S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/25/2019 - 05:25

ముంబయి : వరుసగా రెండు రోజులపాటు లాభాల వర్షం కురిపించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల పరుగుకు మంగళవారం బ్రేక్ పడింది. మదుపర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో దశాబ్ధకాల రికార్డులు తిరగరాసిన లాభాల ర్యాలీకి విరామం ఏర్పడింది. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఉదయం నుంచే సానూకూలంగా కదలాడి ఓ దశలో 39,306.37 గరిష్ట స్థాయికి చేరింది.

09/25/2019 - 04:10

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘59 నిమిషాలకే రుణం’ పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మంగళవారం ఆయన ‘సిఐఐ’ సమావేశంలో పాల్గొన్నారు.

09/25/2019 - 03:46

ముంబయి, సెప్టెంబర్ 4: నిరర్థక ఆస్తులను (ఎన్‌పీఏలు) తక్కువగా చూపడం వంటి అనేక రెగ్యులేటరీ లొసుగులతోకూడిన పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ)పై రిజర్వు బ్యాంకు మంగళవారం ఆంక్షల కొరడా ఝళిపించింది. సుమారు ఆరు నెలల పాటు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ఆర్‌బీఐ తెలిపింది. ప్రధాన ఆంక్షల్లో వినియోదారులు కేవలం రూ. 1000కి మించి విత్‌డ్రా చేసుకునే వీలు లేదనే నిబంధన ఉంది.

09/25/2019 - 03:45

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ఉల్లి అధిక ధరలు ఇప్పటిలాగే కొనసాగితే కేంద్ర ప్రభుత్వం వ్యాపారవేత్తల ఉల్లి నిల్వలపై పరిమితిని విధిస్తుందని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ మంగళవారం నాడిక్కడ తెలిపారు. ప్రస్తుతం ఉల్లి థరల పరిస్థితిపై ప్రభుత్వం వేచిచూసే దోరణిని అవలంభిస్తోందని ఆయన తెలిపారు.

09/25/2019 - 03:43

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: బంగారం ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల బంగారంపై రూ. 330 పెరిగి మొత్తం ధర రూ.39,020కి చేరింది. రాబోయే పండుగ రోజుల దృష్ట్యా ఇలా పసిడికి డిమాండ్ నెలకొందని వాణిజ్య విశే్లషకులు భావిస్తున్నారు. అలాగే వెండి ధరలు సైతం కిలోపై ఒక దశలో రూ. 730 పెరిగి మొత్తం ధర రూ.48,720కి చేరింది. ఐతే చివరిగా రూ. 47,990 వద్ద ముగిసింది.

09/25/2019 - 03:40

ఖమ్మం, సెప్టెంబర్ 24: పట్టణాలు, మండల కేంద్రాలకు పరిమితమైన బ్యాంకింగ్ సేవలను మా రుమూల ప్రాంతాలకు విస్తరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది. ఇంతకాలం బ్యాంకు సేవల కోసం మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలు పలు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో మారుమూల గ్రామాల్లో సొంత ఊళ్లోనే బ్యాంకు సేవలు పొందే అవకాశం లభించనుంది.

09/24/2019 - 05:47

లండన్ : బ్యాంకులను మోసగించిన కేసులో చిక్కుకున్న బ్రిటన్‌కు చెందిన పర్యాటక సంస్థ థామస్‌కుక్ సోమవారం ఒక్కసారిగా మూతపడింది. దీంతోప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్ధ తో అనుసంధానమై ఉన్న సుమారు ఆరు లక్షల ‘హాలిడేమేకర్స్’ భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. రెండోప్రపంచ యుద్ధం నాటినుంచి లక్షలాదిమంది విదేశీయులను స్వదేశానికి రప్పించి ఇక్కడి అందాలను ఆస్వాదించేలా చేసిన ఈ సంస్థ ప్రస్థానం ఎట్టకేలకు ముగిసింది.

09/24/2019 - 05:27

ఆదోని, సెప్టెంబర్ 23: ఉల్లిగడ్డల ధర ఒక్కసారిగా రెట్టింపు కావడంతో వినియోగదారులు బెంబెలెత్తుతున్నారు. మార్కెట్‌లో సోమవారం కిలో ఉల్లి ధర ఏకంగా రూ.52 పలికింది. వారం రోజుల వరకు కిలో రూ.25 నుంచి రూ.30 వరకు ఉన్న ధర సోమవారం అమాంతం రెట్టింపైంది. దీంతో ఉల్లి పేరెత్తితేనే జనం ఝడుసుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్‌లో సోమవారం మేలురకం ఉల్లి ధర క్వింటాలుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు పలికింది.

09/24/2019 - 04:53

ముంబయి, సెప్టెంబర్ 23: కేంద్ర ప్రభుత్వం మాంద్యానికి మందుగా నాలుగో దఫా ఆర్థిక ఉద్దీపన చర్యల్లో భాగంగా విధించిన పన్నుల కోత దేశీయ మార్కెట్లకు అద్భుత బలాన్నిస్తోంది. గత శుక్రవారం లాభాల కుంభవృష్టిని కురిపించిన స్టాక్ మార్కెట్లలో వరుసగా రెండోరోజైన సోమవారం సైతం భారీ లాభాల ర్యాలీ చోటుచేసుకుంది. బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ ఏకంగా 1,075 పాయింట్లు ఎగబాకంది.

09/24/2019 - 04:51

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: స్టాక్ మార్కెట్లలో గత రెండు రోజుల నుంచి సాగుతున్న భారీ లాభాల ర్యాలీతో మదుపర్ల సంపద రూ.10.35 లక్షల కోట్లు పెరిగింది. ఆర్థికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని గత శుక్రవారం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పన్నుకోత చర్యలతో స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ప్రత్యేకించి శుక్రవారం దశాబ్ధకాలపు 5.32 శాతం గరిష్ట లాభాన్ని సెనె్సక్స్ నమోదు చేసింది.

Pages