S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

09/11/2018 - 00:04

‘నేను నోరు విప్పానంటే వందలాది మంది జైలుకు పోతారు’.. ఈ మాట అన్నది సాదాసీదా వ్యక్తి కాదు.. సాక్షాత్తూ భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఈయన స్వస్థలం గుంటూరు జిల్లా. ఉత్తరప్రదేశ్ కోటాలో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎన్‌డీఏ కూటమి నుంచి, మోదీ మంత్రివర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నిష్క్రమించింది. దీంతో ఇప్పుడు భాజపాకు, తెదేపాకు సయోధ్య చెడింది. ఇరు పార్టీల మధ్య హోరాహోరీగా సమరం సాగుతోంది.

09/09/2018 - 00:05

మన దేశంలో కశ్మీర్ తర్వాత అంతటి అందమైన ప్రదేశం కేరళ. ఇక్కడి సరస్సులు, కొబ్బరి తోటలు, మలయ మారుతాలు, సుగంధ ద్ర వ్యాల ఘుమఘుమలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఒకప్పుడు కేరళ ప్రాంతాన్ని తిరువాన్కూరు సంస్థానం అని పిలిచేవారు. 1947 ప్రాంతంలో కేరళలో ఆర్‌ఎస్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీలు ప్రవేశించాయి. ‘దునే్నవాడిదే భూమి-్ధనవంతుల దౌర్జన్యాలు నశించాలి’ వంటి నినాదాలతో కమ్యూనిజం వేళ్లూనుకుంది.

09/08/2018 - 00:09

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఎన్నికలలో గెలుపొందడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. భాజపాపై ఒకే అభ్యర్థిని నిల బెట్టడం ద్వారా తేలికగా మోదీని ఓడించవచ్చని ఉత్తర ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఉపఎన్నికల అనంతరం విపక్షాలు ధీమాగా ఉన్నా, అందుకు చేయవలసిన కస రత్తు తగు రీతిలో చేయడం లేదు.

09/06/2018 - 00:10

ఎన్నికల్లో ఓడిపోతే ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల (ఈవీఎం)ను తారుమారు చేశారనడం, గెలిస్తే ప్రజలు తమపై విశ్వాసంతో గెలిపించారనడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడచినా, సమాచార సాంకేతిక రంగంలో దేశం ముందుకు దూసుకెళుతున్నా, మన రాజకీయ పార్టీలు ఇంకా ‘కూపస్థ మండూకాల్లా’ ఆలోచిస్తున్నాయి.

09/05/2018 - 02:52

గాసిప్..గాసిప్.. ఎక్కడ విన్నా, చూసినా అదే గా సిప్.. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయన్న గాసిప్. కొన్ని పత్రికలైతే శాసనసభ రద్దుకు, ముందస్తు ఎన్నికలకు ముహూర్తం, తేదీలు కూడా ఖారారు చేసాయి.

09/04/2018 - 00:59

దేశ రక్షణ విషయాలపైనా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అదేపనిగా రచ్చ చేస్తున్నారు. బోఫోర్స్ కుంభకోణంలో కాంగ్రెస్‌పై మచ్చపడిన విషయం గతం. ఆ స్మృతులు కాంగ్రెస్‌ను నేటికీ వెంటాడుతున్నాయి. దేశ సరిహద్దుల్లో ఎండనక, వాననక, కుటుంబాలకు దూరంగా కాపలాకాస్తున్న జవాన్లకు అందించే శతఘు్నల కొనుగోలులోను కుంభకోణం చేసిన కృతఘు్నలు కాంగ్రెస్ నేతలు.

09/02/2018 - 00:17

రేపటి గురించి ఈరోజు ఆలోచించేవాడే అసలైన నాయకుడు. ఎప్పటికప్పుడు భవిష్యత్ సవాళ్లకు అనుగుణంగా తన శ్రేణుల్ని సమాయత్తం చేస్తూ, ప్రత్యర్థుల్ని చిత్తు చేయడంలో ఓ ఆకు ఎక్కువ చదివినవాడే అధినాయకుడు. తెలంగాణ ఉద్యమనేతగా, కొత్త రాష్ట్రానికి తొలి పాలకుడిగా తనకు తానే సాటి అనిపించుకున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆరితేరిన వ్యూహకర్త. లక్ష్యం ఉంటే నిర్దిష్టమైన మార్గం ఉంటుంది.

09/01/2018 - 00:28

‘ఏం అవ్వా.. బాగున్నావా..?’
‘హా.. బాగున్న..’
‘నీకు ఫించన్ వస్తుందా..?’
‘వస్తుంది.. ఇస్తురు.. దండం పెడుతా..’
‘నీకు ఎంతమంది కొడుకులు..?’
‘నాకు ఒక్క కొడుకమ్మా.. ఆడికి ముగ్గురు బిడ్డలు, ఒక బిడ్డ పెళ్లి చేసిండు.. ఇంక ఇద్దరు బిడ్డల పెండ్లిలు చేయాలె.. కేసీఆర్ కడుపు సల్లంగ ఉండాల.. నా మనుమరాలి పెండ్లికి లక్ష

08/30/2018 - 00:11

పేదలకు అందుబాటులోకి రాని విధానాలు ఎన్ని ప్రవేశపెట్టినా, ఆ సమాజం లేదా దేశం విప్లవాత్మకమైన అభివృద్ధి సాధించినట్లు కాదు. పేదలకు మేలు జరగనంత వరకూ మనం సాధించినంతా బూడిదలో పోసిన పన్నీరే’-అనే సత్యాన్ని అమెరికాకు చెందిన ఒక సాధారణ టీచర్, ఫొటో స్టూడియో ఆర్టిస్టు జానథన్ హెర్రారె చాటి చెబుతుంటారు. భారత్ విషయంలో పై వ్యాఖ్య అతికినట్లు సరిపోతుంది.

08/29/2018 - 00:16

దేశవ్యాప్తంగా ఇపుడు ఒకటే చర్చ.. లోక్‌సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతా యా? విడివిడిగా నిర్వహిస్తారా? అనే రచ్చ ఎక్కువైంది. అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి (జమిలి) ఎన్నికలు జరిగితే లాభనష్టాలెలా ఉంటాయన్న అంశంపై రాజకీయ పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి. ‘లాభపడే’ పార్టీలు ‘జమిలి ఎన్నికలు’ జరగాలని కోరుతుండగా, నష్టపోతామని భావిస్తున్న పార్టీలు అసెంబ్లీలకు విడిగా ఎన్నికలు జరగాలని కోరుతున్నాయి.

Pages