S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

10/25/2017 - 21:34

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్‌పై ప్రభుత్వ పెద్దలు విమర్శలు గుప్పించడం సరికాదు. కొన్ని నిర్ణయాలు, నూతన ప్రభుత్వ విధానాలను తప్పుబట్టినంత మాత్రాన, ఆయన అనుసరిస్తున్న విధానాలు నచ్చనంత మాత్రాన కోదండరామ్‌ను తక్కువ చేసి మాట్లాడటం, నిందలు మోపడం సరికాదు. ఈ విషయంలో సిఎం కెసిఆర్, ఆయన అనుచర గణం చేస్తున్నది తప్పు.

10/25/2017 - 21:34

రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని అధికార గణానికి ప్రాథమిక హక్కుగా గుర్తించినట్లుంది. ఆ మేరకు హక్కుకు భంగం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని భావించినట్లుంది. ఇంతవరకూ ఆర్డినెన్స్ రూపంలో ఉండి, ఇప్పుడు రాజస్థాన్ శాసనసభలో బిల్లుగా ప్రవేశపెట్టబడిన చట్టం తీరుతెన్నులు చూస్తే కరడుగట్టిన నియంతలైనా ఆ బరితెగింపునకు విస్తుపోతారు.

10/24/2017 - 23:08

తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లాలోని పలు ఆర్టీసి బస్టాండ్లు అపరిశుభ్రతతో ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణికులు వేచి ఉండవలసిన ప్రాంగణాలు సరిగ్గా లేవు. ఎక్కడపడితే అక్కడ చెత్త ఉన్నా తొలగించడం లేదు. ప్రయాణికుల వైఖరి కూడా ఇందుకు కారణం. మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచాల్సి ఉంటుంది. ప్రాంగణాలలో ఎక్కడపడితే అక్కడ మూత్ర విసర్జన చేయడంతో దుర్గంధంవల్ల అసౌకర్యంగా ఉంటోంది.

10/24/2017 - 01:05

తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘ఆసరా’ పథకం చాలామంది పేదలను ఆదుకుంటున్నది. అయితే ఈ పథకం పరిధిలోకి కేన్సర్ బాధితులను కూడా చేర్చాలి. ఖరీదైన వైద్యం చేయించుకోలేని పేదలకు ఈ పథకం కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. మారిన జీవనశైలి, వంశపారంపర్య, జన్యు కారణాల వల్ల, స్వీయతప్పిదాల వల్ల కేన్సర్ బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

10/23/2017 - 00:34

పాకిస్తాన్ ఎప్పటికప్పుడు ఉగ్రవాదులకు తనెంత సానుకూలమో తెలియజేస్తోంది. తాజాగా జగమెరిగిన ఉగ్రవాది హఫీజ్ సరుూద్‌ని జైలు జీవితం నుంచి విముక్తి కలిగించడం ద్వారా ఆ విషయాన్ని మరోసారి ప్రపంచానికి ధ్రువపర్చింది. సరుూద్ మామూలు నేరస్తుడు కాదు. కరడుగట్టిన తీవ్రవాది. ముంబైలో ఉగ్రవాద దాడితో సహా పలు తీవ్రవాద చర్యలకు సూత్రధారి. అన్ని సాక్ష్యాలతో భారత్ ఈ విషయాన్ని బయటపెట్టింది.

10/20/2017 - 23:07

మన దేశానికి ఇప్పుడు బుల్లెట్ రైళ్లు అవసరమేమిటని సణుగుడు ప్రారంభం అయింది. స్వాతంత్య్రం వచ్చిన తొలి సంవత్సరాల్లో సైన్యంపై ఖర్చుని విమర్శించారు. నెహ్రూ దృక్పథమూ అదే. చైనా మనమీద యుద్ధానికి వచ్చినపుడు మన సైనికులకు సరైన బూట్లు కూడా లేవు. తగినంతగా ఆయుధాలు, మందుగుండు లేవు. ఓటమి, చైనా మోసం తట్టుకోలేక నెహ్రూ కన్నుమూశారు. ఉపగ్రహ ప్రయోగాలు ఎందుకని కొందరు విమర్శించారు.

10/18/2017 - 21:19

ఒక సామాజిక వర్గాన్ని కించపరుస్తూ, వారిని స్మగ్లర్లుగా చిత్రిస్తూ రచనలను ప్రచురించిన కంచ ఐలయ్య పోలీసుల రక్షణ కోరడం హాస్యాస్పదం. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో మరోవర్గంపై అవాకులుచవాకులు రాయడం సరికాదు. సాధారణ ప్రజానీకానికి భద్రత కల్పించేందుకే తగినంత మంది పోలీసులు లేరు. ఇలా ఉద్దేశపూర్వకంగా వివాదాలు రేపేవారికి రక్షణ కల్పించాల్సిన అవసరం పోలీసులకు ఏముంది?

10/18/2017 - 21:19

పార్లమెంటు ప్రాంగణంలో విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్న డిమాండ్ ఇప్పటిది కాదు. 2006లో అప్పటి ఎంపి దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు ఎన్టీఆర్, అల్లూరిల విగ్రహాలను పార్లమెంటు ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని సభలో ప్రస్తావించడం, కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించడం తెలిసిందే. ఆ తరువాతి పరిణామాల్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారుగాని, మన్యం వీరుడిని మరిచిపోయారు.

10/18/2017 - 00:18

కేంద్రప్రభుత్వ ఉద్యోగులకన్నా ఎక్కువగా జీతాలు ఇస్తామని, కానీ ఓపికపట్టాలని దసరా సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం, ఉద్యోగ సంఘాలు తమ కోర్కెల చిట్టా విప్పడం చూశాము. నిజానికి కొత్తరాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉంది. ఉద్యోగులకు జీతాలు పెంచడం తప్పుకాదు. కానీ అమాంతం, భారీ మొత్తంలో పెంచాల్సిన అవసరమేమిటి?

10/17/2017 - 00:04

రాష్టవ్య్రాప్తంగా అవినీతి అధికారులపై ఆకస్మిక దాడులు జరిపి భారీగా అవినీతి సొమ్మును పట్టుకుంటున్న ఎసిబి అధికారుల చర్యలు సమంజసం. ఎవరి ఒత్తిడికీ లొంగకుండా ఇటీవలి కాలంలో పెద్దపెద్ద అవినీతి తిమింగలాలను ఉభయ తెలుగు రాష్ట్రాలలో పట్టుకోవడం మేలైన పరిణామం. ఎసిబి అధికారులు చిత్తశుద్ధితో ఇలాగే వ్యవహరిస్తే అవినీతికి అలవాటుపడిన అధికారుల్లో కొంతలో కొంతైనా భయం కలుగుతుంది.

Pages