S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/25/2016 - 05:53

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని టెలికామ్ సంస్థ రిలయన్స్ జియోతో మొబైల్ తయారీ సంస్థలు మైక్రోమ్యాక్స్, పానసోనిక్.. ఉచిత వాయిస్, డేటా సేవల కోసం భాగస్వామ్యాన్ని చేసుకున్నాయి.

08/25/2016 - 05:52

కాకినాడ, ఆగస్టు 24: కాకినాడ సముద్ర తీరంలో ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన హోప్ ఐలాండ్‌ను రానున్న రోజుల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించి రూ. 5.76 కోట్లతో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచారు. ఈ నెల 29న టెండర్లు తెరవనున్నారు. హోప్ ఐలాండ్‌ను ఆకర్షణీయమైన రీతిలో తీర్చిదిద్దడానికి గతంలో సంబంధిత శాఖల అధికారులు ప్రణాళికలు రూపొందించారు.

08/25/2016 - 05:52

న్యూఢిల్లీ, ఆగస్టు 24: రైల్వే శాఖ 2,403 కోట్ల రూపాయల వ్యయంతో బలార్షా నుంచి కాజీపేట వరకు మూడో రైల్వే లైనును నిర్మించేందుకు అనుమతి ఇచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆర్థిక వ్యవహారాల ఉపసంఘం సమావేశంలో ఈ పథకానికి ఆమోద ముద్ర వేసింది.

08/25/2016 - 05:51

ముంబయి, ఆగస్టు 24: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. మంగళవారం స్వల్ప లాభాలకే పరిమితమైన నేపథ్యంలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 69.73 పాయింట్లు పుంజుకుని 28 వేల స్థాయిని మరోసారి అధిగమిస్తూ 28,108.39 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 17.70 పాయింట్లు పెరిగి 8,650.30 వద్ద నిలిచింది.

08/24/2016 - 04:13

న్యూఢిల్లీ, ఆగస్టు 23: అక్రమ సంపదకు అడ్డుకట్ట వేయడంలో భాగంగా, నగదు లావాదేవీల నియంత్రణపై దృష్టి పెట్టింది కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు. ఈ క్రమంలోనే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేసిన సిఫార్సును పరిశీలిస్తోంది. 3 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువైన నగదు లావాదేవీలను నిషేధించాలని సిట్ సిఫార్సు చేసింది. దీన్ని పరిశీలిస్తున్నామని సిబిడిటి చైర్‌పర్సన్ రాణీ సింగ్ నాయర్ మంగళవారం తెలియజేశారు.

08/24/2016 - 04:11

న్యూఢిల్లీ, ఆగస్టు 23: ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్, రిఫైనరీ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్), గ్యాస్ ఉత్పత్తిదారైన గెయిల్ ఇండియా లిమిటెడ్.. ఆంధ్రప్రదేశ్‌లోని పెట్రోకెమికల్ ప్లాంట్ నుంచి 50 శాతం వాటాను ఉపసంహరించుకోనున్నాయి. ఈ ప్రాజెక్టును 50:50 నిష్పత్తిలో ఇరు సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి.

08/24/2016 - 04:09

ముంబయి, ఆగస్టు 23: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆరంభం నుంచి నష్టాల్లో కదలాడిన సూచీలు చివర్లో కోలుకున్నాయి. ఈ క్రమంలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 4.67 పాయింట్లు అందుకుని 27,990.21 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచి నిఫ్టీ 3.45 పాయింట్లు పెరిగి 8,632.60 వద్ద నిలిచింది. ఐటి, పిఎస్‌యు, బ్యాంకింగ్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.

08/24/2016 - 04:08

న్యూఢిల్లీ, ఆగస్టు 23: బిలియనీర్, అడాగ్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ పెద్ద కుమారుడు జై అన్‌మోల్.. రిలయన్స్ క్యాపిటల్ బోర్డులోకి మంగళవారం అదనపు డైరెక్టర్‌గా వచ్చారు. రెండేళ్ల శిక్షణ అనంతరం 24 ఏళ్ల అన్‌మోల్ వ్యాపార అరంగేట్రం చేయగా, 2014 నుంచి వివిధ ఆర్థిక సేవల వ్యాపారాల్లో పనిచేశారు. కాగా, వచ్చే నెలలో జరిగే సాధారణ వార్షిక సమావేశంలో అన్మోల్ పూర్తిస్థాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కానున్నారు.

08/24/2016 - 04:07

జమ్మికుంట, ఆగస్టు 23: గత రెండు నెలలుగా మురిపించిన పత్తి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. రెండు నెలల క్రితం క్వింటాల్ విడి పత్తి ధర 6,650 రూపాయల మేర పలికి క్రమంగా తగ్గుతూ వచ్చి గత శుక్రవారం నాటికి 6,100 రూపాయల వద్ద స్థిరపడింది. అయతే మంగళవారం ఒకేసారి క్వింటాల్ ధర 650 రూపాయల నుంచి 850 రూపాయల మేర పడిపోయి గరిష్ఠ ధర 5,450 రూపాయలు, కనిష్ట ధర 5,250 రూపాయలుగా నమోదైంది.

08/24/2016 - 04:07

న్యూఢిల్లీ, ఆగస్టు 23: ఔషధరంగ సంస్థ అరబిందో ఫార్మా ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 23.81 శాతం పెరిగింది. 584.96 కోట్ల రూపాయలుగా నమోదైంది. భారీగా పెరిగిన అమ్మకాలే లాభాల్లో వృద్ధికి ప్రధాన కారణం. ఇక గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో ఇది 472.45 కోట్ల రూపాయలుగా ఉంది.

Pages