S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/17/2019 - 04:55

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: తరచూ వచ్చే గుండె ల్లో మంట నివారణకు చేసే వైద్యంలో వినియోగించేలా తమ కంపెనీ తయారు చేసిన ‘లాన్సోప్రజోల్’ క్యాప్సూల్‌ను అమెరికన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్టు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సోమవారం నాడిక్కడ తెలిపింది.

09/17/2019 - 04:54

ముంబయి, సెప్టెంబర్ 16: ద్రవ్య వినిమయ విధానాన్ని సరళీకృతం చేయడంతోనే ప్రస్తుతం నెలకొన్న మాంద్యం సమసిపోదని, దీనితోబాటే ప్రభు త్వం దేశంలో డిమాండ్ పెరిగేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సోమవారం నాడిక్కడ విడుదలైన ఎస్‌బీఐ ఆర్థిక నిపుణుల నివేదిక పేర్కొంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ ఉపాధి కల్పన పథకం అమలును పటిష్టవంతం చేయాలని నివేదిక సూచించింది.

09/17/2019 - 00:01

గూడూరు, సెప్టెంబర్ 16: దేశ వ్యాప్తంగా నెల్లూరు జిల్లా గూడూరు నిమ్మ మార్కెట్‌కు ఎనలేని పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఇందులో భాగంగానే నిమ్మ ధర గత రెండు రోజులుగా నింగికెక్కి కూర్చుంది. లూజు నిమ్మ ధర రూ.16 వేలకు పెరగడంతో వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేజీ ధర రూ.200 పలుకుతుండగా, ఒక్క నిమ్మ పండు రూ.10 పలుకుతోంది.

09/16/2019 - 04:52

న్యూఢిల్లీ : ఈవారం వెలువడనున్న టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు, అంతర్జాతీయ వాణిజ్య స్థితిగతులు దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. మరోవైపు మూడోదఫా కేంద్ర ప్రభుత్వం ప్రభు త్వం ప్రకటించిన ఆర్థికాభివృద్ధి చర్యలు సైతం మార్కెట్ల సెంటిమెంటుపై సానుకూల ప్రభావం చూపే అవకాశాలున్నాయని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

09/16/2019 - 04:20

విజయవాడ, సెప్టెంబర్ 15: దేశ ఆర్థిక రంగంతో పాటు పరిశ్రమలు ముందడుగు వేసేందుకు ముఖ్యంగా సరకు రవాణాదారులకు సహాయ పడేందుకు భారతీయ రైల్వే శాఖ తాజాగా ప్రోత్సాహకాలు ప్రకటించింది. దూర, దగ్గరి మార్గాల్లో సరకు రవాణా అభివృద్ధికే కాకుండా కంటైనర్ల ద్వారా లోడింగ్‌కు కూడా ఇవి దోహదపడనున్నాయి.

09/16/2019 - 01:03

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ఈనెల తొలిపక్షంలో విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 1,841 కోట్ల విలువైన వాటాలను మనదేశీయ ప్రధాన మార్కెట్ల నుంచి కొనుగోలు చేశారు. గత రెండేళ్ల కాలంగా కేవలం ప్రధాన విక్రయదారులుగా ఉన్న ఎఫ్‌పీఐల వైఖరిలో తాజాగా మార్పు వచ్చింది.

09/16/2019 - 01:02

లెహ్, సెప్టెంబర్ 15: దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ కలిగిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దీర్ఘకాలిక గృహ రుణాల కేటాయిపుపై సందిగ్థావస్థలో ఉంది. దీనిపై రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) నుంచి స్పష్టత తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని భావిస్తోంది.

09/15/2019 - 04:22

న్యూఢిల్లీ : దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, పారిశ్రామికోత్పత్తి పునరుజ్జీవనం పొందే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే చర్యలు ప్రకటించడానికి శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ద్రవ్యోల్బణం చాలా తక్కువగా నాలుగు శాతం కన్నా దిగువన ఉందని అన్నారు.

09/15/2019 - 01:04

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ఎగుమతుల సుంకాలను తగ్గించే విషయంలో పునరాలోచ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. శనివారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఎగుమతులు, రియల్ ఎస్టేట్ తదితర రంగాలకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఉద్దీపన పథకాలను వివరించారు. 70 వేల కోట్ల రూపాయల విలువైన ప్యాకేజీని ప్రకటించారు. నిరర్ధక ఆస్తుల నిధి ఏర్పాటు కూడా జరుగుతుందని ఆమె వివరించారు.

09/14/2019 - 23:41

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత 15వ ఆర్థిక కమిషన్ నిబంధనల మార్పుపై ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హితవు పలికారు. ఏకపక్ష నిర్ణయాలు సమాఖ్య సిద్ధంతానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు.

Pages