S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/22/2016 - 04:19

హైదరాబాద్: దళితుల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం అనేక పథకాలు, కార్యక్రమాలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. శాసన మండలిలో 70 వ నిబంధన కింద సోమవారం సభ్యులు బాబూ రాజేంద్రప్రసాద్ తదితరులు లేవనెత్తిన అంశాలకు మంత్రి సమాధానం చెబుతూ, వచ్చే 2016-17 ఆర్థిక సంవత్సరంలో సాంఘిక సంక్షేమానికి 3,236 కోట్ల రూపాయలు కేటాయించామని గుర్తు చేశారు.

03/22/2016 - 04:17

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 20 వేల నుండి 25 వేల ఉద్యోగాల భర్తీని చేపట్టాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ఉపాధి కల్పన, కార్మిక మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. శాసనమండలిలో సోమవారం 311 నిబంధన కింద ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన నోటీసుకు మంత్రి సమాధానం చెబుతూ, రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం అనేక సమస్యలను ఎదుర్కొంటోందన్నారు.

03/22/2016 - 04:16

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయం ఒకే ఒక ప్రశ్నతో ముగిసింది. సాధారణంగా రోజూ పది ప్రశ్నలను చేపడతారు. మండలి సమావేశం కాగానే చైర్మన్ ఎ చక్రపాణి అజెండా ప్రకారం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రశ్నలు వేసిన నలుగురు సభ్యులు, సమాధానం ఇవ్వాల్సిన ఐదుగురు మంత్రులు సభకు హాజరు కాకపోవడంతో తొమ్మిది ప్రశ్నలను వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు.

03/22/2016 - 04:14

హైదరాబాద్: హైదరాబాద్‌లో సరళ్ రోజ్‌గార్ పథకంలో భాగంగా సోమవారం టెక్ మహీంద్ర మెగా జాబ్ ఫెయిర్ నిర్వహించింది. ఈ మెగా జాబ్ ఫెయిర్‌లో ఆటోమోటివ్, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, ఎఫ్‌ఎంసిడి రంగాల నుంచి 15 సంస్థలు పాల్గొన్నాయి. వీటిలో ఉద్యోగాల కోసం సుమారు 300 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

03/22/2016 - 04:12

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రాబోయే ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు మార్కెట్ వ్యాప్తంగా విస్తరించడంతో సూచీలు లాభాల్లో కదలాడాయి.

03/22/2016 - 03:59

న్యూఢిల్లీ: కీలక వడ్డీరేట్లను తగ్గించాలంటూ వస్తున్న డిమాండ్లను రాబోయే ద్రవ్యసమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) పరిశీలించే అవకాశాలున్నాయని, దీంతో రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లు పావు శాతం చొప్పున దిగివచ్చే వీలుందని డ్యూషే బ్యాంక్ సోమవారం ఓ నివేదికలో అంచనా వేసింది.

03/22/2016 - 03:59

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలను నిల్వచేసి, వాటిని తగిన ధర లభించినప్పుడు అమ్ముకునేలా రూ. 1,024 కోట్ల వ్యయంతో 335 గోడౌన్లను నిర్మించనున్నట్టు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

03/21/2016 - 06:00

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ప్రధానంగా విదేశీ పెట్టుబడులపై ఆధారపడి నడుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్ష ప్రభావం కూడా ట్రేడింగ్‌పై కనిపిస్తుందని పేర్కొంటున్నారు.

03/21/2016 - 05:57

అనంతపురం: అనంతపురం జిల్లా నుంచి పరిశ్రమ లు తరలిపోతున్నాయ. కరవు జిల్లా.. నాలుగు పరిశ్రమలు వస్తే జనానికి ఉపాధి దొరుకుతుందనుకుంటే శ్రుతి మించుతున్న రాజకీయ జోక్యం దాన్ని కాస్తా దూరం చేస్తోంది. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు అండగా నిలవాల్సిన కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులే అడ్డం పడుతున్నారు. వాటాలు, మామూళ్ల కోసం తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తూ, బెదిరింపులకు దిగుతున్నారు.

03/21/2016 - 05:56

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఈ నెలకుముందు పెట్టుబడు ల ఉపసంహరణల ధ్యాసతోనే నడిచిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) గత మూడు వారాల్లో మాత్రం షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి కనబరిచారు. ఈ నెల ట్రేడింగ్ జరిగిన పదమూడు రోజుల్లో 11,000 కోట్ల రూపాయల కుపైగా పెట్టుబడులను పట్టుకొచ్చారు.

Pages