S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/18/2019 - 04:52

పత్తికొండ : కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమోటా ధర గురువారం అమాంతం తగ్గిపోవడంతో రైతులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఉదయం వరకు జత గంపలు రూ.500 పలికిన ధర మధ్యాహ్నానికి రూ.70కి పడిపోయింది. అంతకుమించి కొనుగోలు చేసేది లేదని వ్యాపారులు ఖరాకండిగా చెప్పడంతో రైతన్నలు ఆగ్రహంతో రోడ్డెక్కారు. దళారులు, వ్యాపారులు కుమ్మకై తమ పొట్టకొడుతున్నారని ఆరోపిస్తూ రహదారిపై మూడు గంటల పాటు ఆందోళన చేశారు.

10/18/2019 - 04:49

ముంబయి, అక్టోబర్ 17: వరుసగా ఐదోరోజూ లాభాల బాట పట్టిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు తాజాగా గురువారం అత్యధిక లాభాలను నమోదు చేశాయి. ప్రధానంగాబ్రిటన్-ఐరోపా దేశాల మధ్య చర్చలు బ్రెగ్జిట్ డీల్ కుదిరే దశకు చేరడం అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో మదుపర్లకు సానుకూల అంశంగా మారింది.

10/17/2019 - 23:36

విశాఖపట్నం, అక్టోబర్ 17: రైల్వేలో రోజురోజుకూ పెరుగుతున్న ఖర్చును తగ్గించుకునే క్రమంలో కార్మికులను కుదించాలని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రైవేటీకరణలో భాగంగా కార్మికుల కుదింపునకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఒకేసారి కాకుండా ప్రతి ఏడాది దశలవారీగా కుదింపు చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది.

10/17/2019 - 23:03

న్యూఢిల్లీ/జెనీవా, అక్టోబర్ 17: వచ్చే జనవరి 21 నుంచి 24వ తేదీ వరకు దావోస్‌లోని స్విస్ అల్పైన్ పట్టణంలో జరుగనున్న 50వ ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యుఈఎఫ్) వార్షిక సమావేశం దేశాల మధ్య బలమైన, సుస్థిర బంధం నెలకొనేందుకు దోహదం చేస్తుదన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది. సుమారు మూడు వేల మందికి పైగా అంతర్జాతీయ స్థాయి నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

10/17/2019 - 23:02

ముంబయి, అక్టోబర్ 17: ఆర్థిక మాంద్యంతో వ్యక్తిగత ఐశ్వర్యవంతుల సంపద వృద్ధిరేటులో మందగమనం చోటుచేసుకుంటోంది. 2018లో ఈ వృద్ధిరేటు 13.45 శాతం నుంచి 9.62శాతానికి పడిపోయింది. ఇప్పటికీ ఆ మందగమనం కొన సాగుతూనే ఉందని ‘కార్వీ వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ నిర్వహించిన అధ్యయన నివేదిక గురువారం నాడిక్కడ వెల్లడించింది.

10/17/2019 - 23:02

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) భాగస్వామ్యాన్ని ‘వొడాఫోన్ ఐడియా లిమిటెడ్’ (వీఐఎల్) సంస్థ మరో ఐదేళ్లపాటు కొనసాగించనుంది. ఈమేరకు ఒప్పదం కుదిరిందని దేశంలో అతిపెద్ద ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ గురువారం నాడిక్కడ తెలిపింది. దాదాపు దశాబ్ధకాలంగా సాగుతున్న ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరో ఐదేళ్లపాటు కొనసాగించడం ఆనందంగా ఉందని టీసీఎస్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

10/17/2019 - 05:50

న్యూఢిల్లీ: భారతలో తమ పెట్టుబడులను కొనసాగిస్తామని, ప్రత్యేకించి స్థిరాస్తి రంగంలో ఒక ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేసుకోవడంతోబాటు, జాయింట్ వెంచర్ల ద్వారా ప్రాజెక్టులను చేపడతామని దుబాయ్‌కి చెందిన ‘ఎమ్మార్ ప్రాపర్టీస్’ బుధవారం నాడిక్కడ తెలిపింది.

10/17/2019 - 01:38

హైదరాబాద్, అక్టోబర్ 16: ఆర్థిక మాంద్యం అన్ని రంగాలను కుదిపేస్తున్నప్పటికీ, మద్యం విక్రయాలపై మాత్రం ఏ మాత్రం ప్రభావం చూపడం లేదని స్పష్టమైంది. రాష్ట్రంలో రిటేల్ మద్యం షాపుల లైసెన్స్‌ల జారీ కోసం కుప్పలుతెప్పలుగా వచ్చిపడిన దరఖాస్తుల సంఖ్యే ఇందుకు నిదర్శనం. రాష్టవ్య్రాప్తంగా 2,216 మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరించగా బుధవారం సాయంత్రం గడువు ముగిసేటప్పటికీ సుమారు 43 వేల దరఖాస్తులు అందాయి.

10/17/2019 - 01:14

అమరావతి, అక్టోబర్ 16: రాష్ట్రంలో పెట్టుబడులకు హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ ఇంటెలిజెంట్ ఎస్‌ఈజెడ్ లిమిటెడ్ ముందుకొచ్చింది. రెండు విడతలుగా రూ. 700 కోట్లతో ఫుట్ వేర్ యూనిట్లు నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా సంస్థ ప్రతినిధులు బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో

10/16/2019 - 22:58

చెన్నై, అక్టోబర్ 16: తమ బ్యాంకు తిరిగి స్వాధీనం చేసుకున్న రూ. 800 కోట్ల విలువైన మొత్తం ఐదువందల ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు (ఐఓబీ) బుధవారం నాడిక్కడ వెల్లడించింది. ఈమేరకు ‘ఈ-వేలం పాట’ నిర్వహించేందుకు ప్రాపర్టీ సైట్ ‘మేజిక్‌బ్రిక్స్.కామ్’తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది.

Pages