S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/29/2017 - 00:46

హైదరాబాద్, జూలై 28: ‘నేటి నుంచి టైగర్‌ఎయిర్ విమానాలన్నీ స్కూట్ ఎయిర్‌లైన్స్ ఆధ్వర్యంలో నడుస్తాయి.’ అని సింగపూర్ ఎయిర్‌లైన్స్ అనుబంధ సంస్థ అయిన స్కూ ట్ ఎయిర్‌లైన్స్ శుక్రవారం ఇక్కడ తెలిపింది.

07/29/2017 - 00:45

న్యూఢిల్లీ, జూలై 28: ఔషధ ఎగుమతులలో విశాఖపట్నం దూసుకుపోతోందని, గడిచిన మూడేళ్ల కాలంలో విశాఖపట్నంలోని ఫార్మా రంగం ఎగుమతుల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోందని కేంద్ర కెమికల్స్, ఫర్టిలైజర్స్ శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాడవీయ వెల్లడించారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో విశాఖ నుంచి 1,04,679.68 కోట్ల రూపాయల విలువైన ఫార్మా ఉత్పత్తుల ఎగుమతి జరిగినట్లు ఆయన తెలిపారు.

07/29/2017 - 00:44

కోల్‌కతా, జూలై 28: వివిధ రంగాల్లో ఇప్పటికే విస్తరించిన ఐటిసి కొత్తగా పండ్లు, కూరగాయలు లాంటి వ్యవసాయ అనుబంధ రంగాల్లోకి ప్రవేశించాలని అనుకుంటున్నట్లు ఐటిసి చైర్మన్ వైసి దేవేశ్వర్ చెప్పారు. అలాగే ఔషధ మొక్కల సాగు రంగంలో కూడా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నట్లు శుక్రవారం ఇక్కడ జరిగిన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ ఆయన అన్నారు.

07/29/2017 - 00:44

ముంబయి, జూలై 28: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 73.42 పాయింట్లు పడిపోయి 32,309.88 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 6.05 పాయింట్లు కోల్పోయి 10,014.50 వద్ద నిలిచింది.

07/29/2017 - 00:43

విశాఖపట్నం, జూలై 28: విశాఖ పోర్టు ట్రస్టును అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధులు శుక్రవారం సందర్శించారు. పోర్ట్ ట్రస్టు చైర్మన్ ఎంటి కృష్ణబాబు కాన్సులేట్ బృందానికి సాదర స్వాగతం పలికారు. అనంతరం అమెరికన్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ బిట్రస్ హెడా తన బృందంతో పోర్టులో పలు విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కాన్సులేట్ ప్రతినిధులకు పోర్టు ప్రగతిని కృష్ణబాబు వివరించారు.

07/29/2017 - 00:41

భీమవరం, జూలై 28: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 1,542 తపాలా కార్యాలయాల్లో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఎపి సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కె బాలసుబ్రహ్మణ్యన్ చెప్పారు. ఈ కేంద్రాల ద్వారా అధార్ కార్డు అవసరమైన వారి వివరాలు కంప్యూటరీకరించి, యుఐడి ఇస్తారన్నారు. అలాగే ఆధార్ కార్డుల్లో పేర్లు తప్పుగా ప్రచురణ జరిగినా సరిచేస్తామన్నారు.

07/28/2017 - 00:40

ఇంటెక్స్ టెక్నాలజీ గురువారం దేశీయ మార్కెట్‌లోకి ఓ సరికొత్త 4జి ఆధారిత స్మార్ట్ఫోన్‌ను విడుదల చేసింది. ఆక్వా ఎస్3 4జి-వోల్ట్ పేరుతో పరిచయమైన ఈ స్మార్ట్ఫోన్ ధర 5,899 రూపాయలు. ఆండ్రాయడ్ 7 ఒఎస్‌పై పనిచేసే దీనిలో 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయ. సెల్ఫీలకూ ఎల్‌ఇడి ఫ్లాష్ వస్తుందని సంస్థ తెలిపింది. దీనిలో 2జిబి ర్యామ్ ఉన్నట్లు పేర్కొంది.

07/28/2017 - 00:39

దేశీయ ఆటో రంగ సంస్థ టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్).. మార్కెట్‌లోకి రేంజ్ రోవర్ ఎస్‌వి ఆటోబయోగ్రఫి డైనమిక్ పేరుతో ఓ స్పోర్ట్స్ యుటిలిటి వాహనాన్ని (ఎస్‌యువి) తీసుకొచ్చినట్లు గురువారం తెలిపింది. ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర 2.79 కోట్ల రూపాయలు.

07/28/2017 - 00:36

న్యూఢిల్లీ, జూలై 27: నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌ఎల్)లో ప్రభుత్వ వాటా 15 శాతం విక్రయం ద్వారా ఖజానాకు దాదాపు 536 కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. రెండు రోజులపాటు ఎన్‌ఎఫ్‌ఎల్ ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్‌ఎస్) కార్యక్రమం జరగగా, రెండో రోజైన గురువారం 107 కోట్ల రూపాయల విలువైన షేర్లకుగాను 178.67 కోట్ల రూపాయల విలువైన బిడ్లు రిటైల్ మదుపరుల నుంచి దాఖలయ్యాయి.

07/28/2017 - 00:36

ముంబయి, జూలై 27: ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్.. యాక్సిస్ బ్యాంక్‌కు తమ పేమెంట్ వాలెట్ ఫ్రీచార్జ్‌ను అమ్మేసింది. ఏడాది నుంచి దీని అమ్మకానికి ప్రయత్నిస్తున్న స్నాప్‌డీల్.. ఏకంగా 90 శాతం తక్కువ ధరకే విక్రయించేందుకు గురువారం అంగీకరించింది. దీంతో యాక్సిస్ బ్యాంక్ చేతికి ఫ్రీచార్జ్ కేవలం 385 కోట్ల రూపాయలకే వస్తోంది.

Pages