S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

06/28/2018 - 04:55

బీజింగ్, జూన్ 27: అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ ముదురుతున్న సమయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జేమ్స్ మాటిస్ కలవడం అంతర్జాతీయ దౌత్య, రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. నెల రోజులుగా అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న విషయం విదితమే. తమ దిగుమతులపై సుంకాలను అమెరికా పెంచినందుకు నిరసనగా చైనా ప్రతీకార చర్యలు తీసుకుంది.

06/28/2018 - 04:54

ఖుంతి (జార్ఖండ్), జూన్ 26: కిడ్నాప్ అయిన ముగ్గురు పోలీసుల కానిస్టేబుళ్ల కోసం చేపట్టిన తనిఖీలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ విధులకు ఆటంకం కల్పిస్తున్న గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ఖుంతి జిల్లాలోని ఘాఘ్రా గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పాతాళ్‌గ్రహీ అనే సంస్థ మద్దతుదారులు బీజేపీ ఎంపీ కరియా ముండా నివాసం వద్ద నుంచి ముగ్గురు కానిస్టేబుళ్లను కిడ్నాప్ చేశారు.

06/27/2018 - 04:13

కాఠ్మండూ, జూన్ 26: భారత్, చైనాలతో సుహృద్భావ సంబంధాలు కొనసాగించాలనే నేపాల్ కోరుకుంటున్నదని ఆ దేశ ప్రధాని కె.పి. శర్మ ఓలి పేర్కొన్నారు. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాలకోసం ఇరుగుపొరుగు దేశాలతో రాజకీయ క్రీడలు నెరపడంపై తమకు ఎంతమాత్రం విశ్వాసం లేదని మంగళవారం పార్లమెంట్‌కు తెలిపారు. ఇటీవల తాను చైనాలో జరిపిన ఆరురోజుల పర్యటన వివరాలను ఆయన పార్లమెంట్‌కు వివరించారు.

06/27/2018 - 04:19

లండన్, జూన్ 26: మహిళలకు భారత్ అత్యంత ప్రమాదకర దేశమని థామ్సన్ రాయ్‌టర్స్ ఫౌండేషన్ సర్వే పేర్కొంది. భారత్‌లో మహిళలపై లైంగిక హింస అత్యధికమని పేర్కొంది. ఇదే విషయంలో తర్వాతి స్థానాలను వరుసగా ఆఫ్ఘనిస్తాన్, సిరియాలు ఆక్రమించాయి. సోమాలియా, సౌదీ అరేబీయాలు నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.

06/26/2018 - 01:26

టొరొంటో, జూన్ 25: వీసాల జారీ ప్రక్రియలో కెనడా ప్రభుత్వం చేసిన మార్పులు భారత్ విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. వీసాలు త్వరితగతిన మంజూరు చేయడంతోపాటు పలు మార్పులు ప్రభుత్వం తీసుకొచ్చింది. అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వీసాల జారీలో తీసుకున్న నిర్ణయం భారత్‌కు తీవ్ర నిరాశకలిగించింది. 4టైర్ వీసాల మంజూరు జాబితాలో భారత్‌ను చేర్చకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

06/26/2018 - 01:03

వాషింగ్టన్, జూన్ 25: ‘దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని తక్షణమే గెంటేస్తాం. ఈ విషయంలో కోర్టుల్లేవ్.. కేసుల్లేవ్.. కేవలం చర్యలే. మా దేశంపైకి దండెత్తేవారిని ఉపేక్షించి ఊరుకోం ’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

06/24/2018 - 05:37

బ్రస్సెల్స్, జూన్ 23: ఈ నెల 28, 29 తేదీల్లో ఐరోపా యూనియన్ దేశాల సదస్సు బ్రస్సెల్స్‌లో జరుగుతున్న నేపథ్యంలో ఈ దేశాల్లోకి వచ్చే శరణార్ధుల సమస్యను పరిష్కరించే విషయమై యూనియన్ దేశాల ప్రతినిధులు ఒక ప్రణాళికను ఖరారు చేయనున్నారు. శరణార్థులు మెరుగైన జీవితం కోసం ఐరోపా దేశాలకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కాని దీని వల్ల ఈ దేశాల్లో రాజకీయ సంక్షోభం తలెత్తుతోంది.

06/24/2018 - 06:15

జమ్ము, జూన్ 23: జమ్ముకాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, దీని విచ్ఛిన్నానికి జరిగే కుట్రలను తిప్పిగొడుతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ కృషి వల్లే భారత్‌లో కాశ్మీర్ అంతర్భాగమైందని ఆయన అన్నారు. జమ్ముకాశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టించడానికి, ఈ ప్రాంతాన్ని దేశం నుంచి వేరు చేయడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

06/23/2018 - 04:19

ఐక్యరాజ్య సమితి, జూన్ 22: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యోగాను అభ్యాసం చేస్తున్నారని, దీనికి మతమంటూ ఏదీ లేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. న్యూయార్క్ రాష్ట్రంలోని కాట్‌స్కిల్స్ ప్రాంతంలో ‘యోవన్ లగ్జరీ నేచర్ క్యూర్ సెంటర్’ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, ప్రపంచ ప్రజలను ఏకం చేయగల శక్తి యోగాకు ఉందన్నారు.

06/23/2018 - 05:07

వాషింగ్టన్, జూన్ 22: అమెరికాలో అక్రమంగా ప్రవేశించి అరెస్టయిన వారిని రెండు నిర్బంధ కేంద్రాల్లో ఉంచారని, వీరిలో దాదాపు వంద మందికిపైగా భారతీయులు ఉన్నట్లు అమెరికాలోని ఇండియన్ మిషన్ ప్రకటించింది. వీరిలో చాలామంది పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారున్నారు.

Pages