S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/18/2019 - 23:03

బ్రసెల్స్‌లో జరిగిన వజ్రాల ప్రదర్శనకు హాజరైన యాంట్‌వర్ప్ వరల్డ్ డైమండ్ సెంటర్ (ఏడబ్ల్యూడీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరి ఎప్‌స్టేన్ (మధ్య), డీఆర్ కాంగో అధ్యక్షుడు ఫిలిప్స్ తిసికెడి, యాంట్‌వర్ప్ గవర్నర్ కాథీ బెర్. ఈ ప్రదర్శన వేలాది మంది వజ్రాల వ్యాపారులు, కొనుగోలుదారులను ఆకట్టుకుంది

09/18/2019 - 05:19

ముంబయి : మధ్య తూర్పు దేశాల్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ముడిచమురు ధరలు ఆకాశాన్నంటిన క్రమంలో మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ ఏకంగా 642.22 పాయింట్లు నష్టపోయింది.

09/18/2019 - 01:02

అమరావతి, సెప్టెంబర్ 17: రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్ హబ్‌గా తీర్చి దిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రితో ఫాక్స్‌కాన్ ఇండియా సంస్థ ఎండీ జోష్ ఫాల్గర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సంస్థ కార్యకలాపాలను ఫాల్గర్ వివరించారు.

09/18/2019 - 00:54

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: సౌదీ అరేబియాలోని అరమ్‌కో రిఫైనరీపై జరిగిన డ్రోన్ దాడి మూలంగా మన దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు ఐదు నుంచి ఆరు రూపాయలు పెరుగుతోంది. వచ్చే వారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలున్నాయని ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం తదితర చమురు సంస్థల అధికారులు అనధికారికంగా చెబుతున్నారు.

09/18/2019 - 01:12

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: ప్రభుత్వ రంగ సంస్థలైన ఎంఎంటీసీ, ఎస్‌టీసీ, పీఈసీలను మూసివేయడం లేదా విలీనం చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం వద్ద అన్ని రకాల ఇచ్చికాలూ ఉన్నాన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి పీయూష్ గోయెల్ మంగళవారం నాడిక్కడ తెలిపారు. ఈ మూడు సంస్థల స్థాపనకు సంబంధించిన లక్ష్యాలు క్రమంగా దెబ్బతిన్నాయని, వీటిని ఇక పునరుద్ధరించ గలిగే స్థితికూడా లేదని ఆయన స్పష్టం చేశా రు.

09/17/2019 - 23:25

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: సుమారు ఆరు కోట్ల మంది ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులు 2018-19 ఆర్ధిక సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ రేటును పొందుతారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ మంగళవారం నాడిక్కడ తెలిపారు. పండుగ రోజుల్లో ఇది ప్రభుత్వ కానుకగా భావించాలని ఆయన పేర్కొన్నారు. జాతీయ భద్రతా పురస్కారోత్సవానికి హాజరైన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు.

09/17/2019 - 05:25

ముంబయి : సౌదీ అరేబియాలోని దిగ్గజ చమురు ప్రాసెసింగ్ క్షేత్రాలపై డ్రోన్ దాడులు జరగడం మనదేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటడంతో ఆందోళనకు గురైన మదుపర్లు పెద్దయెత్తున వాటాల విక్రయాలకు పాల్పడ్డారు.

09/17/2019 - 05:23

అమరావతి, సెప్టెంబర్ 16: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వాహన రంగంలో భారీ పెట్టుబడులకు జపాన్ దిగ్గజ సంస్థ సాఫ్ట్‌బ్యాంక్ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు బ్యాంక్ ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డితో తొలివిడత చర్చలు జరిపారు. హైదరాబాద్ లేక్‌వ్యూ అతిథిగృహంలో సోమవారం బిజినెస్ అవుట్‌రీచ్ కార్యక్రమం సందర్భంగా మంత్రితో బ్యాంక్ ప్రతినిధుల బృందం భేటీ అయింది.

09/17/2019 - 04:59

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: గడచిన ఆగస్టులో టోకు విక్రయ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్యుపీఎల్) ఎలాంటి మార్పూలేకుండా 1.08 శాతంగానే ఉంది. ఈక్రమంలో వచ్చే నెలలో జరిగే రిజర్వు బ్యాంకు ద్రవ్య విధాన సమీక్షా సమావేశంలో మరోదఫా రేట్లకోతకు ఆస్కారం నెలకొంది.

09/17/2019 - 04:56

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: బంగారం ధరలు సోమవారం మళ్లీ గణనీయంగా పెరిగాయి. రూపాయి మారకం విలువ బలహీనపడటంతోబాటు ముడిచమురు ధరలు పెరగడమే ఇందుకు కారణమని విశే్లషకులు చెబుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాములు (తులం)పై రూ. 460 పెరిగిన పసిడి మొత్తం ధర రూ. 38,860కి చేరింది. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంపై మదుపుచేయడమే సురక్షితమని ఇనె్వస్టర్లు బావిస్తున్నారు. ఈక్రమంలో 24 కేరట్ల బంగారం 10 గ్రాములు రూ.

Pages