S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/24/2019 - 04:48

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: దేశంలో గనుల పరిశ్రమ ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యధిక పన్ను చెల్లిస్తున్న పరిశ్రమల జాబితాలోనే ఉందని సంబంధిత పారిశ్రామికవేత్తల సంఘం ఎఫ్‌ఐఎంఐ సోమవారం నాడిక్కడ ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్రం వివిధ కార్పొరేట్ కంపెనీల పన్నుల్లో కోత విధించిన క్రమంలో ఎఫ్‌ఐఎంఐ ఆవేదన ప్రాధాన్యతను సంతరించుకుంది.

09/24/2019 - 04:48

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: అమెరికన్ సంస్థ ‘టెల్లూరియన్ ఇంక్’ నుంచి 18 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు సంబంధించిన ప్రతిపాదనను పెట్రోనెట్ ద్రవీకృత సహజవాయువు(ఎల్‌ఎన్‌జీ) బోర్డు తోసిపుచ్చింది. అలాగే డ్రిఫ్ట్‌వుడ్ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ ఏర్పాటుకు, ఏడాదికి 5 మిలియన్ టన్నుల ఎల్‌ఎన్‌జీ వంతున 40 ఏళ్ల వరకు దిగుమతి చేసుకునేందుకు సంబంధించిన ప్రతిపాదనను సైతం ఎల్‌ఎన్‌జీ బోర్డు నిరాకరించింది.

09/23/2019 - 13:19

ముంబయి:స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. కేంద్రం ప్రకటించిన ఉద్దీపన చర్యలతో మార్కెట్లు పుంజుకున్నాయి. 900 పాయింట్లకు పైగా లాభాలతో సెన్సెక్స్‌, 200 పాయింట్లు పైగా లాభాలతో నిఫ్టీ ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 పైసలు తగ్గింది. డాలర్‌తో రూ.71.04గా రూపాయి మారకం విలువ నమోదైంది.

09/23/2019 - 04:53

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లు వాయువేగ పరుగుకు ఈవారం కొంత విరామం ఏర్పడే అవకాశం ఉందని, ఊపిరి తీసుకునే వీలుందని విశే్లషకులు భావిస్తున్నారు. గత శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మాంద్యానికి మందువేసేలాప్రకటించిన మరోదఫా ఉద్దీపన చర్యలతో అటు సెనె్సక్స్, ఇటు నిఫ్టీ పదేళ్ల గరిష్ట స్థాయి ఆధిక్యతలను నమోదు చేసి లాభాల కుంభవృష్టి కురిపించిన సంగతి తెలిసిందే.

09/23/2019 - 00:46

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: వాణిజ్యానికి సంబంధించి తలెత్తిన వివాదాలు, సమస్యల పరిష్కారానికి చట్టంలో మార్పులు తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వ్యర్థాల డంపింగ్ నియంత్రణ, పటిష్ట్భద్రత (యాంటీ డంపింగ్ అండ్ సేఫ్‌గార్డ్) నిబంధనలను మార్చి మరింత పటిష్టవంతంగా అమలు చేయాలని తీర్మానించింది.

09/23/2019 - 00:42

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: దేశంలోని సుమారు 361 వౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం కారణంగా రూ. 3.77 లక్షల కోట్ల అదనపు ఆర్ధిక భారం పడిందని ఆదివారం నాడిక్కడ విడుదలైన సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. ఈప్రాజెక్టులన్నీ ఒక్కొక్కటి రూ. 150 కోట్ల తొలి ఖర్చు అంచనాలతో కూడుకున్నవని ఆ నివేదిక స్పష్టం చేసింది.

09/23/2019 - 00:42

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పన్ను కోత నిర్ణయం వల్ల స్టాక్ మార్కెట్ జాబితాలోని మరో 1000 అగ్రశ్రేణి కంపెనీలకు రూ. 37 వేల కోట్ల మేర ఆదా అవుతుంది. ఈమేరకు ఆదివారం నాడిక్కడ విడుదలైన ‘క్రెడిట్ రేటింగ్స్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా’ (క్రిసిల్) అధ్యయన నివేదిక వెల్లడించింది.

09/23/2019 - 00:40

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: దేశంలోని నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు గడచిన ఆగస్టు మాసంలో కొత్త కంబైన్డ్ ప్రీమియం వసూళ్లలో 17 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

09/22/2019 - 05:50

న్యూఢిల్లీ: కార్పొరేట్ పన్ను తగ్గింపు వల్ల ప్రభుత్వ ఆర్థిక సంకటాలు పెరుగుతాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడి, బలహీన కార్పొరేట్ సెంటిమెంట్, ఆర్థిక వ్యవస్థలో రుణ ప్రవాహం నెమ్మదించడం వంటి చక్రీయ అంశాల నుంచి ఎదురుగాలులు సమీప భవిష్యత్తులో వృద్ధికి ప్రమాదంగా పరిణమిస్తాయని మూడీస్ ఇనె్వస్టర్స్ సర్వీస్ శనివారం పేర్కొంది.

09/22/2019 - 03:30

విజయవాడ పశ్చిమ, సెప్టెంబర్ 21: ఉల్లిపాయల ధరలు ఘాటెక్కాయి. వినియోగదారుల కంటి తడి పెట్టిస్తోంది. గత నెలలో కిలో రూ.20 నుండి రూ.25 ధరకు లభించిన ఉల్లిపాయలు క్రమేణా రేటు పెరుగుతూ రైతుబజారుల్లో కిలో రూ.35కి చేరాయి. అయినా రైతుబజారుల్లో అసలు ఉల్లిపాయలే లభించడం లేదు. ఏ షాపులోనూ ఉల్లిసాయలు కన్పించకపోవడంతో వినియోగదారులు విలవిల్లాడుతున్నారు.

Pages