S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

04/22/2018 - 02:16

అబుదాబిలోని అల్-మిర్ఫా సముద్ర తీరం శనివారం నిర్వహించిన సెయంగ్ పోటీల్లో పాల్గొన్న పడవలతో కొత్త అందాలను సంతరించుకుంది.

04/22/2018 - 02:14

సియోల్‌లో శనివారం తైక్వాండో మార్షల్ ఆర్ట్స్‌లో
10వేల మంది పిల్లలు తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించే అవకాశం ఉంది.

04/22/2018 - 01:55

సియోల్, ఏప్రిల్ 21: అణ్వాయుధ పరీక్షలతో ప్రపంచ దేశాలను గడగడలాడించిన ఉత్తర కొరి యా శనివారం సంచలన ప్రకటన చేసింది. అణ్వాయుధ, మీడియం రేంజ్, ఖండాంతర క్షిపణి పరీక్షలు ఇకపై నిర్వహించబోమంటూ ప్రకటించి సంచలనం రెకెత్తించింది. ఉత్తర కొరియా ప్రకటన వెలువడిన నిమిషాల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ‘అతి పెద్ద పురోగతి’ అంటూ ట్వీట్‌లో చేశారు.

04/21/2018 - 02:57

లండన్: మారుతున్న కాలానికి అనుగుణంగా కామనె్వల్త్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో సారథ్య బాధ్యతను బ్రిటన్ యువరాజు చార్లెస్ చేపట్టనున్నారు. 90ఏళ్లు దాటిన ఎలిజిబెత్ రాణి సూచనమేరకు ఆయన వారసత్వానికి ఓటేస్తూ కామనె్వల్త్ ప్రభుత్వాధినేతలు శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. విండ్‌సర్ క్యాజిల్‌లో జరిగిన కామనె్వల్త్ దేశాల ఆంతరంగిక భేటీలో అన్ని దేశాల మధ్య ఈమేరకు అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది.

04/20/2018 - 02:57

లండన్: భారత్‌లో జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా, కొన్ని గ్రూపులు ఇక్కడ చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. బుధవారం పార్లమెంట్ స్క్వేర్ వద్ద ఏర్పాటు చేసిన 53 దేశాల ఫ్లాగ్‌పోల్స్‌లో, భారత్‌కు చెందిన జాతీయ పతాకాన్ని కొందరు నిరసనకారులు కిందికి లాగేశారు. దీనిపై మెట్రోపాలిటన్ పోలీసులు వివరణ ఇస్తూ, ‘పార్లమెంట్ స్క్వేర్ వద్ద ఫ్లాగ్‌పోల్ నుంచి భారత పతాకాన్ని కొందరు కిందికి లాగేశారు.

04/20/2018 - 02:12

లండన్, ఏప్రిల్ 19: కామన్‌వెల్త్ దేశాల అధినేతగా తన కుమారుడు ప్రిన్స్ చార్లెస్‌ను నియమించాలని, బ్రిటన్ రాణి రెండో ఎలిజెబెత్, కామన్‌వెల్త్ సభ్య దేశాల అధినేతలకు విజ్ఞప్తి చేశారు. 53 దేశాల ఈ గ్రూపునకు నాయక త్వం వహించే విషయంలో బ్రిటన్ రాణి ప్రత్యక్షంగా క ల్పించుకోవడం ఇదే ప్రథమం. ఇక్కడ రెండు రోజుల పా టు జరిగిన చోగమ్ సమావేశాన్ని ఆమె ప్రారంభించారు.

04/20/2018 - 02:07

సమస్త జీవజాతుల్లో దేని ప్రత్యేకత దానిదే.. ఆకృతిలోనూ, ఆకారంలోనూ ఈ ప్రత్యేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తమ జాతి లక్షణాలను అన్ని జీవులూ ప్రస్ఫుటిస్తాయ.
ఉత్తర జర్మనీలోని ఓ గూట్లో ఇలా ఆనందాన్ని పంచుకుంటున్న చూడముచ్చటైన కొంగల జంట.

04/20/2018 - 01:35

న్యూయార్క్, ఏప్రిల్ 19: టైమ్ మ్యాగజీన్ ప్రకటించిన ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తుల జాబితాలో ఒలా సహ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్, బాలీవుడ్ నటి దీపికా పడుకొనె, భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యానాదెండ్ల చోటు సంపాదించారు. వీరి పేర్లు జాబితాలోని తొలి వంద స్థానాల్లోపే ఉండటం గమనార్హం. ఇక వార్షిక గౌరవనీయుల జాబితాలోఅమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరు చేర్చారు.

04/19/2018 - 03:38

లండన్, ఏప్రిల్ 18: లింగాయత్ తత్వవేత్త బసవేశ్వర ప్రవచించిన సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. లండన్‌లోని థేమ్స్ నది ఒడ్డున నిర్మించిన 12వ శతాబ్దానకి చెందిన ప్రముఖ సంఘసంస్కర్త బసవేశ్వర విగ్రహానికి ఆయన బుధవారం పుష్పాంజలి సమర్పించారు.

04/19/2018 - 03:53

లండన్, ఏప్రిల్ 18: ఐరోపా సమాజంనుంచి బయటకు వెళ్లినప్పటికీ బ్రిటన్‌తో కొనసాగుతున్న సంబంధాల్లో ఏవిధమైన మార్పు ఉండబోదని ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని థెరెసా మేకు స్పష్టం చేశారు. బ్రెగ్జిట్ తర్వాత రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు మరింత జవజీవాలు కల్పించాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. బుధవారం భారత్, బ్రిటన్ ప్రధానులు మోదీ, థెరెసా మే మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలు ఫలవంతమయ్యాయి.

Pages