S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/18/2019 - 23:39

న్యూఢిల్లీ, నవంబర్ 18: ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, దేశంలో ఆర్థిక వృద్ధి రేటు మందగించిందన్న కథనాల్లో ఎలాంటి నిజం లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం లోక్‌సభలో స్పష్టం చేశారు.

11/18/2019 - 06:36

న్యూఢిల్లీ : జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) దేశీయ స్టాక్ మార్కెట్ల ద్వారా రూ. 35 వేల కోట్ల నిధులు సమీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కీలక నెలల్లోనే ఇందుకు సంబంధించిన ప్రణాళికలు అమలు చేయాలని నిర్ణయింది. తద్వారా వాణిజ్యాభివృద్ధితోబాటు ప్రభుత్వం చేపడుతున్న వివిధ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి పథకాలకు ఊతమివ్వాలని నాబార్డు భావిస్తోంది.

11/18/2019 - 01:22

విజయవాడ, నవంబర్ 17: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఇచ్చే ప్రోత్సాహకాలు భారీ మొత్తంలో పేరుకుపోయాయి. దాదాపు రెండేళ్లుగా పరిశ్రమలు ఏర్పాటు చేసినవారు ప్రోత్సాహకాల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి ప్రోత్సాహకాలను గత ప్రభుత్వం ప్రకటించింది.

11/17/2019 - 23:02

న్యూఢిల్లీ, నవంబర్ 17: ఆర్-క్లస్టర్ కేజీ-డీ 6 బ్లాక్‌లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త క్షేత్రాల నుంచి ఉత్పత్తి కానున్న మెజారిటీ శాతం సహజవాయువు (గ్యాస్)ను ఎస్సార్ స్టీల్, అదానీ గ్రూప్‌తోబాటు ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్ దక్కించుకున్నాయి. ఒక్కో యూనిట్ 5.1 నుంచి 5.16 డాలర్ల వంతున ఈ కొనుగోళ్లు జరిగాయి. ఐతే ఎరువుల కంపెనీలు వేలం పాటలకు గైర్హాజరయ్యాయి. దీంతో ఏడాదికి కనీసం రూ.

11/17/2019 - 23:04

గత వారం సల్ప లాభాలతో బయటపడిన భారత స్టాక్ మార్కెట్లు కొత్త వారంలో ఎలా ఉంటాయన్న ఉత్కంఠ అంతటా నెలకొంది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం నుంచి ఇరాన్, ఇరాక్‌లో నెలకొన్న అనిశ్చితి వరకూ, రూపాయ మారకపు విలువ హెచ్చుతగ్గుల నుంచి వివిధ కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాల వరకూ ఎన్నో అంశాలు స్టాక్ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తాయనడంలో ఎలాంటి అనుమానం లేదు. వాటి గమనం ఏ విధంగా ఉంటుందనేదే ప్రశ్న.
*

11/17/2019 - 06:08

న్యూఢిల్లీ: భారీ నష్టాలతో, ఆర్థికంగా దెబ్బతిన్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ (ఆర్‌కామ్) డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా చేశారు. శనివారం సమర్పించిన ఫైలింగ్‌లో ఈ రాజీనామా అంశం ఉంది. అనిల్‌తోపాటు ఛాయా విరానీ, రీనా కరానీ, మంజరీ కక్కర్, సురేష్ రంగాచార్ కూడా డైరెక్టర్లుగా తమతమ పదవులకు రాజీనామా చేశారు. ఫైనాన్షియల్ డైరెక్టర్‌గా శ్రీమణికంఠన్ ఇది వరకే ఇది వరకే వైదొలిగారు.

11/16/2019 - 23:54

ముంబయి, నవంబర్ 16: ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి ఈవారం భారత్‌పైనా ప్రభావం చూపిం ది. అయితే, భారీ నష్టాల బారిన పడకుండా, స్వల్ప లాభాలతో బయటపడి, ఊపిరి పీల్చుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) లో 40,323.61 పాయింట్లతో సోమవారం ప్రారంభమైన సెనె్సక్స్ ఒకానొక దశలో నష్టాల ఊబిలో కూరుకుపోయి, బయటపడే అవకా శం లేదనే అభిప్రాయాన్ని కలిగించింది.

11/16/2019 - 23:52

తెహ్రాన్, నవంబర్ 16: పెట్రోలియం వనరులు ఎక్కువగా ఉన్న ఇరాన్‌లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పెట్రోల్ ధరను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, వేలాదిగా పౌరులు నిరసనలకు దిగుతున్నారు. దేశంలోని వివిధ ప్రధాన నగరాలు, పట్టణాల్లో శనివారం కూడా నిరసనలు కొనసాగాయి.

11/16/2019 - 23:50

న్యూఢిల్లీ, నవంబర్ 16: ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంగాలో దేశీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 4.9 శాతం వరకూ ఉండవచ్చని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్) తన తాజా నివేదికలో అంచనా వేసింది. మొదటి త్రైమాసికంలో 5 శాతంగా ఉన్న జీడీపీ ద్వితీయ త్రైమాసికంలో కోలుకోలేకపోయింది. ఈ పరిస్థితి తదుపరి నెలల్లోనూ కొనసాగే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

11/16/2019 - 23:50

నాగపూర్, నవంబర్ 16: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎఈ) ఎగుమతులను పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి వెల్లడించారు. సూక్ష్మ, చిన్న పరిశమల (ఎస్‌ఎంఈ) సదస్సులో పాల్గొన్న గడ్కరి మాట్లాడుతూ, దేశ వృద్ధిరేటులో 29 శాతం, ఎగుమతుల్లో 48 శాతం ఎంఎస్‌ఎఈ రంగానిదేనని తెలిపారు. అదే విధంగా ఈ రంగంలో 10 నుంచి 11 కోట్ల మంది ఉపాధి పొందుతున్నట్టు చెప్పారు.

Pages