారు. వొడా ఐడియా షేర్ల ధర 21.62 శాతం లేదా 2.90 రూపాయలు పతనమైంది.

11/15/2019 - 04:27

ముంబయి, నవంబర్ 14: భారత స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలను ఎదుర్కొనే ప్రమాదంలో పడినప్పటికీ, చివరి క్షణాల్లో పెట్టుబడిదారులు షేర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో కోలుకొని, లాభాలను ఆర్జించాయి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో లావాదేవీలు మొదలైన మరుక్షణం నుంచే పతనం ప్రారంభమైంది. మధ్యాహ్నంలోగా భారీ పతనం తప్పదన్న సంకేతాలు వెలువడ్డాయి.

11/14/2019 - 05:58

న్యూఢిల్లీ: దిగ్గజ సూచీ ‘నేషనల్ కమోడిటీస్ అండ్ డెరివేటివ్స్ ఎక్చేంజ్ లిమిటెడ్’ (ఎన్‌సీడీఈఎక్స్) ప్రత్యేకంగా రిటర్న్‌ల ఆధారిత వ్యవసాయ అంశాలతో కూడిన సూచీ (ఏజీఆర్‌ఐడీఈఎక్స్)ని బుధవారం ప్రారంభించింది. జాతీయ స్టాక్ ఎక్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ఇండిసెస్ లిమిటెడ్ భాగస్వామ్యంతో తమ సూచీ పనిచేస్తుందని ఎన్‌సీడీఈఎక్స్ ఈ సందర్భంగా పేర్కొంది.

11/13/2019 - 23:06

ముంబయి, నవంబర్ 13: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలపాలయ్యాయి.

11/13/2019 - 23:04

న్యూఢిల్లీ, నవంబర్ 13: రేబిస్ చికిత్సకు కైరోర్యాబ్ వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ విడుదల చేసింది. ఢిల్లీలో బుధవారం భారత డ్రగ్ కంట్రోల్ అధికారి డా. ఎస్ ఈశ్వర్‌రెడ్డి, కేంద్ర బయోటెక్నాలజీ కార్యదర్శి డా. రేణు స్వరూప్, భారత్ బయోటెక్ ప్రైవేటు లిమిటెడ్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా ఈ వ్యాక్సిన్‌ను విడుదల చేశారు.

Pages