S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/21/2019 - 06:23

న్యూఢిల్లీ : భారత పెట్రోలియం సంస్థ ఐదు ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. అస్సాంలోని నుమోలిఘర్ రిఫైనరీ లిమిటెడ్ నుంచి ప్రభుత్వ వాటాలను వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించా రు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విలేఖరుల సమావేశంలో ప్రకటించారు.

11/21/2019 - 01:53

న్యూఢిల్లీ, నవంబర్ 20: తక్కువ వడ్డీకే ఫోరెక్స్ లోన్లు అందజేసే అంశా న్ని పరిశీలిస్తున్నామని కేంద్ర ఎగుమతులు, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం ఓ ప్రశ్నకు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం చెప్పారు. ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉందని, అన్ని రకాలుగా అధ్యయనం చేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

11/20/2019 - 23:44

ముంబయి, నవంబర్ 20: రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్‌పార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్ లాభాల పంట పండించడంతో బుథవారం సైతం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ప్రత్యేకించి బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 182 పాయింట్లు ఎగబాకి జీవితకాల గరిష్టానికి చేరువైంది. ఆరంభం నుంచే జోరందుకున్న ఈ సూచీ ఓ దశలో ఇంట్రాడే రికార్డు స్థాయి 40,816.38ను తాకింది.

11/20/2019 - 23:14

న్యూఢిల్లీ, నవంబర్ 20: భారత్ అమలు చేస్తున్న ఎగుమతుల మంజూర్లు, రాయితీలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు అనుగుణంగా లే వంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) వివాదాల పరిష్కార కమిటీ ఇచ్చిన రూలింగ్‌పై భారత్ బుధవారం అప్పీలుకు వెళ్లింది. అమెరికా ఈ ఆరోపణలను భారత్‌పై గుప్పించి డబ్ల్యుటీఓకి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా అమెరికా ఐదు ఆరోపణలు చేసింది.

11/20/2019 - 23:13

ముంబయి, నవంబర్ 20: మహీంద్రా గ్రూప్‌లోని సరసమైన ధరలకు గృహ నిర్మాణాలు చేసే విభాగం ‘మహీంద్రా హేప్పినెస్ట్’ వచ్చే ఐదేళ్ల కాలంలో సుమారు 10వేల యూనిట్లు పూర్తి చేసి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఆదాయాన్ని రూ. 2,500 కోట్లకు చేర్చాలన్న నిర్ణయించినట్టు సంబంధిత అధికారులు తెలిపారు.

11/20/2019 - 23:12

న్యూఢిల్లీ, నవంబర్ 20: చమురు, సహజ వాయువుల కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) రెండు బిలియ న్ డాలర్ల ఖర్చుతో ‘మధ్య కాలిక నోట్’ కార్యక్రమం ద్వారా చేపట్టేందుకు ప్రతిపాదించిన ‘సీనియర్ అన్‌సెక్యూర్డ్ నోట్లు’ విడుదలకు బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ అసోసియేట్స్ (బీఏఏ)1గా రేటింగ్ ఇచ్చినట్టు మూడీస్ ఇనె్వస్టర్స్ సర్వీస్ బుధవారం నాడిక్కడ వెల్లడించింది. ఈ రేటింగ్స్ ఔట్‌లుక్ వ్యతిరేకంగా ఉందని మూడీస్ ఓ ప్రకటనలో తెలిపింది.

11/20/2019 - 06:09

న్యూఢిల్లీ: వచ్చే డిసెంబర్ మాసం నుంచి కాల్, డేటా చార్జీలు పెంచుతున్నట్టు ప్రకటించిన వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ వాటాలకు మంగళవారం స్టాక్‌మార్కెట్‌లో మంచి డిమాండ్ నెలకొంది. ఈ రెండు ప్రైవేటు టెలికాం సంస్ధల వాటాలు దాదాపు 35 శాతం లాభపడ్డాయి. బీఎస్‌ఈలో వొడాఫోన్ ఐడియా వాటా 34.68 శాతం లాభపడి రూ. 6.02 వంతున ధర పలికింది. ఇంట్రాడేలో ఈ వాటాల విలువ 42.95 శాతం పెరిగింది.

11/20/2019 - 04:41

తిరుపతి, నవంబర్ 19: శ్రీవారి భక్తులు హుండీలో సమర్పించే కానుకలు ఇతర మార్గాల్లో టీటీడీకి లభించే నిధులను ఇకపై జాతీయ బ్యాంకుల్లో మాత్రమే జమ చేయాలని పాలకమండలి నిర్ణయించినట్లు సమాచారం. అయితే జాతీయ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై తక్కువ వడ్డీ ఇస్తున్న నేపథ్యంలో టీటీడీకి రూ. 100 కోట్లు మేర నష్టం వచ్చే అవకాశం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి రూ.

11/20/2019 - 02:02

హైదరాబాద్, నవంబర్ 19: తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించేలా తమ ప్రభుత్వ విధానాలు ఉంటాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హామీ ఇచ్చారు. పెట్టుబడులు పెట్టే కంపెనీలకు పూర్తి సహకారం ఉంటుందన్నారు. సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్ టియాన్ నేతృత్వంలో పారిశ్రామికవేతల బృందం మంగళవారం మంత్రి కేటీఆర్‌తో సమావేశమైంది.

11/19/2019 - 23:19

ముంబయి, నవంబర్ 19: దేశీయ, అంతర్జాతీయ సానుకూలతలు తోడవడంతో మంగళవారం స్టాక్ మార్కెట్లు మంచి లాభాలను సంతరించుకున్నాయి. ప్రధానంగా హెవీవెయిట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌టెల్ భారీగా లాభపడ్డాయి. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 185.51 పాయింట్లు (0.46 శాతం) లాభాపడి 40,544.13 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది. ఈ ప్యాక్‌లోని 30 స్టాక్స్‌లో 11 స్టాక్స్ లాభపడ్డాయి.

Pages