S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/15/2015 - 04:37

విజయవాడ, డిసెంబర్ 14: ఆధ్యాత్మిక, సాంస్కృతిక, విద్య, వినోద, విజ్ఞాన, ఆహార ఫెస్టివల్స్ లాంటి 9 మెగా ఫెస్టివల్స్‌ను 9 ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాల్లో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పర్యాటక శాఖ ప్రగతిని సమీక్షిస్తూ అన్నారు. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్, సింగపూర్ ఫెస్టివల్ తరహాలో ఏటా భారీగా వేడుకలు నిర్వహించాలని సూచించారు.

12/14/2015 - 16:28

ముంబయి : స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 105 పాయింట్లు లాభపడి 25,150కి చేరింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 39 పాయింట్లు లాభపడి 7,650 వద్ద ముగిసింది.

12/14/2015 - 08:08

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యసమీక్ష, ద్రవ్యోల్బణం గణాంకాల ఆధారంగా నడుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో సూచీలు ఒడిదుడుకులకు లోనుకావచ్చన్న అభిప్రాయాన్ని కనబరిచారు. ‘ఈ వారం భారతీయ స్టాక్ మార్కెట్లను ద్రవ్యోల్బణం గణాంకాలు, అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశం శాసిస్తాయి.

12/14/2015 - 08:06

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: దేశీయ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-అక్టోబర్ వ్యవధిలో ప్రమోటర్లు, వాటాదారులకు ప్రాదాన్యతా క్రమంలో వాటాలు జారీ చేయడం ద్వారా 37,000 కోట్ల రూపాయలకుపైగా సమకూర్చుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2014-15) మొత్తంగా కేవలం 28,260 కోట్ల రూపాయలు మాత్రమే సమకూర్చుకున్నాయి.

12/14/2015 - 08:06

రాజమండ్రి, డిసెంబర్ 13: ధర గిట్టుబాటు కాకపోవటంతో ఆయిల్‌పామ్ రైతులు తమ తోటలను తామే నరుక్కునే దయనీయమైన పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తాయి. కనీస పెట్టుబడి కూడా దక్కకపోవటంతో ఆయిల్‌పామ్ సాగుకు స్వస్తిచెప్పి ఇతర పంటలవైపు రైతులు చూస్తున్నారు. గత ఏడాది మార్చిలో టన్ను ఆయిల్‌పామ్ పండ్ల ధర 8,440 రూపాయలు పలికితే, ఇపుడు 5,803 రూపాయలకు దిగజారింది.

12/14/2015 - 08:05

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. ఈ నెల మొదలు స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ఫోలియో మదుపరు (ఎఫ్‌పిఐ)లు దాదాపు 5,500 కోట్ల రూపాయల పెట్టుబడులను లాగేసుకున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్‌పర్సన్ జనెట్ యెల్లెన్ వడ్డీరేట్ల పెంపు సంకేతాలు ఇవ్వడం మదుపరులను కొనుగోళ్ళ వైపు నడిపించింది.

12/14/2015 - 08:04

విశాఖపట్నం, డిసెంబర్ 13: రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (జిసిసి) ఆధ్వర్యంలో విశాఖ ఏజెన్సీలో పాడేరు కాఫీ ప్రాజెక్టును 526 కోట్ల రూపాయలతో ప్రారంభించినట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖా మంత్రి రావెల కిశోర్‌బాబు తెలిపారు. అరకు వ్యాలీ కాఫీ పేరుతో విశాఖ ఏజెన్సీకి బ్రాండ్ తీసుకువచ్చే విధంగా రూపొందించిన కాఫీ పొడిని ఆదివారం నగరంలోని ఓ హోటల్‌లో మంత్రి విడుదల చేశారు.

12/14/2015 - 08:04

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ఈ ఏడాది దేశ, విదేశీ క్యాపిటల్ మార్కెట్ల నుంచి భారతీయ సంస్థలు 6.3 లక్షల కోట్ల రూపాయలకుపైగా నిధులను సమీకరించాయి. దేశీయ మార్కెట్ల నుంచి 5.75 లక్షల కోట్ల రూపాయలను, విదేశీ మార్కెట్ల నుంచి 58,900 కోట్ల రూపాయలను ఆయా సంస్థలు అందుకున్నాయి. ఎడిఆర్, జిడిఆర్ సెక్యూరిటీలు, విదేశీ బాండ్లు తదితర మార్గాల ద్వారా ఈ నిధులను పొందాయి.

12/14/2015 - 08:03

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్, డైవర్సిఫికేషన్, టాక్స్ ఎఫిషియన్సి, కన్వీనియన్స్ తదితర సేవలతో కూడుకున్న మ్యూచువల్ ఫండ్స్ చిన్న పెట్టుబడిదారులకు ఎంతో మంచి పెట్టుబడులని ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్స్ ఎండి, సిఇఒ నిమేశ్ షా తెలిపారు. షా ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం చెప్పారు.

12/12/2015 - 23:38

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: దేశంలో ఆటోమొబైల్ రంగం తిరిగి పుంజుకుంటోంది. గత 12 నెలలు వరుసగా పెరిగిన ప్యాసింజర్ కార్ల అమ్మకాలు నవంబర్‌లో మరో 10.39 శాతం వృద్ధి చెందాయి. గత ఏడాది నవంబర్‌లో 1,56,811 కార్ల అమ్మకాలు జరగ్గా ఈసారి అవి 1,73,111 యూనిట్లకు చేరుకున్నట్లు భారత ఆటోమొబైల్ ఉత్పత్తిదారుల సంఘం (సియామ్) తాజాగా విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Pages