S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/11/2016 - 04:45

చెన్నై, సెప్టెంబర్ 10: ప్రభుత్వ రంగ బ్యాంకులకు గుదిబండలుగా మారిన 100 బిలియన్ డాలర్ల నిరర్థక ఆస్తుల (ఎన్‌పిఏ)్భరాన్ని తగ్గించి వాటిని గాడిలో పెట్టిన గనత ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌దేనని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసించారు. బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు పెరగడం మంచిది కాదని కూడా ఆయన అభిప్రాయ పడ్డారు.

09/11/2016 - 04:44

నాగ్‌పూర్, సెప్టెంబర్ 10: ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ ఆధ్వర్యాన నాగ్‌పూర్ సమీపంలోని మిహన్ ఏరియాలో ఏర్పాటు చేస్తున్న మెగా ఫుడ్, హెర్బల్ పార్కుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శనివారం శంకుస్థాపన చేశారు.

09/11/2016 - 04:41

సింగపూర్/సియోల్, సెప్టెంబర్ 10: దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ ఇటీవల మార్కెట్లో ప్రవేశపెట్టిన ప్రీమియం ఫ్యాబ్లెట్ ‘గెలాక్సీ నోట్-7’ని తమ విమానాల్లో ఉపయోగించరాదని పలు విమానయాన సంస్థలు నిషేధం విధించాయి. ఈ విమానయాన సంస్థల జాబితాలో తాము కూడా చేరినట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ శనివారం ప్రకటించింది. గెలాక్సీ నోట్-7లో అమర్చిన బ్యాటరీలు పేలిపోతున్నాయన్న వార్తలే ఇందుకు కారణం.

09/11/2016 - 04:38

హైదరాబాద్, సెప్టెంబర్ 10: వచ్చే ఏడాది లోగా 30 ఎక్స్‌పీరియన్స్ స్టోర్స్‌ను ప్రారంభిస్తున్నట్లు దేశంలో మొదటి కస్టమైజ్డ్ ఫర్నిచర్ సంస్థ ఇ-టేలర్ ప్రకటించింది. ఈ స్టోర్‌ను ఇక్కడ కొండాపూర్‌లో ప్రారంభించారు. ఈ ఏడాది బెంగళూరు, చెన్నై, నాగ్‌పూర్, పూణేలో ఎక్స్‌పీరియన్స్‌స్టోర్స్‌ను నెలకొల్పుతామని ఆ సంస్ధ సిఇవో డాక్టర్ మధుకర్ గంగాడి తెలిపారు.

09/11/2016 - 04:36

హైదరాబాద్, సెప్టెంబర్ 10: ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, నెట్‌వర్క్స్ ఆపరేషన్స్ సర్వీసుల విభాగంలో ఐటి సేవలను అంతర్జాతీయంగా విస్తరించామని సియోంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి తెలిపారు. గత 25 సంవత్సరాలుగా చేసిన కృషి ఫలించిందని, జియోస్పాటియల్ సర్వీసు కంపెనీలకు కూడా అవసరమైన ఐటి పరిష్కారాలు అందిస్తున్నామన్నారు.

09/11/2016 - 04:36

హైదరాబాద్, సెప్టెంబర్ 10: అమరావతిలో త్వరలో సిఐఐ కార్యాలయం ప్రారంభిస్తామని సిఐఐ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుకు చెప్పారు. లేక్‌వ్యూ క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కానె్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతిలో ప్రగతి మైదాన్ తరహాలో నేషనల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు యోచనలో సిఐఐ ఉందని ముఖ్యమంత్రికి వారు చెప్పారు.

09/10/2016 - 08:17

గుంటూరు, సెప్టెంబర్ 9: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పంటకు గులాబీ రంగు పురుగు ఆశించడం, అపరాలపై రైతులు దృష్టి పెట్టటం వంటి కారణాలతో సాధారణ విస్తీర్ణంతో పోల్చుకుంటే 25శాతం మేర పంటసాగు విస్తీర్ణం తగ్గింది. సాధారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 17 లక్షల హెక్టార్లలో రైతులు పత్తిని సాగు చేస్తుంటారు.

09/10/2016 - 08:15

హైదరాబాద్, సెప్టెంబర్ 9: పన్ను ఆదా కోసం మహీంద్రా మ్యూచువల్ ఫండ్‌ను విడుదలచేసింది. మూడు సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ కలిగిన ఓపెన్ ఎండెడ్ స్కీం అని మహీంద్రా ఫైనాన్స్ సిఇవో అశుతోష్ బిష్ణోయ్ తెలపారు. ఈ నూతన ఫండ్ ఆఫర్ వచ్చే నెల 7వ తేదీతో ముగుస్తుందన్నారు. పన్ను ఆదా చేయడం కోసమే కాకుండా దీర్ఘకాల పెట్టుబడుల కోసం అన్ని వర్గాలు వారు మదుపు చేయవచ్చని ఆయన చెప్పారు.

09/10/2016 - 08:14

బీజింగ్, సెప్టెంబర్ 9: నిపుణులైన విదేశీ కార్మికులను ఆకర్షించడం కోసం చైనా ప్రభుత్వం పలు అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా ఇప్పుడు ఇస్తున్న రెండు రకాల విదేశీ వర్క్ పర్మిట్‌ల స్థానంలో ఒకే వర్క్ వీసా సిస్టమ్‌ను తీసుకు రావాలని అనుకుంటోంది.

09/10/2016 - 08:13

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: నెట్‌వర్క్ ఇంటర్ కనెక్టివిటీ విషయమై సెల్యులార్ ఆపరేటర్ల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న వివాదం ముదురుతోంది. దీంతో ఈ వివాదంపై చర్చించేందుకు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థలతో టెలికామ్ నియంత్రణా సంస్థ ట్రాయ్ శుక్రవారం సమావేశం జరిపింది. అయితే ఈ సమావేశానికి సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సిఓఎఐ) అధికారులను దూరంగా ఉంచింది.

Pages