S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/26/2016 - 01:43

న్యూఢిల్లీ, ఆగస్టు 25: దేశంలో నిరుపయోగంగా ఉన్న కొన్ని విమానాశ్రయాలను ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌లు)గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. విమానాలను లీజుకు ఇచ్చే సంస్థలు ఈ సెజ్‌లలో తమ విమానాలను పార్కింగ్ చేసుకుని ఖాతాదారులకు ప్రదర్శించేలా వీలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

08/26/2016 - 01:42

న్యూఢిల్లీ, ఆగస్టు 25: ప్రపంచంలోని ప్రముఖ మెసేజింగ్ సర్వీసుల్లో అగ్రగామిగా కొనసాగుతున్న ‘వాట్సాప్’ తన గ్లోబల్ ప్రైవసీ పాలసీని (అంతర్జాతీయ గోప్యతా విధానాన్ని) సవరించింది. దీని ప్రకారం ఆ సంస్థ ఇకమీదట తమ వినియోగదారుల ఫోన్ నెంబర్లను తన మాతృ సంస్థ అయిన ‘ఫేస్‌బుక్’కు షేర్ చేస్తుంది.

08/26/2016 - 01:41

న్యూఢిల్లీ, ఆగస్టు 25: జన్యు మార్పిడి చేసిన తదుపరి తరం పత్తి విత్తనాలను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ చేసుకున్న దరఖాస్తును ఉపసంహరించుకున్నట్లు అమెరికాకు చెందిన ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ మాన్‌శాంటో గురువారం వెల్లడించింది. నియమ నిబంధనలకు సంబంధించిన అనిశ్చిత పరిస్థితులే ఇందుకు కారణమని ఆ సంస్థ పేర్కొంది.

08/26/2016 - 01:41

విజయవాడ, ఆగస్టు 25: ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని దశాబ్దాలుగా నామమాత్రపు కమిషన్‌తో కాలం వెళ్లదీస్తున్న 29 వేల మంది రేషన్ డీలర్లకు ప్రభుత్వం ఊరట కల్పించింది. క్వింటాలు గోధుములు, బియ్యానికి ప్రస్తుతం ఇస్తున్న 20 రూపాయల కమిషన్‌ను ఒకేసారి 70 రూపాయలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎక్స్ అఫిషియో సెక్రటరీ బి.రాజశేఖర్ బుధవారం సాయంత్రం 10వ నెంబర్‌తో జీవో విడుదల చేశారు.

08/26/2016 - 01:40

విశాఖపట్నం, ఆగస్టు 25: బ్యాంకాక్‌లో నిర్వహించిన క్వాలిటీ సర్కిల్స్ పోటీల్లో విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన క్వాలిటీ సర్కిల్స్ బంగారు పతకాలను సాధించాయి. అసోసియేన్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ సర్కిల్స్ హెడ్ క్వార్టర్స్ ఆధ్వర్యంలో క్వాలిటీ కంట్రోల్ సర్కిల్స్‌కు సంబంధించి అంతర్జాతీయ కనె్వన్షన్‌ను ఈ నెల 23 నుంచి 26 వరకూ బ్యాంకాక్ నిర్వహిస్తున్నారు.

08/26/2016 - 01:36

న్యూఢిల్లీ, ఆగస్టు 25: రుతుపవనాలు ఆశించిన దానికన్నా మెరుగ్గా ఉండడం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరగడం, కీలక సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాకడ లాంటి సానుకూల పరిణామాల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం భారత దేశ ఆర్థిక వృద్ధి గత ఏడాదికన్నా ఎక్కువగా 7.9 శాతం ఉండవచ్చని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం గోల్డ్‌మన్ సాచ్స్ అభిప్రాయ పడింది.

08/26/2016 - 01:37

ముంబయి, ఆగస్టు 25: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే భయాలు వెంటాడుతుండడంతో దేశీ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. ఆగస్టునెల డెరివేటివ్స్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం దాకా కూడా అదే బాటలో సాగాయి.

08/25/2016 - 11:02

ముంబయి: గురువారం ఉదయం దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 60 పాయింట్లు, నిఫ్టీ 20 పాయింట్లకు పైగా లాభపడ్డాయి.

08/25/2016 - 06:02

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇ)కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కనీసం 200 బేసిస్ పాయింట్ల (2 శాతం) మేరైనా వడ్డీరేట్లను తగ్గించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు. బుధవారం ఆమె ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ‘దేశంలో ఇంకా పరిశ్రమలకు రుణాలు అందుబాటులో లేవు.

08/25/2016 - 05:53

ముంబయి, ఆగస్టు 24: లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా నేతృత్వంలోని రుణపీడిత కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నుంచి బకాయిలను వసూలు చేసుకోవడానికి బ్యాంకులు విక్రమార్కుడి ప్రయత్నాలనే చేస్తున్నాయి. రుణాల కోసం బ్యాంకులకు తాకట్టు పెట్టిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆస్తులకు వేలంలో ఇప్పటిదాకా ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడం తెలిసిందే. ఇక ఇప్పుడు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బ్రాండ్ల వంతు వచ్చింది.

Pages