S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/19/2016 - 08:12

బెంగళూరు, మే 18: మొన్నటికిమొన్న ‘ఫ్రీడమ్ 251’ పేరుతో ఓ సంస్థ కేవలం 251 రూపాయలకే ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేస్తామని హంగామా చేసినది తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో సంస్థ ఏకంగా 99 రూపాయలకే స్మార్ట్ఫోన్ అందిస్తామని ముందుకొచ్చింది. బెంగళూరుకు చెందిన నమోటెల్.. ‘నమోటెల్ అచ్ఛే దిన్’ పేరిట 99 రూపాయలకే స్మార్ట్ఫోన్‌ను విక్రయిస్తామని తెలిపింది.

05/19/2016 - 08:11

హైదరాబాద్, మే 18: ఇన్సూరెన్స్ డాటా ఎనలిటిక్స్, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌పై అంతర్జాతీయ సదస్సును ఈ నెల 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఐఆర్‌డిఎ చైర్మన్ టిఎస్ విజయన్ తెలిపారు. బీమా కంపెనీల రేట్ మేకింగ్, బీమా విశే్లషణలు, బీమాలో ఆర్థిక సమ్మిళితం, జీవిత బీమా విశే్లషణలు, విపత్తు నిర్వహణ, ఫైనాన్సింగ్‌పై ఈ సదస్సులో చర్చిస్తారు.

05/19/2016 - 08:10

ముంబయి, మే 18: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. గత రెండు రోజుల లాభాలకు బ్రేక్ వేస్తూ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 69 పాయింట్లు పడిపోయి 25,704.61 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 20.60 పాయింట్లు దిగజారి 7,870.15 వద్ద నిలిచింది. మారుతి, మహీంద్ర, రెనాల్ట్, హ్యుందాయ్ సంస్థలకు చెందిన పలు మోడళ్ల కార్లు..

05/18/2016 - 00:43

హైదరాబాద్, మే 17: గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సంస్థ ఈ నెల 19 (గురువారం)న హైదరాబాద్‌లో ఓ డెవలప్ సెంటర్‌ను ప్రారంభించనుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి, రాష్ట్ర ఐటి శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ మంగళవారం ఇక్కడ చెప్పారు. అయితే ఈ వారం యాపిల్ సిఇఒ టిమ్ కుక్ భారత్‌లో పర్యటించనుండగా, ఆయన ఈ సెంటర్ ప్రారంభోత్సవానికి వస్తారా? లేదా? అన్నది ఇంకా తెలియదన్నారు.

05/18/2016 - 00:40

న్యూఢిల్లీ, మే 17: దేశీయ ప్రైవేట్‌రంగ విమానయాన సంస్థ స్పైస్‌జెట్.. దేశ, విదేశీ విమానయాన ప్రయాణీకుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. సంస్థ విమానయాన సేవలు ప్రారంభమై 11 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పరిమిత వ్యవధికిగాను దేశీయంగా 511 రూపాయల కనిష్ట ధర టిక్కెట్ (పన్నులు, ఇతరత్రా ఫీజులు అదనం)ను ప్రకటించింది.

05/18/2016 - 00:38

ముంబయి, మే 17: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా లాభాల్లోనే ముగిశాయి. సోమవారం లాభాలు అందుకున్న నేపథ్యంలో అసోం అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా బిజెపి అధికారంలోకి వస్తుందన్న అంచనాలు.. ఆ లాభాలను కొనసాగేలా చేశాయి. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 120.38 పాయింట్లు పుంజుకుని 25,773.61 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 7,890.75 వద్ద నిలిచింది.

05/18/2016 - 00:38

న్యూఢిల్లీ, మే 17: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ సిండికేట్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో ఏకంగా 2,158.17 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. బ్యాంక్ మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ), అగంతుక రుణాలు 2,411.83 కోట్ల రూపాయలకు చేరుకోవడమే కారణం.

05/18/2016 - 00:37

రావులపాలెం, మే 17: పక్క భవనాలకు ముప్పు లేకుండా భవనాలు కూల్చడం గురించి ఇంతవరకు విన్నాం. అయితే తక్కువ ఎత్తులో ఉన్న భవనాన్ని పునాదుల వద్ద ప్రత్యేక విధానం ద్వారా లేపుతూ మొత్తం భవనం ఎత్తు పెంచే ప్రక్రియ తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం రావులపాడులో విజయవంతంగా చేపట్టారు. ఈ విధానంలో భవనంలో ఉన్న ఫర్నిచర్ తదితరాలు చెక్కు చెదరకుండా ఉండటం మరో విశేషం. వివరాల్లోకి వెళ్తే..

05/18/2016 - 00:35

పాట్నా, మే 17: ప్రస్తుతం అమల్లో ఉన్న వినియోగదారుల రక్షణ చట్టం-1986 స్థానం లో కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

05/18/2016 - 00:35

న్యూఢిల్లీ, మే 17: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 22-23 తేదీల్లో ఇరాన్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు ఆర్థిక అంశాలపై ఆయన ఆ దేశంతో చర్చించనున్నారు. మళ్లీ ఇరాన్ నుంచి చమురు దిగుమతులను రెట్టింపు చేసుకోవాలని భారత్ చూస్తున్న నేపథ్యంలో మోదీ పర్యటనలో ఆ దిశగా సంప్రదింపులు జరిగే వీలుంది.

Pages