S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/20/2019 - 23:27

భీమిలి సమీపంలో ఫిషింగ్ హార్బర్
అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఆక్వా మార్కెటింగ్
గుజరాత్‌లోని తెలుగు మత్స్యకారులకు ఏపీలో పునరావాసం
పశు సంవర్థక, మత్స్యశాఖల సమీక్షలో ముఖ్యమంత్రి జగన్

09/20/2019 - 23:24

పనాజీ, సెప్టెంబర్ 20: కార్పొరేట్ పన్నులను భారీగా తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉదయం సంచలన నిర్ణయం తీసుకుంది. తగ్గించిన రేట్ల ప్రకారం కార్పొరేట్ పన్నులు 25.17 శాతంగా ఖాయం అవుతాయి. ఈ నిర్ణయం ద్వారా కార్పొరేట్ రంగానికి 1.45 లక్షల కోట్ల రూపాయల మేర లాభం చేకూరుతుంది.

09/20/2019 - 22:49

అమరావతి, సెప్టెంబర్ 20: ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో దక్షిణ కొరియా కాన్సులేట్ జనరల్ జంగ్ డోక్ మిన్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. స్టీల్, ఆహార ఉత్పత్తులకు సంబంధించి భేటీలో చర్చించారు.

09/20/2019 - 21:56

ముంబయి, సెప్టెంబర్ 20: వివిధ కార్పొరేట్ పన్నులు తగ్గించడం ద్వారా మరోదఫా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఉద్దీపనకు ఊతం ఇవ్వడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం వాయువేగంతో లాభాల పరుగులు పెట్టాయి. సుమారు దశాబ్ధ కాలానికిపైగా కనీవినీ ఎరుగని రీతిలో సూచీలు భారీ గరిష్టాలను నమోదు చేశాయి. చిరకాలం గుర్తుండేలా అతిపెద్ద ఇంట్రాడే లాభాల నమోదుకు ముందు ఆరంభం మాత్రం చాలా మందకొడిగా సాగింది.

09/20/2019 - 21:55

అమరావతి, సెప్టెంబర్ 20: రాష్ట్రంలో ఆటోమొబైల్, ఆహారశుద్ది రంగాలతో పాటు రొయ్యల సాగు, మామిడి ఎగుమతి రంగాల్లో సహకరించాలని దక్షిణ కొరియా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రతిపాదించారు.

09/20/2019 - 21:53

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: దేశీయ స్టాక్ మార్కెట్లలో మదుపర్ల సంపద శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 6.82 లక్షల కోట్లు పెరిగింది. కార్పొరేట్ పన్ను వెసులుమాట్లతో కేంద్రం ఆర్థిక ఉద్దీపనకు ఊతం ఇవ్వడంతో ఇంట్రాడేలో సెనె్సక్స్ 1,921.15 పాయింట్లు ఎగబాకి దశాబ్ధకాలపు గరిష్ట లాభాలను నమోదు చేయడం జరిగింది. ఈక్రమంలో బీఎస్‌ఈ జాబితాలోని కంపెనీల మార్కెట్ విలువ రూ. 6,82,938.6 కోట్ల రూపాయలు పెరిగింది. మొత్తం విలువ రూ.

09/20/2019 - 21:50

ముంబయి, సెప్టెంబర్ 20: రిజర్వు బ్యాంక్‌కు పూర్తి స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వమే రాజ్యాధికారాలు కలిగివుందని ఆ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం నాడిక్కడ పే ర్కొన్నారు. ప్రభుత్వంతో సెంట్రల్ బ్యాంకు పలుమార్లు సంప్రదింపులు జరిపి కొన్ని నిర్ణయాత్మక అంశాలపై స్వేచ్ఛాయుత, బాధ్యతాయుత చర్చలకు ఆహ్వానించినప్పటికీ ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

09/20/2019 - 21:50

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల పసిడి ధర రూ.170 తగ్గి మొత్తం ధర 38,390కి దిగివచ్చింది. రూపాయి విలువ బలపడటంతోబాటు, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన కార్పొరేట్ పన్నుల వెసులుబాటుతో మదుపర్లు స్టాక్ మార్కెట్ల వైపు మళ్లారని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే వెండి ధర సైతం కిలోపై రూ. 120 తగ్గి మొత్తం ధర రూ.

09/20/2019 - 16:41

ముంబయి: కార్పొరేట్ వర్గాలకు ఊతాన్ని ఇస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. దేశీయ కార్పొరేట్ సంస్థలకు పన్ను తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన వెలువడిన వెంటనే స్టాక్‌మార్కెట్ సూచీలు పెరిగాయి. ఒక్కరోజే సెనె్సక్స్ 2000 పాయింట్లుకు పెరుగుదల నమోదు చేసుకుంది. సెనె్సక్స్ 38 వేల 378 పాయింట్లను తాకింది.

09/20/2019 - 04:50

ముంబయి : విదేశీ మదుపర్లు వాటాలను భారీగా ఉపసంహరించుకుంటున్న తరుణంలో గురువారం ఇంధన, బ్యాంకింగ్ స్టాక్స్‌లో భారీగా వాటాల విక్రయాల వత్తిడి నెలకొంది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు పెద్దయెత్తున నష్టపోయాయి. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ తొలుత ఏకంగా 626 పాయింట్లు కోల్పోయింది. ఆ తర్వాత కొంత కోలుకుని 470.41 పాయింట్ల (1.29 శాతం) నష్టాలతో 36,093.47 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది.

Pages