S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/19/2019 - 23:17

న్యూఢిల్లీ, నవంబర్ 19: దేశీయ మార్కెట్లలో బంగారు, వెండి ధరలు మంగళవారం మరోమారు పెరిగాయి. అంతర్జాతీయం మార్కెట్లలో బంగారానికి అంతగా ఆదరణ లేకపోయినా దేశీయ మార్కెట్లో ధరలు పెరిగాయని వాణిజ్యవర్గాలు చెబుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం రూ. 38,700 పలికిన 10 గ్రాముల (తులం) బంగారం ధర మంగళవారం రూ. 328 పెరిగి మొత్తం రూ. 39,028 చేరింది. అలాగే 24 కేరట్ల స్పాట్‌గోల్డ్ ధర కూడా రూ. 328 పెరిగింది.

11/19/2019 - 23:15

ముంబయి, నవంబర్ 19: బ్యాంకు డిపాజిట్లపై బీమా కవరేజీని ప్రస్తుతం ఉన్న రూ. లక్ష నుంచి రూ. 10 లక్షలకు పెంచాలని రిజర్వు బ్యాంకు ఉద్యోగ సంఘాలు మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.

11/19/2019 - 23:14

ముంబయి, నవంబర్ 19: సంక్షోభంలో చిక్కుకున్న పంజాబ్, మహారాష్ట్ర సహకార (పీఎంసీ) బ్యాంకు డిపాజిటర్లకు మరో వెసులుబాటు లభించింది. ఆరోగ్య పరమైన అత్యవసర చికిత్సల కోసం డిపాజిటర్లు రూ. లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం డిపాజిటర్లు రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) నియమించిన బ్యాం కు పాలకుడిని సంప్రదించాలని మంగళవారం ముంబయి హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఆర్‌బీఐ తెలిపింది.

11/19/2019 - 23:14

న్యూఢిల్లీ, నవంబర్ 19: బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేస్తున్న దాదాపు 77 వేల మంది ఉద్యోగులు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకం కోసం ఇప్పటి వరకు ఆష్షన్లు ఇచ్చారని విశ్వసనీయ అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ పథకానికి ప్రస్తుతం పనిచేస్తున్న 1.50 లక్షల మందిలో లక్షమంది ఉద్యోగులు అర్హులని బీఎస్‌ఎన్‌ఎల్ తేల్చింది. 2020 జనవరి 31 నాటికి ఈ పథకం అమలు చేయాల్సి ఉంది.

11/19/2019 - 06:34

న్యూఢిల్లీ: దేశ ఆర్ధికాభివృద్ధికి దోహదం చేసే కీలక రంగాల్లో టెలికాం కూడా ఒకటని, 5జీ సాంకేతికతతో ఈశాఖ మరింత బలోపేతం కావడం తథ్యమని కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ (డీఓటీ) కార్యదర్శి అన్షుప్రకాష్ పేర్కొన్నారు. ఆసియన్ ట్రాయ్ నేతృత్వంలో సోమవారం నాడిక్కడ ‘ విధాన నియంత్రణ, అభివృద్ధికి సమున్నత సమర్థత, సహేతుక పనితీరు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.

11/19/2019 - 06:08

ముంబయి, నవంబర్ 18: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. ప్రైవేటు బ్యాంకులు, ఐటీ, ఇంధన స్టాక్స్ భారీ నష్టాల పాలయ్యాయి. బలహీన జీడీపీ వృద్ధిరేటు అంచనాల ప్రభావం సైతం స్టాక్ మార్కెట్లపై పడిందని విశే్లషకులు భావిస్తున్నారు. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఉదయం సానుకూలంగానే కదలాడినప్పటికీ మదుపర్లు లాభాల స్వీకరణకు పాల్పడడంతో మధ్యాహ్నం నుంచి ప్రతికూల దిశగా సాగింది.

11/19/2019 - 06:06

న్యూఢిల్లీ, నవంబర్ 18: మోసపూరిత వాణిజ్యానికి పాల్పడిన ఆరు కంపెనీలపై కేపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సోమవారం రూ. 37.6 లక్షల జరిమానాలు విధించింది. వినాయక ఫిన్‌లీజ్ ప్రైవేటు లిమిటెడ్, హైటెక్ కెమికల్స్ హెరిటేజ్ లిమిటెడ్, గ్రాండ్‌గ్రిండ్ బార్టర్ ప్రైవేట్ లిమిటెడ్, టాప్‌లైట్ కమర్షియల్స్ లిమిటెడ్, వ్రింకిల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లపై ఈ మేరకు సెబీ కొరడా ఝళిపించింది.

11/19/2019 - 06:05

న్యూఢిల్లీ, నవంబర్ 18: టెలికం కంపెనీలు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం మూడేళ్ల మారిటోరియం (విరామం) మంజూరు చేయాలని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండి యా (సీఓఏఐ) సోమవారం నాడిక్కడ కోరింది. బకారుూల చెల్లింపునకు గడువును సైతం పొడిగించాలని, వడ్డీలను సరళతరం చేయాలని విజ్ఞప్తి చేసింది.

11/19/2019 - 01:53

విజయవాడ, నవంబర్ 18: హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ధర, అమర్చేందుకు అయ్యే చార్జీలు వాహన కొనుగోలు ధరలో కలిపి ఉంటాయి. కొత్త వాహనాలకు సంబంధించి ఈ ప్లేట్‌ను అమర్చే బాధ్యత ఆయా వాహన డీలర్లేదే. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నాటికి లేదా అంతకుముందు తయారైన వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్‌ను ఆయా వాహనాల తయారీదార్లే డీలర్లకు సరఫరా చేయాలని కేంద్ర రహదారులు, రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది.

11/19/2019 - 00:39

విశాఖపట్నం, నవంబర్ 18: బ్యాంకుకు రుణం ఎగవేతకు పాల్పడినందుకు గాను మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు ఇంటిని వేలం వేసేందుకు బ్యాంకర్లు సిద్ధపడ్డారు. ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ సంస్థ పేరిట గంటా శ్రీనివాసరావు మరో ఏడుగురు ఇండియన్ బ్యాంకు నుంచి రుణం పొందారు. దీనికి గాను వివిధ ప్రాంతాల్లోని తమ ఆస్తులను బ్యాంకుకు తనఖా పెట్టారు.

Pages