S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/21/2016 - 05:56

న్యూఢిల్లీ: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా వ్యవహారంపై విచారణను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మరింత లోతుగా జరుపుతోంది. మాల్యా నేతృత్వంలోని యునైటెడ్ బ్రూవరీస్ (యుబి) గ్రూప్ లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇన్‌సైడర్ ట్రేడింగ్, కార్పొరేట్ గవర్నెన్స్ తదితర అంశాలను దగ్గరగా గమనిస్తోంది.

03/21/2016 - 05:55

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ-వేలంలో దభోల్, జిఎమ్‌ఆర్, ల్యాంకో తదితర తొమ్మిది పవర్ ప్లాంట్లు ఆదివారం విజయవంతంగా 7.62 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎమ్‌ఎమ్‌ఎస్‌సిఎమ్‌డి) రీగ్యాసిఫైడ్ లిక్విడ్ నాచురల్ గ్యాస్ (ఆర్-ఎల్‌ఎన్‌జి)ను గెలుచుకున్నాయి. ఈ గ్యాస్‌తో ఈ తొమ్మిది ప్లాంట్లు ఈ ఏడాది సెప్టెంబర్ వరకు మొత్తం 6.79 బిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేయనున్నాయి.

03/20/2016 - 07:21

న్యూఢిల్లీ, మార్చి 19: తెలంగాణ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ (టిఎస్‌పిడిసి)కు విద్యుత్ సరఫరా కోసం టాటా పవర్ ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్ (టిపిటిసిఎల్)తో నవ భారత్ వెంచర్స్ ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు శనివారం బిఎస్‌ఇకి నవ భారత్ వెంచర్స్ తెలిపింది.

03/20/2016 - 07:20

ముంబయి, మార్చి 19: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో వారం లాభాల్లో ముగిశాయి. రెండు నెలల గరిష్ఠ స్థాయి వద్ద సూచీలు నిలిచాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ గడచిన వారం నిర్వహించిన ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచుతూ నిర్ణయం తీసుకోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. ప్రపంచ వృద్ధిరేటు అంచనాల కంటే దిగువన పయనిస్తుండటంతో వడ్డీరేట్ల పెంపు జోలికి వెళ్ళకూడదని భావించిన ఫెడ్ రిజర్వ్..

03/20/2016 - 07:18

హైదరాబాద్, మార్చి 19: రుణాల ఎగవేత కేసులను ఎదుర్కొంటున్న విజయ్ మాల్యాకు ఆ సమస్యల పరిష్కారానికి ఒక్క అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్ షా అభిప్రాయపడ్డారు. అలాగే మీడియా ఈ వ్యవహారంపై అత్యుత్సాహం ప్రదర్శించడం తగదని, దీనికది పరిష్కారం కాబోదన్నారు.

03/20/2016 - 07:16

ఒంగోలు, మార్చి 19: రొయ్యల సాగు ప్రస్తుత వేసవి కాలంలో గణనీయంగా తగ్గుముఖం పట్టనుంది. వర్షాకాలంలో సాగుచేసిన రొయ్యల పంటను మూడు వంతుల రైతులు తీసేయగా, మిగతా రైతులు సైతం చెరువుల్లోని రొయ్యలను అమ్మి సొమ్ము చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నిజానికి గత సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో పంటను సొమ్ము చేసుకున్న రైతులు.. వేసవికాలం సాగు వైపు మొగ్గుచూపారు.

03/20/2016 - 07:15

అహ్మదాబాద్, మార్చి 19: ద్రవ్యోల్బణం ఆధారంగా పొదుపు వడ్డీరేట్లుండాలని ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య అన్నారు. శుక్రవారం చిన్న మొత్తాల పొదుపు పథకాలైన పిపిఎఫ్, కిసాన్ వికాస్ పత్ర వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం తగ్గించినది తెలిసిందే. ఈ క్రమంలో ‘సేవింగ్స్ రేటు 9 శాతంగా, ద్రవ్యోల్బణం రేటు 11 శాతంగా ఉంటే పొదుపుదారులకు మిగిలేది ఏమీ ఉండదు.

03/20/2016 - 07:14

న్యూఢిల్లీ, మార్చి 19: సెక్యూరిటైజేషన్ ఒప్పందం ద్వారా హైదరాబాద్‌కు చెందిన ఎస్‌కెఎస్ మైక్రోఫైనాన్స్ 538.11 కోట్ల రూపాయల నిధులను సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో ఈ తరహా లావాదేవీ ఇది ఏడోది కావడం గమనార్హం. శనివారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు ఎస్‌కెఎస్ మైక్రోఫైనాన్స్ తెలిపిన వివరాల ప్రకారం మొత్తం ఈ ఏడు లావాదేవీల్లో 2,319.93 కోట్ల రూపాయల నిధులను సమీకరించింది.

03/19/2016 - 04:06

న్యూఢిల్లీ, మార్చి 18: దేశంలో 2020 నాటికి స్టార్టప్‌లలో దాదాపు 665 కోట్ల రూపాయల (100 మిలియన్ డాలర్లు)ను పెట్టుబడిగా పెట్టనున్నట్లు అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం సిస్కో తెలిపింది. 2.5 లక్షల మంది విద్యార్థులకూ శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పింది. శుక్రవారం సిస్కో చైర్మన్ జాన్ చాంబర్స్ ఇక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

03/19/2016 - 04:02

న్యూఢిల్లీ: మున్ముందు మరిన్ని ఆర్థిక సంస్కరణలను అమల్లోకి తెస్తామని స్పష్టం చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ.. భారత్‌ను ‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’గా ప్రపంచం ఎంతోకాలం పరిహసించలేకపోయిందని గుర్తుచేశారు. శుక్రవారం ఇక్కడ జరిగిన 43వ స్కాచ్ సమ్మిట్‌లో జైట్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘స్వాతంత్య్రం వచ్చిన దాదాపు 40 ఏళ్ల వరకు భారత్ వృద్ధిరేటు సుమారు 2-2.5 శాతం వద్ద ఉంది.

Pages