S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

10/29/2017 - 00:59

అణుయుద్ధాన్ని నివారించడానికి, తద్వారా మానవజాతి హననాన్ని ఆపడానికి అంతర్జాతీయ ప్రభుత్వం ఏర్పడాలని ఱఉ్గ్గ గశ్రీడడఉజ అనే ఆంగ్ల రచయత ళ్జ్జో డఉ్ళఉ శ్రీ్ళజఉ్గ అనే గ్రంథంలో 60 ఏళ్ల క్రితమే చెప్పాడు. సుస్థిర ప్రపంచశాంతి నెలకొల్పడానికి ప్రాక్పశ్చిమ దేశాల మధ్య వైరభావాన్ని తగ్గించడానికి అంతర్జాతీయ ప్రభుత్వం ఏర్పడాలన్నాడు. ఇదెంతో మానవీయ భావన. అప్పుడు ప్రపంచం కేవం రెండు శిబిరాలుగా మాత్రమే వుండేది.

10/28/2017 - 00:44

స్వామి వివేకానందుని స్ఫూర్తితో మనదేశంలో అడుగుపెట్టి వ్యక్తి, జాతి నిర్మాణానికి జీవితాన్ని నివేదించి భారతీయుల మనసులలో ‘సోదరి’గా చిరస్థానం సంపాదించిన స్ఫూర్తిప్రదాత సిస్టర్ నివేదిత. మహిళలకు విద్య ద్వారానే సాధికారత సాధ్యమవుతుందని నమ్మి, ప్రచారం చేసి, దానిని సాకారం చేసిన మహనీయురాలు ఆమె. 1867 అక్టోబర్ 28న ఐర్లండులో మార్గరెట్ నోబుల్ జన్మించింది. పదిహేడేళ్ల వయసులో ఉపాధ్యాయ వృత్తిలో చేరింది.

10/27/2017 - 00:19

బహుళ అంతస్తుల భవనాలు, అపార్టుమెంట్లలో ఇటీవలి కాలంలో జరిగిన ‘లిఫ్ట్’ల ప్రమాదాలలో మరణాలు సంభవించాయి. గత నెలలో హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో జీవితభీమా ఉద్యోగి ఒకరు మరణించిన తీరు విషాదానికి కారణమైంది. నిజానికి ఆయా భవంతులు, అపార్టుమెంట్లలో లిఫ్ట్‌ల నిర్వహణపై అటు బిల్డర్లకు, ఇటు నివాసం ఉంటున్నవారికి శ్రద్ధ లేదు. పర్యవేక్షించే అధికారులు లేరు.

10/25/2017 - 21:41

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సిపిసి) 19వ మహాసభలు బీజింగ్‌లో ముగిసాయి. ఆ పార్టీ అధ్యక్షుడు జిన్‌పింగ్ మహాసభల ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ చైనాలో నాణ్యమైన అభివృద్ధి కోసం విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని, విదేశీయుల భాగస్వామ్యం కోసం చైనా ద్వారాలు తెరిచే ఉన్నాయని చెప్పారు.

10/24/2017 - 23:08

ఐటీ రంగానికి కేంద్రంగా వేగంగా ఎదుగుతున్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. వాయు, శబ్ద కాలుష్యానికి భాగ్యనగరం కేంద్రంగా మారిపోతోంది. ప్రపంచంలో కాలుష్యంతో సతమతమవుతున్న నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. మొన్నమొన్నటి వరకు బీజింగ్ మొదటి స్థానంలో ఉండగా అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి.

10/24/2017 - 01:02

అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థయే ఐక్యరాజ్యసమితి. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించడంలో విఫలమైంది. దీనికి ప్రత్యామ్నాయంగా 1945లో ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించింది.

10/22/2017 - 00:37

ప్రపంచంలో రోజురోజుకు చెత్త పెరిగిపోతోంది. ముఖ్యంగా వేల సంవత్సరాలైనా పూర్తిగా ధ్వంసం కాని ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ పరికరాల వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోతున్నాయి. ఇక రోజువారీగా ఇళ్లనుంచి బయటపడుతున్న చెత్త తక్కువేమీ కాదు. కాలుష్యానికి, రోగాల వ్యాప్తికి ఇదే కారణం. ప్రపంచం నెత్తిన పెద్దమొత్తాల్లో వ్యర్థ పదార్థాలను కుమ్మరిస్తున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలుస్తోంది.

10/20/2017 - 23:05

సామాజిక మాధ్యమాల ప్రభావం యువతను, బాలబాలికలను పెడదారి పట్టిస్తోంది. ఆధునిక సమాజంలో చిన్న కుటుంబాల వ్యవస్థకు ప్రాధాన్యం పెరగడం, దంపతులు సంపాదన కోసం వివిధ వృత్తులు, బాధ్యతల నిర్వహణలో మునిగితేలుతుండటం వల్ల పిల్లల బాగోగులపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వినియోగం పెరిగిపోయింది.

10/18/2017 - 21:28

ఇకమీదట ప్రతి హిందువు తనకి సంతోషాన్నిచ్చే పండగలను ఎవరేమంటారోనని సిగ్గుతో చచ్చిపోతూ చేసుకోవాలి. తాజాగా అక్టోబర్ 31 వరకు ఢిల్లీలో బాణాసంచా అమ్మరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీపావళినాడు మూడు గంటలకు మించి బాణసంచా కాల్చరాదని అక్టోబర్ 13, 2017న పంజాబ్, హర్యానా హైకోర్టులు ఆదేశాలిచ్చాయి.

10/18/2017 - 00:17

ఈఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అమెరికాకు చెందిన ప్రొఫెసర్ థాలెర్‌కు దక్కింది. ఆర్థిక శాస్త్రాన్ని మనస్తత్వ శాస్త్రంతో సమ్మిళితం చేసి రూపొందించిన ప్రవర్తనా ఆర్థిక శాస్త్రం (బిహేవియరల్ ఎకనామిక్స్) అందరిని ఆకర్షించింది. ఈ నూతన పరిశోధనాత్మక ప్రతిపాదనకు గాను నోబెల్ కమిటీ బహుమతిని ప్రకటించింది.

Pages