S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/06/2017 - 01:45

న్యూఢిల్లీ, జూన్ 5: వాస్తవాధీన రేఖ వద్ద చొరబాట్లను కొనసాగిస్తే అందుకు తగిన ప్రతీకార చర్యలు తప్పవని భారత ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డిజిఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ ఎకె భట్ పాకిస్తాన్ డిజిఎంఓ మేజర్ జనరల్ షాహిర్ శంషాద్ మీర్జాకు స్పష్టం చేశారు. సోమవారం ఇద్దరు డిజిఎం ఓలు ఫోన్‌ద్వారా సంభాషించుకున్నారు.

06/06/2017 - 01:44

బీజింగ్, జూన్ 5: అణు ఇంధన సరఫరా బృందంలో భారత్‌కు సభ్యత్వం రావటం ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అత్యంత సంక్లిష్టమైనదని చైనా మరోసారి స్పష్టం చేసింది. ఎన్ ఎస్‌జి లో భారత సభ్యత్వాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న చైనా అణ్వస్త్ర నిరోధ ఒప్పందంపై సంతకం చేయని దేశాల విషయంలో అనుసరిస్తున్న వైఖరే భారత్‌కు కూడా వర్తిస్తుందని మరోసారి పేర్కొంది.

06/06/2017 - 01:43

బీజింగ్, జూన్ 5: సరిహద్దుల విషయమై భారత్-చైనా మధ్య కొనసాగుతున్నప్పటికీ ఇరు దేశాల సరిహద్దు వద్ద గత 40 ఏళ్లలో ఒక్క బుల్లెట్ కూడా పేలలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొద్దిరోజుల క్రితం రష్యాలో చేసిన వ్యాఖ్యలను చైనా స్వాగతించింది. ‘మోదీ చేసిన సానుకూల వ్యాఖ్యలను మేము స్వాగతిస్తున్నాం’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ సోమవారం విలేఖరులకు తెలిపారు.

06/06/2017 - 01:42

బీజింగ్, జూన్ 5: చైనా సైనికదళ (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) హెలికాప్టర్లు నిబంధనలకు విరుద్ధంగా భారత గగనతలంలోకి ప్రవేశించి ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని బారాహోటీ ప్రాంతంపై చక్కర్లు కొట్టడాన్ని ఆ దేశం సమర్ధించుకుంది.

06/06/2017 - 01:38

వాషింగ్టన్, జూన్ 5: చరిత్రాత్మక పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగాలని తమ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని తాము గట్టిగా సమర్థిస్తున్నామని, ఈ ఒప్పందం విషయంలో తాము ఏమి చేయాలో భారత్, చైనా, ఫ్రాన్స్ చెప్పాల్సిన అవసరం లేదని ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా పనిచేస్తున్న నిక్కీ హేలీ చెప్పారు.

06/06/2017 - 01:37

దుబాయ్, జూన్ 5: అరబ్ దేశాల మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపులకు అండగా నిలవడంతోపాటు ఇరాన్‌తో సంబంధాలను కొనసాగిస్తున్న ఖతార్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ సోమవారం నాలుగు అరబ్ దేశాలు దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకున్నాయి. ఖతార్ నుంచి తమ దౌత్య సిబ్బందిని ఉపసంహరించుకుంటున్నట్లు బహ్రెయిన్, ఈజిప్టు, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) ప్రకటించాయి.

06/05/2017 - 04:09

సియోల్, జూన్ 4: ఐక్యరాజ్యసమితి తాజాగా తీవ్ర ఆంక్షలు విధించినప్పటికీ, తమ క్షిపణి అణ్వాయుధాల కార్యక్రమాలను విడనాడే ప్రసక్తే లేదని ఉత్తర కొరియా ఆదివారం నాడు తెగేసి చెప్పింది. అమెరికా రూపొందించిన తీర్మానాలను ఆమోదిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఉత్తరకొరియాపై కఠినమైన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

06/05/2017 - 02:48

లండన్, జూన్ 4: బ్రిటన్‌లో వచ్చే గురువారం జరగాల్సిన సార్వఅతిక ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ప్రధాని తెరిసా మే ప్రకటించారు. లండన్‌లో శనివారం ఉగ్రవాద దాడి అనంతరం భద్రతా దళాల ఉన్నతాధికారులతో అత్యవసర ‘కోబ్రా’ సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించిన అనంతరం మే విలేఖరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య ప్రక్రియను హింస భగ్నం చేయడానికి ఎప్పటికీ అనుమతించకూడదు’ అని అన్నారు.

06/05/2017 - 02:12

లండన్, జూన్ 4: బ్రిటన్ రాజధాని లండన్ మహానగరం మరోసారి ఉగ్రదాడులతో రక్తసిక్తమయింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి పది గంటల సమయంలో అత్యంత వేగంగా వచ్చిన ఒక తెల్లవ్యాన్ ప్రఖ్యాత లండన్ బ్రిడ్జిపై పాదచారులపైకి దూసుకెళ్లింది.

06/04/2017 - 01:43

పారిస్, జూన్ 3: పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి పారిస్ ఒప్పందానికి మించి తాము కృషి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పారిస్ ఒప్పందంనుంచి వైదొలగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన రెండు రోజుల తర్వాత ఫ్రెంచ్ కొత్త అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్‌తో శనివారం సమావేశమైన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Pages