S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/26/2019 - 22:47

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: స్టాక్ మార్కెట్ సూచీ సెనె్సక్స్ గురువారం దాదాపు 400 ఎగబాకడంతో మదుపర్ల సంపద రూ. 1.57 లక్షల కోట్లు పెరిగింది. బుధవారం అమెరికాలో చోటుచేసుకున్న రాజకీయ డ్రామాతో అంతర్జాతీయంగా చోటుచేసుకున్న వాటాల విక్రయాలు అమెరికా-చైనా వాణిజ్య చర్చలపై ట్రంప్ చేసిన సానుకూల వ్యాఖ్యలతో గురువారం వాటాల కొనుగోళ్లుగా మారాయి.

09/26/2019 - 06:15

న్యూఢిల్లీ : దేశాన్ని అత్యున్నత ఆర్థికాభివృద్ధి వైపు నడిపించాలన్న దృఢ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. ప్రధానంగా 8నుంచి 9 శాతం వృద్ధిరేటును సాధించి ఆ వృద్ధి స్థిరంగా ఉండేలా చూడటం మనదేశం ముందున్న ప్రధాన సవాలు అని ఆయన పేర్కొన్నారు.

09/26/2019 - 05:13

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: అందరికీ అందుబాటు ధరల్లో ఉన్న ఖాదీ వస్త్రాలపై మరింతగా విస్తృత స్థాయి ప్రచారాన్ని నిర్వహించి వాటిని ధరించడం ఓ ట్రెండ్‌లా మార్చాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి దిగ్గజ ఫ్యాషన్ డిజైనర్లు, ఉన్నతాధికారులు బుధవారం నాడిక్కడ సూచించారు.

09/26/2019 - 05:11

ముంబయి, సెప్టెంబర్ 25: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలను చవిచూశాయి. ప్రధానంగా బ్యాంకింగ్, వాహన రంగాలు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న ఆర్థిక మాంద్యం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి మదుపర్లను అయోమయానికి గురిచేశాయని వాణిజ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈక్రమంలో బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ ఇంట్రాడేలో ఏకంగా 586 పాయింట్లు కోల్పోయింది.

09/26/2019 - 05:07

ముంబయి, సెప్టెంబర్ 25: దేశంలో ఏ వాణిజ్య బ్యాంకునూ మూసివేయబోవడం లేదని రిజర్వు బ్యాంకు బుధవారం నాడిక్కడ స్పష్టం చేసింది. 9 వాణిజ్య బ్యాంకులు త్వరలో మూతపడనున్నాయని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆర్బీఐ ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ ఖండించారు.

09/26/2019 - 05:06

న్యూఢిల్లీలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఒప్పంద పత్రాలను ప్రదర్శిస్తున్న టాటా పవర్ డీడీఎల్ సీఈఓ సంజయ్ బంగా, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ డీ బసఖ్, హావెల్స్ సంస్థ ప్రెసిడెంట్ సౌరభ్ గోయల్. టాటా పవర్ డీడీఎల్, హావెల్స్ సంస్థల మధ్య సాంకేతిక పరిజ్ఞానం, సహకారంపై ఒప్పందం కుదిరింది.

09/26/2019 - 05:04

జమ్మూలో రవాణాకు సిద్ధం చేస్తున్న ఆపిల్ పండ్ల పెట్టెలు. 370 అధికరణ రద్దు కారణంగా కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న కాశ్మీర్ ఆపిల్ ఉత్పత్తి రంగం క్రమంగా మళ్లీ పుంజుకుంటోంది.

09/26/2019 - 00:56

విజయవాడ, సెప్టెంబర్ 25: రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డబుల్ డెక్కర్ ఏసీ ఎక్స్‌ప్రెస్ రైలు ‘ఉదయ్’ గురువారం పట్టాలెక్కబోతున్నది. తొమ్మిది డబుల్ డెక్కర్ కోచ్‌లతో ఈ రైలు అధికారికంగా గురువారం ఉదయం 5.45 గంటలకు విశాఖలో బయలుదేరనుంది. టిక్కెట్ ధర రూ. 535. గత రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఉదయ్ ఎట్టకేలకు పట్టాలు ఎక్కబోతున్నది.

09/25/2019 - 22:22

ముంబయి, సెప్టెంబర్ 25: విస్తారా విమానయాన సంస్థ కు అవసరమైన పరికరాలు, మరమ్మత్తుల వంటి సేవలు అందిస్తామని యూరోపియన్ విమానయాన సంస్థ తెలిపింది. ఈ మేరకు బుధవారం యూరోపియన్ విమానయాన సంస్థతో విస్తారా ఒప్పందం చేసుకున్నది. ఇది దీర్ఘకాలిక ఒప్పందం. ఇందులో ఇంజనీరింగ్, నిర్వహణకు సంబంధించి ప్రస్తుతం ఉన్న 23 విమానాలతో కలిపి మొత్తం 62 విమానాలు ఉన్నాయని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

09/25/2019 - 22:48

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: దేశంలో నైపుణ్య అభివృద్ధి పథకం కింద తోళ్ల పరిశ్రమ(లెదర్)లో 80వేల మందికి శిక్షణ ఇచ్చినట్టు ప్రభుత్వం వెల్లడించింది. శిక్షణ పొందిన వారికి వివిధ స్థాయిల్లో ఉపాధి కల్పించినట్టు లెదర్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ బుధవారం ఇక్కడ తెలిపింది. కౌన్సిల్ ఆఫ్ లెదర్ ఎక్స్‌పోర్ట్స్(సీఎల్‌ఈ) చైర్మన్ పనరునా అఖీల్ మాట్లాడుతూ 2012లో కౌన్సిల్ ఏర్పాటయిందని చెప్పారు.

Pages