S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

10/16/2017 - 00:59

సహకార చట్టానికి కోతలు విధిస్తున్నారని, సహకార సంఘాల లావాదేవీలను, బ్యాంకుల కార్యకలాపాలను రిజర్వు బ్యాంకు ద్వారా కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేయబోతున్నదని ప్రచారం జరిగింది. అయితే సహకార రంగం ద్వారానే రైతులను బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఈ మధ్య నిర్ణయానికి వచ్చారు.

10/15/2017 - 00:55

వైవాహిక ధర్మం ప్రకారం తాళి కట్టించుకొన్న భార్య అయినా, ఆమె వయస్సు 18 ఏళ్ళు లోపు వుంటే, భర్త ఆమెతో లైంగిక చర్యలో పాల్గొనడం అత్యాచార నేరం అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టంగా ప్రకటించటం భారతీయ సమాజంలో సనాతన మత సంప్రదాయాలను అనుసరించే వర్గాలతోపాటు ఆడపిల్లలను త్వరగా ఒక అయ్య చేతిలో పెట్టి భారం వదుల్చుకోవాలని అభిలషించే అసంఖ్యాక మధ్య, పేద తరగతి కుటుంబాలలో సంచలనాంశం అయింది.

10/14/2017 - 00:44

కంటిచూపు సరిగ్గా లేక దైనందిన కార్యక్రమాలను చేసుకోవడానికి కూడా ఇతరులపై ఆధారపడేవారికి ఆసరాగా ఉండేందుకు సృష్టించిన చేతికర్రను ‘వైట్‌కేన్’గా పిలుస్తారు. అది కనిపెట్టిన సందర్భానికి గుర్తుగా ఏటా అక్టోబర్ 15న ‘వైట్‌కేన్ డే’ పాటిస్తారు. నిజానికి ఇది అమెరికాలో మొదట మొదలైంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీనిని నిర్వహిస్తున్నారు.

10/13/2017 - 00:50

ఫర్యావరణానికి కాలుష్యం వల్ల చేటు జరుగుతోందన్నది అందరికీ తెలిసిన విషయమే. మనిషి మనుగడకు సవాలు విసురుతున్న కాలుష్యం రకరకాలుగా ఉంటోంది. వాయు, జల కాలుష్యాలు జీవరాశి ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ఇప్పుడు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న విమానాలకు కూడా కాలుష్యంవల్ల కష్టాలు మరింతగా పెరగనున్నాయని తాజా అధ్యయనం తేల్చిచెబుతోంది.

10/11/2017 - 19:40

స్వతంత్ర పోరాటంలో, స్వతంత్ర భారత్‌లో అలుపెరుగని పోరాటాలు జరిపిన అసమాన యోధుడు డా.రామ్ మనోహర్ లోహియా, వౌలికమైన సామాజిక విధానాలపట్ల అనూహ్యమైన కసరత్తు జరిపిన కర్మయోగి. వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా తాను నమ్మిన విశ్వాసాల కోసం జీవితకాలం నిలబడి, రైతులు, గ్రామీణ ప్రజలు, అణగారిన వర్గాలు, కార్మికుల సంక్షేమం కోసం స్వాతంత్య్రం తొలి రోజులలో పోరాటాలు జరిపిన తొలితరం నాయకులలో ప్రముఖులు.

10/11/2017 - 00:35

విప్లవ రచయితల సంఘం (విరసం) నక్సల్‌బరి ఉద్యమంపై ఇటీవల జాతీయ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించింది. గత మే మాసంలోను 50 ఏళ్ల నక్సల్‌బరి ఉత్సవాన్ని విరసం నిర్వహించింది. నక్సల్‌బరి పంథాని బలంగా ముందుకు తీసుకువెడుతున్న మావోయిస్టుల కార్యాచరణకు ఉత్సవంలో, సదస్సులో సంఘీభావం ప్రకటించారు. మావోయిస్టుల మనస్సులోని మాటలన్నీ విరసం నాయకుల నోట వినిపించాయి.

10/09/2017 - 00:44

‘దేశవ్యాప్తంగా శాసనసభలకు, పార్లమెంటుకి ఒకేసారి ఎన్నికల్ని నిర్వహించాలని భావిస్తే అందుకు మేం సిద్ధం’ అంటూ ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో ప్రధాని నరేంద్రమోదీ, అప్పటి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఒకే దేశం - ఒకేసారి ఎన్నికలకు మద్దతుగా తమ అభిప్రాయాలను ప్రకటించారు. అయితే ఈ తరహా ప్రతిపాదన మంచిచెడ్డలపై అన్ని కోణాల్లో చర్చ జరగవలసి ఉన్నది.

10/07/2017 - 00:46

అమెరికాలో తుపాకుల సంస్కృతి సాధారణ పౌరుల భద్రతకు పెనుముప్పుగా పరిణమించింది. ప్రపంచంలో మిగతా దేశాలతో పోలిస్తే అమెరికాలో అపరిమిత స్వేచ్ఛ, విచ్చలవిడి సంస్కృతి తాజా పరిణామాలకు కారణమవుతోంది. ప్రపంచ జనాభాలో అగ్రరాజ్య జనాభా కేవలం 4.4 శాతం. అయితే అధికారికంగా తుపాకులను కలిగి ఉన్నవారి సంఖ్య ప్రకారం చూస్తే ప్రపంచ జనాభాలో సగంమందికి ఉండాల్సినన్ని పౌరులు ఉపయోగించే తుపాకులు ఒక్క అమెరికాలోనే ఉన్నాయి.

10/06/2017 - 01:10

దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు పౌష్టికాహారం లభించక అవస్థలు పడుతున్నారు. అలాంటి వారి కోసం భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ రెట్టింపు చేసిన బలవర్థక ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఉప్పు, గోధుమపిండిని ఇప్పుడున్నదానికన్నా రెట్టింపు పోషకాలతో అందుబాటులోకి తీసుకురావాలన్నది ఆ సంస్థ యోచన. అయితే అది ఎవరుపడితే వారు తినడానికి కాదు.

10/04/2017 - 20:18

భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. పూర్తిగా అభివృద్ధి చెందిన దేశం కాదు. అభివృద్ధి చెందుతున్న క్రమంలోను, దశలోను, మూల పెట్టుబడి (కాపిటల్ ఇనె్వస్ట్‌మెంట్) అంతా ఉత్పత్తి కారకమైన ప్రాజెక్టుల మీదనే పెట్టాలి. నీటిపారుదల ప్రాజెక్టులు, భారీ పరిశ్రమలు, వౌలిక సదుపాయాల కల్పన, రహదారుల విస్తరణ, విద్య మొదలైన ఉత్పాదక రంగాల్లోనే అత్యధిక మూల పెట్టుబడిని వినియోగించాలి.

Pages