S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/20/2019 - 03:34

హైదరాబాద్ /గచ్చిబౌలి, సెప్టెంబర్ 19: ఐటీ ఫార్మా ఇండస్ట్రీకి హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ఇండియా ల్యాబ్ ఎక్స్ ఫో అండ్ ఫార్మా ప్రో ప్యాక్ ఎక్స్ పో 2019ను వైద్య శాఖ మంత్రి ఈటల ప్రారంభించారు. ఈసందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.

09/20/2019 - 03:31

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న సంపద నిర్వహణ సంస్థ ఇండియా ఇన్ఫోలైన్ లిమిటెడ్ (ఐఐఎఫ్‌ఎల్)కు చెందిన వాటాలు గురువారం 5 శాతం లాభపడ్డాయి. ఐఐఎఫ్‌ఎల్ హోలింగ్స్ నుంచి విడిపోయిన తర్వాత తొలిరోజు ట్రేడింగ్‌లో ఇలా లాభపడటం గమనార్హం. తొలుత ఒక్కో వాటా రూ. 1,200 వంతున ఆరంభమైన ఈ వాటా విలువ వాణిజ్య సమయం ముగిసే సమయానికి 5 శాతం అదనంగా లాభపడి రూ. 1,270.50కు చేరింది.

09/20/2019 - 03:29

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం నేపథ్యంలో అనేక పరిశ్రమలు మరోదఫా వడ్డీరేట్లు, పన్నుల్లో కోతకోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో శుక్రవారం గోవాలో జరుగనున్న 37వ వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి సమావేశ తీర్మానాలపై అందరి దృష్టీ కేంద్రీకృతమైంది.

09/20/2019 - 03:28

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: రిలయన్స్ ఇండస్ట్రీస్‌లోప్రమోటర్, చైర్మన్ ముఖేష్ అంబానీ కొత్తగా వా టాలేవీ తీసుకోలేదని, అందువల్ల ఆయన వాటల్లో ఎలాంటి పెరుగుదలా లేదని గురువారం నాడిక్కడ ఆ సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఓటింగ్ హక్కు లు, వాటాల పరిమితి మేరకు ప్రమోట్, ప్రమోట్ గ్రూప్‌నకు రూ.

09/19/2019 - 05:02

ముంబయి : ఎట్టకేలకు ముడిచమురు ధరలు తగ్గడంతోబాటు రూపాయి మారకం విలువ బలపడటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం పుంజుకున్నాయి. ప్రధానంగా విద్యుత్, ఇంధన, లోహ స్టాక్స్‌లో బాగా లాభపడ్డాయి. ఈక్రమంలో సెనె్సక్స్ 82.79 పాయింట్ల ఆధిక్యతతో 0.23 శాతం లాభపడి 36,563.88 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడగా, నిఫ్టీ 31.05 పాయింట్లు (0.29 శాతం) లాభపడి 10,848.65 పాయింట్ల గరిష్ట స్థాయిలో స్థిరపడింది.

09/19/2019 - 03:12

న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు బుధవారం లీటర్‌పై 24- 25 పైసలు వంతున పెరిగాయి. గత జూలై 5న జరిగిన కేంద్ర బడ్జెట్ సమావేశాల తర్వాత తొలిసారిగా ఈ ధరలు పెరగడం గమనార్హం. సౌదీ అరేబియాలో ముడిచమురు ప్రాసెసింగ్ క్షేత్రాలపై డ్రోన్ దాడులు జరగడంతో అక్కడ ఆగిపోయిన సంగం చమురు ఉత్పత్తి ముందే ఊహించిన విధంగా మనదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపింది.

09/19/2019 - 03:52

హైదరాబాద్, సెప్టెంబర్ 18: రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్యాలకు అనుకూల వాతావరణం ఉందని అమెరికాలోని న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మర్ఫీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని పారిశ్రామిక వర్గాలతో రెండు రోజులుగా తాము సమావేశమైనట్టు ఆయన తెలిపారు. న్యూజెర్సీ రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్రం సిస్టర్ స్టేట్ పార్టనర్ షిప్ ఒప్పందాన్ని బుధవారం కుదుర్చుకుంది.

09/19/2019 - 01:07

విశాఖపట్నం, సెప్టెంబర్ 18: విద్యుత్ వాహనాల తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పష్టం చేశారు. ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన తొలి కాన్స్యులేట్ బిజినెస్ మీట్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు.

09/19/2019 - 00:43

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ-సిగరెట్ల ఉత్పత్తి, పంపిణీ, అమ్మకాలను నిషేధించింది. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీఐబీ విలేఖరుల సమావేశంలో ప్రకటించారు.

09/18/2019 - 23:38

పాతబస్తీ, సెప్టెంబర్ 18: విజయదశమి ఉత్సవాలకు భక్తులు, ప్రభుత్వం, దేవాలయాలు సిద్ధమవుతున్న తరుణంలో పలు రకాల వస్తువులు విక్రయించే వ్యాపారులు, తయారీదారులు కూడా బిజీ అయ్యారు. అయితే కొందరు నకిలీ సరుకుల తయారీ పనుల్లో మునిగిపోయారు. ముఖ్యంగా ముత్తయిదువులు, భక్తులు కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చి అమ్మవారి కుంకుమార్చనకు ఉపయోగించిన కుంకుమను ఇళ్లకు తీసుకెళ్లాలని ఎదురు చూస్తుంటారు.

Pages