S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిట్ పేజీ

12/21/2015 - 05:01

బడుగులకు రాజ్యం, బిసిలకు రాజ్యాధికారం, ఎస్సీలకు రాజ్యాధికారం అనే మాటలు చిరకాలంగా వినవస్తున్నాయి. ఇటీవలి దశాబ్దకాలంలో ఇంకా ఎక్కువగా. ఇది మంచిదే. అందులో తగినంత అర్ధం ఉంది. కాని ఈ వర్గాలకు రాజ్యాధికారం లభించేలోగా మరేమైనా కూడా కావాలా, లేక ఏదీ అక్కరలేదా?

12/20/2015 - 03:39

ఒకటి కాదు, రెండు కాదు- ప్రకృతి విపత్తుకు గురికాని నగరం లేదు. గురైతే సహాయక చర్యలు కూడా చేపట్టలేని పరిస్థితి చేపట్టినా ఆర్థులందరికి సహాయమందించని స్థితి? ఏ విపత్తూ మనకు గుణపాఠం నేర్పదు. నేర్పినా ఆచరించడం మనకు అసలే గిట్టదు. ఈ విపత్తుల్ని కూడా సహాయక చర్యల పేరున, సహకారం పేరున నిధుల్ని రాబట్టడం, సేకరించడం సొమ్ముచేసుకోవడం జరుగుతున్నది.

12/19/2015 - 00:01

చెన్నై తరహా వరదల ప్రమాదం ప్రతిపాదిత రాజధాని అమరావతికి సంభవిస్తే? ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. అనూహ్యమైన వర్షపాతంతో ఇటీవల చెన్నై మహానగరమంతా ఒక పెద్ద సాగరంలా మారిపోయింది. ఏది ఊరో, ఏది ఏరో తెలియనంతగా సముద్రం విస్తరించినట్టుగా మారిపోయింది. కొన్ని లక్షలమంది వారం రోజులుపైగా విలవిల్లాడిపోయారు. అది ఎవరూ ఊహించని ప్రకృతి విలయం.

12/17/2015 - 23:49

బిహార్ ఎన్నికలు ముగిసాయి. అవార్డు వాపసీ ప్రహసనం ముగిసింది. రాహుల్‌గాంధీ హుషారుగా ఉన్నా రు. కాంగ్రెస్ బలం 4నుంచి 24 వరకు బిహార్ అసెంబ్లీలో పెరిగింది. ప్రజాస్వామ్యం గెలిచిందన్నారంతా. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లను నాశనం చేస్తానని (ఉత్తర) ప్రగల్భాలు పలికాడు రాహుల్. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. మళ్లీ కాంగ్రస్ రగడ ప్రారంభించింది.

12/16/2015 - 06:49

హిందూ మతాన్ని నాశనం చెయ్యడానికి రెండు వర్గాలు పోటీపడుతున్నాయి. ఒకరు కుటుంబ నియంత్రణ అవసరం లేదనీ, ఎందరినైనా కని తమ మతాన్ని వ్యాప్తిచేయమని చెబుతుండగా, మరి ఇంకో మతం ప్రలోభాలకు గురిచేస్తూ మా మతానికి రండి.. ఫీజులు కట్టనవసరం లేదు. డబ్బులు ఇస్తాం. ఉపాధి కల్పిస్తాం. పాపాలన్నీ క్షమింపజేస్తాం అంటూ ఎన్నికల పోటీలాగా ప్రచారం చేస్తున్నది. హిందూ ధార్మిక సంస్థలు మాత్రం ఏమీ పట్టనట్టు ఉన్నాయి.

12/16/2015 - 06:43

ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలు దుందుడుకు నిరంకుశ పాలనలను, ఉగ్రవాద సైన్యాన్ని ఎదుర్కోవలసి ఉంది. అయితే కొంతకాలంగా ఈ అంశంలో ప్రజాస్వామ్య దేశాలు వెనుకడుగు వేస్తున్నాయనే అభిప్రాయం కలుగుతున్నది. ప్రపంచంలో ప్రజాస్వామ్య వికాసానికి విశేషంగా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఫ్రీడంహౌస్ ప్రతి సంవత్సరం ప్రకటించే ‘ప్రపంచంలో స్వాతంత్ర వార్షిక నివేదిక’ ప్రజాస్వామ్య దేశాల అంకిత భావానికి ప్రతీక.

12/15/2015 - 02:58

భారతదేశంలో అనాదిగా మనం సహనాబవతు అనే మంత్రం పఠిస్తున్నాము. ఐనా మనకు సహనం లేదని విదేశీ మానసపుత్రులు ఆరోపిస్తున్నారు. సహనం సమన్వయం భారతీయతాత్విక చింతనకు మూలస్తంభాలు. వాటిని ఆధునికంగా ఆవ్కిరించిన కర్మయోగి ఋషి పండిత దీనదయాల్ ఉపాధ్యాయ భారతీయ జనసంఘ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత వారు పార్టీ అధ్యక్షులైనారు. జనసంఘ్ పార్టీ తర్వాతికాలంలో జనతా పార్టీలో విలీనమైంది.

12/14/2015 - 05:49

భారతదేశం వలెనే ఆఫ్రికా ఖండం కూడా సుదీర్ఘకాలంపాటు యూరోపియన్ వలస పాలనకు, దోపిడీకి గురైంది. భారతీయులవలెనే ఆఫ్రికన్లు కూడా అనేక త్యాగాలతో మహత్తర పోరాటాలు జరిపి స్వాతంత్య్రం సాధించుకున్నారు. ఆ విధంగా ఉభయుల మధ్య గొప్ప అవగాహనలు, సంఘీభావాలు ఉండాలి. తమ భవిష్యత్తును నిర్మించుకునేందుకు సాగుతున్న కృషిలో ఇరువురి మధ్య గణనీయమైన సహకారం కన్పించాలి.

12/13/2015 - 04:18

‘నేను వాష్‌రూంలో వుండి మీ ఫోన్‌కాల్‌ను అందుకోలేదు. చెప్పండి సార్! ఏం కావాలి...?’ అంటూ ఓ చత్తీస్‌గఢ్ మంత్రివర్యునికి ప్రస్తుతం బలరాంపుర కలెక్టర్‌గావున్న పాల్ ఎలెక్స్ మీనన్ సంజాయిషిగా మాట్లాడిన మాటలివి.

12/12/2015 - 04:50

రాజ్‌దీప్ సర్దేశాయి లాగా కాకుండా, రాహుల్ కన్వాల్ అనే ‘ఇండియా టుడే’ ఆంగ్ల ఛానల్ మేనేజింగ్ ఎడిటర్ కొంత నిజాయితీగా అభిప్రాయాల్ని చెపుతుంటాడు. ఇద్దరూ ‘ఇండియా టుడే’ ఛానల్‌లోనే పనిచేస్తున్నా, రాజ్‌దీప్ సర్దేశాయి హిందూ జాతీయవాదాన్ని విమర్శించేందుకే జర్నలిస్టు రంగంలో పనిచేస్తున్నట్టు మనకు స్పష్టవౌతున్నది. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను అందమైన ఆంగ్ల భాషలో ఎగతాళి చేయడమంటే ఆయనకు ఇష్టం.

Pages