S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

11/05/2017 - 23:00

హైదరాబాద్‌లో జరిగిన కోటి దీపోత్సవంలో మాట్లాడుతూ తెలంగాణ ఎం.పి. కవిత ‘ఈ దీపోత్సవం వల్ల తెలంగాణ ప్రజలందరికీ సుఖం కలగాలి’ అని అనటం జరిగింది. మరి, తెలంగాణ ప్రజలు ఒక్కరే సుఖంగా ఉంటే దేశమంతా సుఖంగా ఉంటుందా?... ‘నా తెలంగాణ’ అని కె.సి.ఆర్., ‘నా అమరావతి’ అని చంద్రబాబు అదే పనిగా అంటూంటారు. అంటే వీరందరికీ తమ స్వంత బాగోగులు తప్ప దేశ క్షేమం గురించీ, దేశ సుభిక్షం గురించీ ఏమీ అక్కర్లేదన్న మాట?...

11/03/2017 - 23:13

రాన్రాను సుప్రీంకోర్టు తీర్పులు తికమకపెడుతున్నాయి. గతంలో ఇచ్చిన తీర్పులను వారే తప్పుపడుతున్నారు. పదహారేళ్ల పెళ్లైన అమ్మాయిని స్వయంగా భర్త కలిసినప్పుడు వేసిన కేసులో దాన్ని అత్యాచారం కింద నమోదు చేయనవసరం లేదని తీర్పు ఇవ్వగా, ఇప్పుడు అదే మైనర్ భార్యతో కలిస్తే అత్యాచారం కింద శిక్ష వేయవచ్చని సెలవిచ్చింది. ఈ తీర్పు సమాజంలో సంచలనం సృష్టిస్తోంది. ఆడవారి వయసు పద్దెనిమిది, మగవారి వయసు ఇరవై ఒకటి దాటాలని..

11/03/2017 - 00:59

ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించడం కోసం టపాసులు కాల్చడాన్ని నిషేధించారు. దీనికన్నా ముందుగా 363 రోజులు కాలుష్యాన్ని వెదజల్లే కారణాలను అనే్వషించాలి. అర్బనీకరణ కూడా ఒక కారణం. సంప్రదాయక గ్రంథాల ప్రకారం ఈ కాలుష్యాన్ని ఎలా నివారించాలి? ఆలోచించి చర్చించాల్సిన విషయం.

11/01/2017 - 21:43

రైతులను రుణ విముక్తులను చేయాలనే సదుద్దేశంతో 1904లో స్థాపించిన సహకార సంస్థలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుట గమనార్హం. ముఖ్యంగా రాజకీయ నేతలు తమ రాజకీయ ప్రాబల్యం కోసం వాడుకొంటున్నారనేది జగమెరిగిన సత్యం. ప్రతి రాజకీయ నేత సహకార సంస్థల ఆసరాతోనే ఉన్నత రాజకీయ పదవుల నలంకరించారనుట అతిశయోక్తి కాదు. కనుక రాజకీయులను ఈ సంస్థలకు దూరంగా ఉంచటం మంచిది.

11/01/2017 - 00:51

దేశంలో అత్యున్నత చదువులు చదివి కనీసం నాలుగో తరగతి ఉపాథి లేక కోట్లాది మంది నిరుద్యోగులు బాధపడుతున్నారు. తల్లిదండ్రులకు భారమై ఉద్యోగ నియామకానికి గరిష్ఠ వయసు దాటి సతమత వౌతున్న వారెందరో ఉన్నారు. ప్రభుత్వాలు ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకుండా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనులు చేయించటంతో సంబంధిత అధికారి, ప్రజా ప్రతినిధుల సంబంధీకులనే ఆ ఖాళీలు వరిస్తున్నాయి.

10/30/2017 - 22:16

ఆంధ్రప్రదేశ్‌లో రెవిన్యూ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన గ్రామసభల తంతు నామమాత్రంగా, మొక్కుబడిగా సాగుతోంది. పల్లెలకు వచ్చిన అధికారులు షామియానాల కింద కూర్చుని విందుభోజనం చేసి మమ అనిపిస్తున్నారు. ప్రజాసమస్యలపై విస్తృత చర్చ జరగడం లేదు. సర్వేనెంబర్ల తప్పు అని, సమస్య పరిష్కరించాలని కోరితే ఆ దరఖాస్తులు బుట్టదాఖలు అవుతున్నాయి.
-కె.వి.ప్రసాదరావు, కందుకూరు
అప్పుడు ఎందుకు చెప్పలేదు

10/30/2017 - 00:43

మన దేశంలో ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్ల విధానం లోపభూయిష్టంగా ఉంది. ప్రతిభ ఉన్నప్పటికీ రిజర్వేషన్ల పరిధిలోకి రానివారు ఈ విధానం వల్ల నష్టపోతున్నారు. రిజర్వేషన్లు పొందుతున్నవారిలో సంపన్నులూ ఉన్నారు. ఆర్థిక, సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రతిభగల వారికి అన్యాయం జరగని విధంగా రిజర్వేషన్ల వ్యవస్థ ఉండాలి. ఒబిసి రిజర్వేషన్లలోని లోపాలను జస్టిస్ రోహిణి కమిషన్ సవరించాలి.

10/28/2017 - 00:45

దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ పరిసర ప్రాంతాలలో బాణసంచా విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఒక ఇంగ్లీషు ఛానల్‌లో పాత్రికేయుడు ఆర్నాబ్ గోస్వామి వ్యాఖ్యలు, కార్యక్రమం ప్రజలను రెచ్చగొట్టేదిగా ఉంది. హిందు సంప్రదాయాలపై దాడిగా పేర్కొనడం భావ్యం కాదు. ఢిల్లీలో జీవించడానికి అనువైన వాతావరణం కోసమే ఆ సూచనగా పరిగణించాలి.

10/27/2017 - 00:24

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల విద్యార్థినీ విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇష్టం లేకపోయినా కార్పొరేట్ విద్యాసంస్థల్లోను, హాస్టళ్లలోను పిల్లల్ని చేర్పించి, నచ్చని కోర్సులను రుద్దడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఇంగ్లీషు మీడియం, కార్పొరేట్ విద్యపై మోజు, పెద్దవాళ్లయ్యాక తమ పిల్లలు బాగా సంపాదించాలన్న అత్యాశ పిల్లల ప్రాణాలు తీస్తున్నాయి.

10/25/2017 - 21:35

విశాఖపట్టణంలోని పాతనగరంలో సీతారామస్వామి ఆలయం జీర్ణావస్థకు చేరుకుంది. ఒకప్పుడు ఇక్కడికి వేలాదిమంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకునేవారు. ఆలయం శ్లాబు పెచ్చులూడుతోంది, గచ్చులు పగిలిపోయాయి. ఆలయగోపురం, ప్రహరీలపై పిచ్చి మొక్కలు మొలిచాయి. దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లకముందు ఆలయ నిర్వహణ చక్కగా ఉండేది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ఆలయానికు పూర్వవైభవం వచ్చేలా పునరుద్ధరించాలి.

Pages