S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/25/2019 - 00:39

విజయవాడ, నవంబర్ 24: రాష్ట్రంలో బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరలు ఘాటెక్కాయి. బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లిపాయలు 80 నుంచి 100 రూపాయల ధరకు విక్రయిస్తున్నారు. ధరల స్థీరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా ఇంకా ఉల్లి ధర తగ్గలేదు. ఉల్లి ధరను నియంత్రించేందుకు వీలుగా కర్నూలు నుంచి రోజుకు 150 మెట్రిక్ టన్నులు మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేసి 80 రైతుబజార్ల ద్వారా విక్రయిస్తోంది.

11/24/2019 - 07:08

న్యూఢిల్లీ: ఎగుమతులను మరింత పెంచేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు కేంద్రం ఇటీవల చేసిన ప్రకటనకు భారీ స్పందన కనిపిస్తున్నది. దాదాపుగా అన్ని రంగాలకు చెందిన కంపెనీలు, సంస్థలు ఎగుమతులపై దృష్టి పెట్టాయి. ఎగుమతులను మరింతగా పెంచాలంటే, వివిధ వస్తుసేవలపై పన్ను, సర్‌చార్జీల మినహాయింపు తప్పనిసరి అన్న వాదన చాలాకాలంగా ఉంది.

11/24/2019 - 06:15

ముంబయి, నవంబర్ 23: భారత స్టాక్ మార్కెట్లు ఏ దిశగా వెళుతున్నాయన్నది అగమ్యగోచరంగా మారింది. ఎవరికీ అంతుచిక్కని రీతిలో లాభనష్టాల దాగుడుమూతలు కొనసాగుతున్నాయి. ఈ వారం బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ), నేషనల్ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో లావాదేవీలను పరిశీలిస్తే, ఈవారం మొత్తం అనిశ్చితిలోనే ట్రేడింగ్ కొనసాగిందనే విషయం స్పష్టమవుతున్నది.

11/24/2019 - 06:14

న్యూఢిల్లీ, నవంబర్ 23: అశోకా బిల్డ్‌కాన్ సంస్థకు భారీ కాంట్రాక్టు లభించింది. ఈ కంపెనీకి అనుబంధ సంస్థగా ఉన్న అశోకా కనె్సషన్స్ లిమిటెడ్ (ఏసీఎల్)కు తెలంగాణలో జాతీయ రహదారుల ప్రాజెక్టు కోసం 1,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుకు సంబంధించిన లెటర్ ఆఫ్ అవార్డు (ఎల్‌ఓఏ)ను నేషనల్ హైవీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అందచేసింది. ఈ విషయాన్ని ఏసీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.

11/22/2019 - 06:25

ముంబయి: వాహన రంగ దిగ్గజం టొయోటాకు చెందిన అనుబంధ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎన్‌ఎఫ్‌బీసీ) విభాగం ‘టొయోటా ఫైనాన్షియల్ సర్వీసెస్’ గురువారం ‘సత్వర ఆర్థిక చేయూత పథకం’ (ఇన్‌స్టెంట్ ఫైనాన్సింగ్ స్కీం)ను ఆరంభించింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు కారు రుణాన్ని కేవలం 30 నిమిషాల్లో పొందవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు.

11/22/2019 - 01:14

విజయవాడ, నవంబర్ 21: రాష్ట్రంలోని రైతు బజార్లలో ఉల్లిపాయలను కిలో 25 రూపాయలకే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో మార్కెటింగ్ శాఖపై గురువారం జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నెల రోజులపాటు రైతు బజార్లలో కిలో 25 రూపాయలకే విక్రయించాలని తెలిపారు.

11/21/2019 - 23:47

ముంబయి, నవంబర్ 21: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లోకి జారాయి. ప్రభుత్వం తాజాగా చేపట్టిన ఆర్థికాభివృద్థి సంస్కరణలు సైతం మదుపర్ల లాభాల స్వీకరణకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. ఓవైపు అమెరికా-చైనా వాణిజ్య చర్చల తాలూకు అయోమయం సైతం స్టాక్ మార్కెట్లకు ప్రతికూలంగా మారిందని విశే్లషకులు చెబుతున్నారు.

11/21/2019 - 23:45

న్యూఢిల్లీ, నవంబర్ 21: జీ ఎంటర్‌టైనె్మంట్ ఎంటర్‌ప్రైజెస్ వాటాలు గురువారం 12 శాతం వృద్ధిని నమోదు చేశాయి. రుణా లు చెల్లించేందుకు వీలుగా ఈ సంస్థలోని 16.5 శాతం వాటాల ను విక్రయించనున్నట్టు సుభాష్ చంద్ర నేతృత్వంలోని ప్రమోటర్ ఎస్సెల్ గ్రూప్ ప్రకటించిన క్రమంలో స్టాక్ మార్కెట్లో ఈ వాటాలు రాణించాయి. బీఎస్‌ఈలో 12.40 శాతం వృద్ధితో ఒ క్కోవాటా రూ. 345.25 వంతున ట్రేడైంది.

11/21/2019 - 23:43

ప్యారిస్, నవంబర్ 21: అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధి రేటు 2021లో సైతం గాడిలో పడుతుందన్న ఆశలేవీ కనిపించడం లేదని అంతర్జాతీయ ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్ధ ‘ఓఈసీడీ’ గురువారం నాడిక్కడ ప్రకటించింది. ఈ మేరకు ప్యారిస్‌కు చెందిన ఈ సంస్థ సవరించిన 2020 అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధి అంచనాల నివేదికను విడుదల చేసింది. వచ్చే ఏడాది ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య కార్యకలాపాలు 2.9 శాతం విస్తరించవచ్చని ఆ సంస్ధ అంచనావేసింది.

11/21/2019 - 23:43

న్యూఢిల్లీ, నవంబర్ 21: బంగారు ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాములు (తులం) బంగారం ధర రూ. 53 తగ్గి మొత్తం ధర 39,007గా ట్రేడైంది. రూపాయి విలువ స్వల్పంగా వృద్ధిచెందిన క్రమంలో ఈ పరిణామం చోటుచేసుకుందని వాణిజ్య వర్గాలు తెలిపాయి. బుధవారం ఈ ధర రూ. 39,060గా ఉండేది. ఇక వెండి ధరలు స్వల్పంగా (రూ. 20) దిద్దుబాటుకు గురై కిలో రూ. 45,830 వంతున ట్రేడైంది. బుధవారం నాడు ఈ ధర రూ.

Pages